లేటెస్ట్

‘సాక్షి’ మేనేజింగ్‌ ఎడిటర్‌కు ‘సలహాదారు’ పదవి...!

సార్వత్రిక ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగబోతున్నా..సలహాదారులను నియమించడంలో ‘జగన్‌’ ప్రభుత్వం ఏ మాత్రం మొహమాటం పడడం లేదు.రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరుగుతున్నా..ప్రభుత్వం మాత్రం తనకు కావాల్సిన వారికి ఇంకా పదవులను పందేరం చేస్తూనే ఉంది. బోలెడంత మంది సలహాదారులు ఉన్నా..వారు చాలడం లేదని కొత్త కొత్త వారిని వెతికి మరీ సలహాదారుల పదవులను ఇస్తోంది ‘జగన్‌’ ప్రభుత్వం. తాజాగా ‘సాక్షి’ టివీ మేనేజింగ్‌ ఎటిడర్‌గా ఉన్న ‘నేమాని భాస్కర్‌’కు ‘పబ్లిక్‌ పాలసీ’ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఎన్నికల ముందు ప్రభుత్వం నియమిస్తోన్న సలహాదారుల పదవులపై ఇప్పటికే రాజకీయంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం నియమించిన సలహాదారులు మంత్రి మండలి కన్నా ఎక్కువ ఉందని, వారు ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు ఏమిటో చెప్పాలని ప్రతిపక్ష టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు వచ్చినా..వాటిని లెక్కపెట్టకుండా తనకు కావాల్సిన వారికి సలహాదారుల పదవులను కట్టబెడుతోంది జగన్‌ ప్రభుత్వం. తాజాగా సలహాదారుగా నియమితులైన ‘నేమాని భాస్కర్‌’ ‘ఆంధ్రభూమి, ‘సాక్షి’ దినపత్రికల్లో పనిచేశారు. ఆ తరువాత ‘ఎన్‌టివి, ప్రస్తుతం ‘సాక్షి’ టివీల్లో పనిచేస్తున్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ