‘చంద్రబాబు’ భజన చేస్తోన్న ‘రిటైర్డ్ ఐఏఎస్’...!
ఆయనో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. రాష్ట్ర సర్వీసులోనూ, కేంద్రసర్వీసుల్లోనూ పనిచేశారు. అయితే..ఇటీవల కాలంలో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ భజన చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా..‘చంద్రబాబు’ ఏ పనిచేసినా..అబ్బోఅద్భుతం..ఆమోఘం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన చేస్తోన్న భజన చూసి రిటైర్డ్ ఐఏఎస్‌లు, ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా ఇదెక్కడ భజనరా..బాబూ..అంటూ..నొసలు చిట్లిస్తున్నారు. ఆయనకేమి కావాలో..? ఆయనకు కావాల్సిందేదో..‘చంద్రబాబు’ ఇచ్చేస్తే..ఈ భజన తగ్గుతుంది కదా..? ఎందుకు భజన చేసి..‘చంద్రబాబు’ను తప్పుదోవ పట్టిస్తున్నారో..అంటూ ధీర్ఘాలు తీస్తున్నారు. వాస్తవానికి ఈ రిటైర్డ్ ఐఏఎస్ ‘చంద్రబాబు’కు దగ్గరేమీ కాదు. గతంలో ‘చంద్రబాబు’ అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో విభేదించి..‘జగన్’ను సమర్ధించారు. ‘జగన్’ గెలుపుకోసం తనవంతు ప్రయత్నాలు చేశారు. ఆయనకు అన్ని విధాలుగా సహకరించారు. ‘జగన్’ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘చంద్రబాబు’పై కేసులు నమోదు చేయించడానికి ప్రధాన కారకుడయ్యారు. అయితే..తరువాత కాలంలో ఆ కేసుల విషయంలో తన తప్పేమీ లేదని, ఇది ‘చంద్రబాబు’ సిఎంఓలో పనిచేసిన అధికారి పనేనంటూ..ప్రచారాన్ని ప్రారంభించారు. దీంతో..‘చంద్రబాబు’ సిఎంఓలో పనిచేసిన అధికారి..అదంతా అసత్యమని, ఆయన తప్పులు చేసి తనపై రుద్దుతున్నారంటూ..ఎదురుదాడి చేశారు. తాను చేసిందేమీ లేకపోయినా..ఆయన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తనపై అభాండాలు వేస్తున్నారని ఆయన సన్నిహితులతో వ్యాఖ్యానించారు. సర్వీసులో ఉన్నప్పుడు ఈ రిటైర్డ్ ఐఏఎస్ అడ్డదిడ్డంగా ఫైల్స్ రాశాడని, దాంతోనే ‘చంద్రబాబు’ను ఇరికించారనే మాట అధికార వర్గాల్లో ఉంది. ఇప్పుడు ఆయన అవసరాల కోసం ‘చంద్రబాబు’ను పొగడానికి, ఆయన భజనచేయడానికి నిత్యం యత్నిస్తున్నారని, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఈకోవలోకే వస్తాయనే అభిప్రాయం అధికార, రాజకీయ వర్గాల్లో ఉంది. రిటైర్డ్ ఐఏఎస్‌గా ఆయన కొన్ని ప్రవేట్ సంస్థల్లో పనిచేయాలని కోరుకున్నా..ఆయా సంస్థలు ఇతని వ్యవహారాలు తెలుసుకుని దూరం పెడుతున్నాయని, ఈ పరిస్థితుల్లో ‘చంద్రబాబు’ను మచ్చిక చేసుకుని, ఏదో ఒక పదవి సాధించాలని కోరుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. అయతే..ఆయనను ‘చంద్రబాబు’ అంత తేలిగ్గా నమ్మరని రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ‘చంద్రబాబు’ ఆయనను నమ్మితే..‘చంద్రబాబు’ను దేవుడు కూడా కాపాడలేరని వారు అంటున్నారు.