లేటెస్ట్

90శాతం మందికి నచ్చని ‘జగన్‌’..!

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనమైంది. దేశంలో ఉన్న అతికొద్ది మంది సీనియర్‌ నేతల్లో ఒకడైన ‘చంద్రబాబు’ను ‘జగన్‌’ ప్రభుత్వం అరెస్టు చేయడంపై దేశవ్యాప్తంగా విస్మయం, ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పనిచేసే నేతగా, అభివృద్ధిప్రధాతగా దేశంలో పేరు తెచ్చుకున్న చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడంపై నిరసన వ్యక్తం అవుతోంది. అన్ని వర్గాలు ‘చంద్రబాబు’ అరెస్టును ఖండిస్తున్నాయి. ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటున్న ‘జగన్‌’ ప్రభుత్వ మాటలను ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో అన్ని వర్గాలు ‘చంద్రబాబు’కు మద్దతుగా నిలుస్తున్నాయి. ‘చంద్రబాబు’ అరెస్టు నేపథ్యంలో ఆయన అరెస్టు అక్రమమా..సక్రమమా అంటూ ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో దాదాపు 90శాతం మంది ప్రజలు ‘చంద్రబాబు’ అరెస్టుకు వ్యతిరేకమని, ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని చెప్పారట. విశ్వసనీయతకు మారుపేరైన ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలిందట. నెల్లూరులో నిర్వహించిన ఈ సర్వేలో దాదాపు 700 మంది పాల్గొన్నారట. వీరిలో 90శాతం మంది ప్రజలు ‘చంద్రబాబు’ అరెస్టు సరికాదని చెప్పారట. మరో 63 మంది మాత్రం ‘చంద్రబాబు’ అరెస్టు సక్రమమేనని చెప్పారట. వైకాపా రెబెల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ సర్వే వాస్తవాలను ప్రతిభంబిస్తోందని, ఏ పది మందిని కదిలించినా..‘చంద్రబాబు’ అరెస్టు సరికాదని చెబుతున్నారని, అధికారం ఉందనే భావనతో వైకాపా ప్రభుత్వం అడ్డగోలుగా ‘చంద్రబాబు’ను అరెస్టు చేసిందని ఆయన దుయ్యబట్టారు. కాగా నెల్లూరు జిల్లాలోనే ఈ విధమైన అభిప్రాయం ఉంటే, మిగతా జిల్లాల్లో ఇంతకు మించి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గత ఎన్నికల్లో నెల్లూరులోని పది అసెంబ్లీ సీట్లను అధికారవైకాపా గెలుచుకుంది. ప్రతిపక్ష టిడిపికి ఒక్కటంటే ఒక్కసీటు కూడా రాలేదు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఎన్నికలు ఎప్పుడు జరిగినా నెల్లూరులో అధికార పార్టీకి చేదు అనుభవాలు ఎదురవుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తం మీద అనవసరంగా ‘చంద్రబాబు’ను అరెస్టు చేశారని, ఆయన అరెస్టు ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పైనే కాకుండా తెలంగాణపై ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిన్న ఐటి ఉద్యోగులు చంద్రబాబు అరెస్టుపై రోడ్లపైకి వచ్చారని, ఇదే ఊపు ఇతర వర్గాల్లోనూ వస్తుందని, దానా దీనా ‘చంద్రబాబు’ అరెస్టు కెసిఆర్‌కు కూడా నష్టం చేస్తుందనే విశ్లేషణలు వస్తున్నాయి.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ