లేటెస్ట్

‘సాక్షి’పై చర్యలు..!?

నిన్న ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ విలేకరుల సమావేశంలో పేర్కొన్న మాటలను వక్రీకరించిన ‘సాక్షి’ దినపత్రికపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే ప్రచారం సాగుతోంది. ‘సూపర్‌ సిక్స్‌’ను అమలు చేయడం లేదంటూ ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’ చెప్పారంటూ ఈరోజు ‘సాక్షి’ పత్రిక బ్యానర్‌ వార్తను ప్రచురించింది. ఆర్థిక పరిస్థితి బాగాలేనందున ‘సూపర్‌సిక్స్‌’ అమలు చేయడంలేదని, ఆర్థిక పరిస్థితి బాగైన తరువాత ‘సూపర్‌సిక్స్‌’ను అమలుచేస్తామని ముఖ్యమంత్రి అన్నట్లు ‘సాక్షి’ ప్రచురించింది. అయితే..వారు పేర్కొన్న విధంగా ముఖ్యమంత్రి అనలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా సంక్షేమ పథకాలను అమలు చేసి చూపిస్తామని, చెప్పిన పథకాలే కాకుండా, మరికొన్ని పథకాలను కూడా చేస్తామని ఆయన అన్నారు. ఆయన మాట్లాడిరది ఒకటైతే..దాన్ని వక్రీకరించి..‘సాక్షి’ ప్రచురించింది. దీనిపై ‘టిడిపి’ నేతలు, కార్యకర్తలు, ఇతర వర్గాలకు చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సాక్షి’ ప్రచురించిన వార్తపై ఈరోజు ‘టిడిపి’కి అనుకూలమైన ఛానెల్‌లో ఓ డిబేట్‌ జరిగింది. ఈ చర్చలో ‘సాక్షి’పై చర్యలు తీసుకోవాలని దానిలో పాల్గొన్నవారు డిమాండ్‌ చేశారు. చర్చకు మోడరేటర్‌గా వ్యవహరించిన సీనియర్‌ జర్నలిస్టు మాట్లాడుతూ ఇటువంటి వార్తలు వేరే దేశంలో ప్రచురిస్తే..రాళ్లతో కొట్టేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గూ,శరం, మానం, అభిమానం ఉన్నవారెవరైనా..ఇలా వార్త రాస్తారా..అంటూ ఆయన తీవ్రంగా స్పందించారు. రోతమీడియా బూతులు రాస్తోందని, ప్రభుత్వం ఇటువంటి వార్తలు రాసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘టిడిపి’ నేతలు సరిగా స్పందించలేదని, కూటమిపార్టీ నేతల్లో అసలు సృహలేదని, ఇటువంటి వార్తలు రాసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇదే వైకాపా హయాంలో జరిగితే..తీసుకెళ్లి జైలులో పారేసేవారని, కానీ టిడిపి మాత్రం స్పందించడం లేదని విమర్శించారు. కాగా ఈ చర్చలో పాల్గొన్న టిడిపినేత స్పందిస్తూ దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రెండు,మూడు రోజుల్లో చర్యలు ఉంటాయని వ్యాఖ్యానించారు. కాగా..ఈ వ్యవహారంలో టిడిపి, కూటమి నేతలు వ్యవహరిస్తున్న అలసత్వంపై పార్టీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.


‘నారాసుర రక్త చరిత్ర’...!

2014`19లో టిడిపి అధికారంలో ఉన్నప్పుడూ ఇదే విధమైన అసత్యాలను ‘సాక్షి’ వండివార్చింది. అప్పట్లో జరిగిన వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యను ‘చంద్రబాబు’ చేశారన్నట్లు ‘నారాసురరక్త చరిత్ర’ అంటూ..తాడికాయంత అక్షరాలతో..ఓ పేజీ వార్తను ‘సాక్షి’ ప్రచురించింది. అయితే..అప్పుడూ అధికారంలో ఉన్న ‘టిడిపి’ దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదొక్కటేనా..‘32 మంది కమ్మ డిఎస్పీలకు ప్రమోషన్లు’ అంటూ ‘సాక్షి’ ఓ అసత్యాన్ని పదే పదే ప్రచురించింది. ఇదొక్కటేనా...ఇటువంటివి రోజుకో వార్తను వదలుతూనే ఉంటుంది. కానీ..‘సాక్షి’పై మాత్రం ‘చంద్రబాబు’ ఎటువంటి చర్యలు తీసుకున్న పాపానపోలేదు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి కూడా మళ్లీ పాత విధానంలోనే అసత్యాలు, వక్రీకరణలతో ‘సాక్షి’ వార్తలను ప్రచురిస్తోంది. అయితే..దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాగా..ఈరోజు ముఖ్యమంత్రి వార్తను వక్రీకరించిన విషయంపై టిడిపిలోనూ, ఆ పార్టీఅభిమానుల్లోనూ..చర్చ సాగుతోంది. ‘చంద్రబాబు’ వారిపై చర్యలు తీసుకోరు..వారు అదే విధంగా అసత్యాలను వండివారుస్తారు..? వారు ప్రచురించే వార్తలను కొందరైనా నమ్ముతారు..దాంతో..మళ్లీ పార్టీకి నష్టమే జరుగుతుంది. గతంలో రాజధాని ‘అమరావతి’ని ‘కమ్మరావతి’ అంటూ చేసిన ప్రచారం కానీ, రాజధాని నిర్మాణాలను ‘గ్రాఫిక్స్‌’ అంటూ ‘సాక్షి’ దాని అనుబంధ సంస్థలు చేసిన ప్రచారంతో..టిడిపి ఘోరంగా దెబ్బతింది. ‘సాక్షి’ వల్ల ‘టిడిపి’ రాష్ట్రం ఎంత దెబ్బతిన్నా..ఆ సంస్థపై చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’కు ఎందుకో మనస్సు రావడం లేదు. వారిపై చర్యలు తీసుకోవాలంటే భయమా..? లేక ఇంకేమైనా చెప్పుకోలేని విషయాలు ఉన్నాయో తెలియదు కానీ..‘చంద్రబాబు’కు వ్యక్తిగతంగా, రాజకీయంగా తీవ్రమైన నష్టం చేస్తున్నా..? ఆయన మాత్రం వారిపై చర్యలు తీసుకోవడం లేదు. అయితే..ఆయన తనయుడు ‘నారా లోకేష్‌’ మాత్రం తనపై అసత్యవార్తలు రాసిన ‘సాక్షి’పై పరువునష్టం దావా వేశారు. ‘చినబాబు చిరుతిండి..అంటూ’ ‘సాక్షి’ ప్రచురించిన వార్తపై ఆయన కోర్టులో పరువు నష్టం దావా వేసి..కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. అయితే..ఇలా పరువునష్టం..ఇంకేదో..చేస్తే ‘సాక్షి’ దారికి రాదని, దాన్ని మూసివేయాలనే డిమాండ్‌ టిడిపి కార్యకర్తల నుండి, రాష్ట్రాభివృద్దిని కోరుకునేవారి నుంచి వస్తోంది. మరి చూద్దాం ఏమి జరుగుతుందో..? 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ