లేటెస్ట్

లీవ్‌లో ఐఏఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

రాష్ట్ర మైనింగ్‌శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తోన్న ఐఏఎస్‌ అధికారి ‘ప్రవీణ్‌కుమార్‌’ సెలవుపై వెళ్లారు. ఆయన వచ్చే నెల 16వ తేదీ వరకూ సెలవులో ఉంటారని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయన వ్యక్తిగత పనులపై సెలవుపై వెళ్లారని అందులో పేర్కొన్నారు. ఆయన బంధువులు చనిపోయారని, అందుకే సెలవులో వెళ్లారని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. అయితే..ఆయన సెలవుకు కారణం వేరే ఉందనే ప్రచారం సాగుతోంది. రాష్ట్ర మైనింగ్‌శాఖ డైరెక్టర్‌గా ఉన్న ఆయన ఇటీవల కాలంలో ఒక వివాదాస్పదమైన నిర్ణయం తీసుకున్నారని, దానిపై సిఎంఓ వర్గాలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం సాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తమ్ముడికి ముగ్గురాళ్ల గనులను లీజ్‌కు ఇచ్చిందని, సంక్రాంతి కానుకగా ఆయన జగన్‌ తమ్ముడికి ‘ప్రవీణ్‌కుమార్‌’ ఇచ్చారని ఒక ప్రముఖ పత్రిక వార్తను ప్రచురించింది. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిందని, ఆయన వివరణ తీసుకుందని, ఆయన వివరణ వారిని సంతృప్తి పరచలేకపోయిందని, దాంతో ఆయనను సెలవుపై వెళ్లమని ఆదేశించిదని ప్రచారం జరుగుతోంది. అయితే...తాను కావాలని లీజులు ‘జగన్‌’ సోదరుడికి ఇవ్వలేదని, అనుకోకుండా అలా జరిగిందని ఆయన చెబుతున్నారట. అయితే..ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపడంతో ఆయనను సెలవుపై పంపారంటున్నారు. ఇప్పటికే ‘జగన్‌’ బినామీ అయిన ‘షిర్డీసాయి ఎలక్ట్రికల్‌’కు ప్రభుత్వం భారీగా లబ్దిచేకూర్చిందనే విమర్శలు వస్తోన్న తరుణంలో ఇప్పుడు ‘జగన్‌’ సోదరుడికి గనులు కేటాయించడం ‘టిడిపి’ పెద్దలను ఇరకాటంలో పడేసింది. దీంతో..‘ప్రవీణ్‌’ను లీవ్‌లో పంపిందనే భావన వ్యక్తం అవుతోంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ