‘బాబు’కు ర్యాంకుల పిచ్చి పోదా...!?
ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’కు ర్యాంకులంటే..ఎంతో మక్కువ. ఆయన అధికారంలో ఉన్న ప్రతిసారీ...ర్యాంకుల గోల తప్పదు. వాళ్లకంత ర్యాంక్..వీళ్లకు అంత ర్యాంక్ అంటూ..మీడియాలో ఊదరగొట్టిస్తుంటారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఐఏఎస్‌లకు ఆయన ర్యాంకులు ఇస్తుంటారు. అసలు ఈ ర్యాంకులకు ప్రాతిపదిక ఏమిటో తెలియదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్లకు ర్యాంకులు ప్రకటించారు. ఆ జిల్లా కలెక్టర్‌కు మొదటి ర్యాంక్..ఈ జిల్లా కలెక్టర్‌కు చివరి ర్యాంక్ అంటూ..కలెక్టర్ల సమావేశంలో ప్రకటించేవారు. అది మరుసటి రోజు పత్రికల్లో ప్రముఖంగా వచ్చేది. దీని వల్ల ఉపయోగం ఏమిటో..తెలియదు..కానీ..‘చంద్రబాబు’ దృష్టిలో పడడానికి ఆయా జిల్లా కలెక్టర్లు తప్పుడు లెక్కలు అప్పచెప్పి, అంతా బాగుందని, ప్రజలంతా ఎటువంటి సమస్యలు లేకుండా హాయిగా కాలుమీద కాలు వేసుకుని దర్జాగా బతుకుతున్నారంటూ..చెప్పేవారు. దీంతో..‘చంద్రబాబు’ తబ్బిబ్బి అయ్యేవారు. ఎవరైనా..దీనిపై ఏమైనా చెప్పబోతే..‘మీకేం తెలుసు..ప్రజల్లో సంతృప్తి పెరిగిపోయిందంటూ...’ దబాయించేవారు. ముఖ్యమంత్రి దబాయింపుతో నిజాలు చెప్పేవారు కూడా..ఆయనపై పొగడ్తలు గుప్పించేవారు. మరికొందరు బట్రాజులు..‘దయగల పాలనలో ప్రజలు బంగారపు పాన్పులపై శయినిస్తున్నారని’..దీనంతటికీ ‘చంద్రబాబే’ కారణమని..ఆయన్ని ఆకాశానికెత్తేసేవారు. అయితే..అది నిజం కాదని 23 సీట్లతో తేలిపోయినా....మళ్లీ..అదే బాపతు..వాళ్లు ఆయన చుట్టూ తయారై...90శాతం సంతృప్తి..వందశాతం సంతృప్తి..మొదటి ర్యాంక్..రెండో ర్యాంక్ అంటూ..బురిడీమాటలతో ‘చంద్రబాబు’ను బురిడీ కొట్టిస్తున్నారు. ఇదంతా చూసిన నిజమైన టిడిపి కార్యకర్తలు..మాత్రం..మా ర్యాంకులపిచ్చి..మారాజును..మరోసారి.. ముంచేయబోతున్నా రంటూ..నెత్తీనోరు బాదుకుంటూ ఈరోజు ప్రకటించిన మంత్రుల ర్యాంక్‌లపై ఆక్షేపణలు వ్యక్తం చేస్తున్నారు. మొదటి ర్యాంక్ వచ్చిన ‘ఫరూక్’కు నెల మొత్తం మీద ఒకటీ, రెండు ఫైళ్లు కూడా ఆయన వద్దకు రావు. రెండు ఫైళ్లు పరిష్కరించినందుకే..ఆయన పనితీరు అద్భుతమా...? ఆహా..ఏమినైపుణ్యం..రెండో ర్యాంక్ మంత్రి ‘కందుల దుర్గేష్’ ఈయనదీ అదే పరిస్థితి. ఈయనకు కూడా పెద్దగా దస్త్రాలు ఏమీ రావు. మూడో ర్యాంకర్‌దీ అదే పరిస్థితి. కీలకమైన శాఖల్లో భారీగా దస్త్రాలు వస్తుంటాయి. మున్సిపల్, విద్యా, రెవిన్యూ, ఫైనాన్స్, జలవనరులు, వైద్య, పంచాయితీరాజ్, వ్యవసాయశాఖల్లో చాలా ఫైళ్లు ఉంటాయి. కొన్ని సంవత్సరాల తరబడీ పరిష్కారానికి నోచుకోక...మగ్గిపోతున్నాయి. వీటిని ముందుగా పరిష్కరిస్తే..బాగుండేది. అలా కాకుండా...అందరినీ ఒకే గాటన కట్టేసి ర్యాంక్‌లంటూ..రాగాలు తీయడం ఏందుకు..? సరిగా పనిచేయని మంత్రిని పిలిచి..మీ పనితీరు బాగాలేదు..మార్చుకోండి..అని హెచ్చరించవచ్చుకదా...? ఎందుకూ మీడియా..హడావుడి..? దీనితో వచ్చేదేముంది..? ర్యాంకులతో..వారి పనితీరు మారిపోతుందా..? మారదు...? వారెందుకు పైళ్లను పరిష్కరించలేదో..కనుక్కోవాలి..? ఫైళ్ల పరిష్కారంలో నిజంగా సమస్య ఉందా..? లేక దస్త్రాలపై బరువు లేనందున పరిష్కరించడం లేదా..? ఇది తెలుసుకోకుండా... ర్యాంకులంటూ.. హడావుడి ఏమిటి..? వాస్తవానికి చాలా మంది మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. కొంత మంది మంత్రుల పేషీ సిబ్బంది..నెలకు రూ.20లక్షల నుంచి 50లక్షల వరకూ మంత్రికి అప్పచెపుతామని..బేరాలు మాట్లాడుకుని వసూళ్లు చేస్తున్నారనేదానిపై ఏమైనా విచారణ చేయించారా..? లేదు కదా..? కొంత మంది మంత్రుల అవినీతిపై ఆధారాలు దొరికినా..వారిపై చర్యలు లేవు. ఇప్పటికీ కొన్నిపేషీలు వైకాపా మద్దతుదారులతో నిండిపోయినా..వారిని తొలగించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో..ర్యాంకులంటూ..హడావుడితో ఉపయోగం ఏముంది..?