లేటెస్ట్

‘బాబు’కు ‘పవన్‌’ఝ‌ల‌క్‌:ఏబీఎన్‌ ఆర్‌కె

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇదే రీతిలో మెతకవైఖరి అవలంభిస్తే ‘జనసేన’ అధినేత ‘పవన్‌కళ్యాణ్‌’ కూటమి ప్రభుత్వం నుంచి వైదొలుగుతారని ఏబీఎన్‌ ఆర్‌కె తన ‘వీకెంట్‌ కామెంట్‌’లో వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యర్ధిపార్టీల విషయంలో కానీ, స్వంత పార్టీ ఎమ్మెల్యేల విషయంలో కానీ కఠినంగా వ్యవహరించలేకపోతున్నారని, ఆయన మెతకవెఖరితో ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారని, గతంలో ‘జగన్‌’ ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలకంటే ఎక్కువ అరాచకాలు ‘టిడిపి’ ఎమ్మెల్యేలు చేస్తున్నారని, వారిని కట్టడి చేయకపోతే ‘పవన్‌’ కూటమి నుంచి వైదొలుగుతారని ‘ఆర్‌కె’ హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఆయనేమి చేయాలనుకుంటున్నారో తెలియడం లేదని, అంతా తనకే తెలుసున్నట్లు వ్యవహరిస్తున్నారని, రాజకీయాలను పట్టించుకోకుండా ఎప్పుడూ అధికారులతో సమీక్షలు, సమావేశాలతో సమయం వృధా చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇలా చేస్తే 2029 ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి పాలవుతుందని కూడా ‘ఆరెకె’ అన్నారు. ‘చంద్రబాబు’ చాతకానితనంతో వైకాపా నాయకులు రెచ్చిపోతున్నారని, తప్పుడు పనులు చేసిన వారిని కూడా అరెస్టు చేయకుండా, మీనమేషాలు లెక్కిస్తున్నారని, ‘చంద్రబాబు’ ఇస్తోన్న అలుసు తీసుకుని, వారు బరితెగిస్తున్నారని, ఇలా అయితే..టిడిపి క్యాడర్‌లో మానసిక స్థైర్యం దెబ్బతింటుందని, వచ్చే ఎన్నికల నాటికి వారెవరూపనిచేసే పరిస్థితి ఉండదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు’ తన మెతకవైఖరితో ‘లోకేష్‌’ భవిష్యత్‌ను కూడా నాశనం చేస్తున్నారని, 2029 నాటికి ‘జగన్‌, పవన్‌,లోకేష్‌’లే రంగంలో ఉంటారని, ఇప్పుడు ‘లోకేష్‌’ను నియంత్రిస్తే..రాబోయే కాలంలో ఆయన వారిద్దరినీ ఎలా ఎదుర్కొంటారని కూడా ఆయన ప్రశ్నించారు. ‘పవన్‌’ మరింత కాలం ‘చంద్రబాబు’తో సఖ్యతతో ఉండరని, ఆయన ఏరోజైనా ‘చంద్రబాబు’ను వదిలేస్తారని, ఆయనను పైనుంచి ‘బిజెపి’ ప్రోత్సహిస్తోందని,ఆయనపైనే ఆధారపడి రాజకీయాలు చేస్తే ‘చంద్రబాబు’ చావుదెబ్బ తింటారని, తెలుగుప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ భవిష్యత్‌ను ‘చంద్రబాబు’ నాశనం చేస్తున్నారని ‘ఆర్‌కె’ ఘాటుగా వ్యాఖ్యానించారు. మొత్తం మీద..‘చంద్రబాబు’ వ్యవహారశైలితో అటుపార్టీ, ఇటు ‘లోకేష్‌’ నష్టపోతున్నారని, ఇప్పటికైనా ‘చంద్రబాబు’ తన తీరు మార్చుకోవాలని ‘ఆర్‌కె’ సూచించారు. ‘చంద్రబాబు’పై ‘ఆర్‌కె’ ఎక్కుపెట్టిన వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో జోరుగా చర్చసాగుతోంది. ముఖ్యంగా ‘చంద్రబాబు’కు ‘పవన్‌’ ఝ‌ల‌క్‌ ఇస్తారన్న ఆయన వ్యాఖ్యలను వైకాపా ట్రోల్‌ చేస్తోంది. ఆ పార్టీ ఇటీవల కాలంలో..వారిద్దరూ విడిపోతారని వారి స్వంత పత్రికలో వ్యాసాలు రాయిస్తున్నారు. ఇప్పుడు ‘టిడిపి’ని సమర్ధించే ‘ఆర్‌కె’ కూడా అటువంటి వ్యాఖ్యాలే చేయడం..గమనార్హం.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ