లేటెస్ట్

‘జగన్‌’ను జైలులో తోయవచ్చు...!?

‘ఢిల్లీ’ అసెంబ్లీ ఎన్నికలు  ‘ఆంధ్రప్రదేశ్‌’ ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’కు ఒక మార్గాన్ని చూపించాయని చెప్పవచ్చు. అదే మంటే..రాజకీయనాయకులు జైలుకు వెళితే..ఆ సానుభూతితో..మళ్లీ ఎన్నికల్లో గెలుస్తారన్న సిద్ధాంతం తప్పని ఈ ఎన్నికలు నిరూపించాయి. ఇంతకు ముందు చాలా మంది ఎవరైనా ప్రజాధరణ కలిగిన నేతలు జైలుకు వెళితే..తరువాత జరిగే ఎన్నికల్లో వారి పార్టీలు గెలుపొందుతాయని ఒక సిద్ధాంతాన్ని చెబుతుంటారు. ఇటీవల కాలంలో ‘ఆంధ్రప్రదేశ్‌’‘ఝార్ఖండ్‌’ రాష్ట్రాల్లో ఇలానే జరిగిందని, ఆయా రాష్ట్రాల్లోని ముఖ్యనేతలైన ‘చంద్రబాబునాయుడు’, హిమాంత్‌ సోరెన్‌లు ఎన్నికల ముందు జైలుకు వెళ్లారని, తరువాత వారు జైలు నుంచి విడుదలైన తరువాత ప్రజల్లో సానుభూతి పెల్లుబుకి..వారి పార్టీలు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచాయని చెబుతుంటారు. అయితే..ఇది నిజం కాదని ‘ఢిల్లీ’ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయి. ‘ఢిల్లీ’లో అత్యంత సామాన్య ప్రజాదరణ కలిగిన నాయకులైన ‘క్రేజీవాల్‌’, మనీష్‌ సిపోడియా, ఇంకా ఇతర ‘ఆప్‌’నేతలు జైలుకు వెళ్లినా..వారికి ప్రజల నుంచి సానుభూతేమీ లభించలేదు. ‘ఆప్‌’నేతలు కొందరు ఏళ్ల తరబడి జైలులో మగ్గిపోయారు. ముఖ్యంగా‘ఢిల్లీ’ ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన ‘మనీష్‌ సిసోడియా’ 17నెలలు జైలులో ఉన్నారు. ఆయన ‘బాస్‌’ ‘క్రేజీవాల్‌’ దాదాపు ఆరు నెలలు జైలులో ఉన్నారు. కామన్‌మ్యాన్‌గా చెప్పుకునే ‘క్రేజీవాల్‌’కు సామాన్య ప్రజల్లో గట్టి పట్టు ఉంది. అయితే..మద్యం కుంభకోణంలో ఆయన జైలులో ఉండడంతో..ఆయనపార్టీకి, ఆయనకు ప్రజల నుంచి సానుభూతి వస్తుందని, ఈ ఎన్నికల్లో ఆయనే గెలుస్తారని చాలా మంది భావించారు. అయితే..అటువంటి సానుభూతేమీ ఎన్నికల్లో ప్రజలు చూపించలేదు. చివరకు ‘క్రేజీవాల్‌’ను కూడా ఓడించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ‘ఆప్‌’ అధినేత సామాన్యుడి చేతిలో ఓడిపోయారు. ఇది చాలా మంది ఊహించలేదు. అయితే..ఆయనపై ఉన్న ఆరోపణలను సామాన్య ప్రజలు విశ్వసించడంతోనే..ఆయన ఓటమికి గురయ్యారు. దీనిని బట్టి చూస్తే..రాజకీయనాయకులు జైలులో ఉన్నా..వారిపై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉందని భావిస్తే..ప్రజలు వారిని ఓడిస్తారని ‘ఢిల్లీ’ఎన్నికలు రుజువు చేశాయి. దీన్ని బట్టి చూస్తే..అవినీతి ఆరోపణలు ఉన్న నేతలపై చర్యలు తీసుకుంటే..ప్రజల నుంచి వారికి సానుభూతేమీ లభించదు. ఇప్పుడు ‘ఆంధ్రప్రదేశ్‌’ ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ వివిధ అవినీతి, అక్రమ, హత్యా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవచ్చు. ఆయనపై ఉన్న వివిధ కేసులను వేగంగా పరిష్కరించి,ఆయనను జైలులో తోయవచ్చు. దీనిపై ‘చంద్రబాబు’ కిందా మీదా పడాల్సిన అవసరం లేదు. నిజంగా ఆయనకు అవినీతిపై చర్యలు తీసుకోవాలనే చిత్తశుద్దిఉంటే..గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేసిన ‘జగన్‌’ గ్యాంగ్‌ మొత్తాన్ని జైలులో తోయవచ్చు. వాళ్లను జైలుకు పంపితే..వారికి ప్రజల నుంచి మద్దతు, సానుభూతేమీ లభించదు.చేసిన తప్పులకు వారు శిక్ష అనుభవించాల్సిందేనని ‘ఆంధ్రావని’ కోరుకుంటోంది. అయితే..వారిని జైలుకు పంపితే..రాజకీయంగా ఎదురుదెబ్బలు తగులుతాయనే భావనతో ‘చంద్రబాబు’ దీని గురించి ఆలోచించడం లేదనే అనుమానాలు ఉన్నాయి. అయితే..ఆ అనుమానాలకు ‘ఢిల్లీ’ ఒక మార్గం చూపింది కనుక ‘చంద్రబాబు’ ఎటువంటి ఆలోచనలు లేకుండా వారంద‌రినీ జైలులో తోయవచ్చు...!

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ