‘దావోస్’ ఖర్చుపై ‘వైకాపా’ రాద్ధాంతం...!
‘వైకాపా’ అధికారం కోల్పోయినా, ఎప్పటిలానే తప్పుడు ప్రచారాలను మాత్రం మానడం లేదు. అవకాశం దొరికినా, దొరక్కపోయినా..ప్రత్యర్థులపై విషం చిమ్మడానికి ఎటువంటి వెరపు లేకుండా చేస్తూనే ఉంటుంది. తమ పార్టీ అధినేత ‘వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి’పై లెక్కకు మిక్కి అవినీతి కేసులున్నా, ఆయన కొన్నాళ్లు జైలులో ఉండి వచ్చినా..దాన్ని పట్టించుకోకుండా, తమ ప్రత్యర్థులపై ముఖ్యంగా ‘ఆంధ్రప్రదేశ్’ ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’పై అవినీతి ముద్ర వేయడానికి తహతహ లాడుతోంది. దీని కోసం ‘చంద్రబాబు’ దావోస్ పర్యటనను ఎంచుకుంది. పెట్టుబడుల కోసం ‘చంద్రబాబు’ బృందం ‘దావోస్’ వెళ్లింది. అయితే..ఈ పర్యటనలో ‘చంద్రబాబు’ ప్రభుత్వ నిధులను విచ్చలవిడిగా ఖర్చు చేశారని, దీనిలో అవినీతికి పాల్పడ్డారని, వైకాపాకు అనుబంధంగా ఉంటే ఓ సంస్థ ఆరోపణలు గుప్పిస్తోంది. ‘చంద్రబాబు’ పర్యటనకు రూ.37కోట్లు ఖర్చు చేశారని, దీని కోసం గతంలో ‘టిడిపి’తో అనుబంధం ఉన్న సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారని, దీని ద్వారా ‘టిడిపి’ నాయకులు అవినీతికి పాల్పడ్డారంటూ విమర్శలు గుప్పిస్తోంది.
‘జగన్’ విమానఖర్చే రూ.12కోట్లు...!
అయితే..‘చంద్రబాబు’ పర్యటనలో అవినీతి జరిగిందో..లేదో తెలియదు కానీ..గతంలో ‘జగన్’ ‘దావోస్’ వెళ్లినప్పుడు ఎంత ఖర్చు అయిందో..సదరు సంస్థ వివరిస్తే బాగుండేది. అప్పట్లో ‘జగన్’ ప్రత్యేక ప్లైట్ వేసుకుని ‘భార్య’తో కలసి ‘దావోస్’ వెళ్లారు. అంతేనా..మధ్యలో తన కుమార్తెలను కలిసి తరువాత ‘దావోస్’ వెళ్లారు. అప్పట్లో ఆయన ప్రయాణించిన ‘ప్రత్యేక విమానం ఖర్చు గంటకు రూ.12లక్షలని వార్తలు వచ్చాయి. ఆయన పర్యటన ముగిసే వరకూ..ఆ ప్రత్యేక విమానం ఆయన వెంటనే ఉంది. అంటే దాదాపు ఐదు రోజుల పాటు..ఈ విమానం ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించింది. అంటే..దాదాపు విమానం ఖర్చులకే ‘జగన్’ రూ.14కోట్లు వెచ్చించారు. ఇక తరువాత ఆయన బస, ఇతర విషయాలకు ఎంత ఖర్చు అయిందో..తెలియదు. ఆయన దావోస్ పర్యటన ఖర్చుల వివరాలు తెలుసుకునేందుకు కొందరు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఎపిఇడిబి)లో ఆర్‌టిఐ ద్వారా పిటీషన్ వేస్తే..దాని వివరాలను ఇప్పటి వరకూ బయటపెట్టలేదు. దీనిని బట్టి తెలుసుకోవచ్చు..ఎవరి నిజాయితీ ఏమిటో...?