లేటెస్ట్

సిఎం సిపిఆర్‌ఓగా ‘రమేష్‌’

ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ ‘చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ అధికారిగా సీనియర్‌ జర్నలిస్టు ‘ఆలూరి రమేష్‌’ను నియమిస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులను జారీ చేసింది. వాస్తవానికి ‘రమేష్‌’ గత కొన్నాళ్లుగా ‘చంద్రబాబు’ వద్ద మీడియా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే..ఆయనకు అధికారికంగా ఈ రోజు ఉత్తర్వులు ఇచ్చారు. జూన్‌ 13, 2024 నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి వచ్చినట్లు జీవోలో పేర్కొన్నారు. ‘ఆంధ్రజ్యోతి’ జర్నలిజం స్కూల్‌ నుంచి ‘రమేష్‌’ వచ్చారు. ఆయన తొలుత ‘ఆంధ్రజ్యోతి’లో సబ్‌ ఎడిటర్‌గా పనిచేశారు. తరువాత హైదరాబాద్‌లోనూ, రాష్ట్ర విభజన తరువాత 2015లో ఆయన విజయవాడ నుంచి పనిచేస్తున్నారు. ‘ఎన్‌టివి’లోనూ ఆయన సుధీర్ఘకాలం పనిచేశారు. నాలుగేళ్ల క్రితం ఆయన ‘చంద్రబాబు’ వద్ద ‘పిఆర్వో’గా చేరారు. ఇక అప్పటి నుంచి ఆయన అక్కడే పనిచేస్తున్నారు. ‘చంద్రబాబు’ ముఖ్యమంత్రిగా అయిన తరువాత అనధికారికంగా ఆయన పనిచేస్తున్నారు. ఎప్పటి నుంచో ఆయనకు అధికారిక ఉత్తర్వులు వస్తాయని ఎదురు చూస్తుండగా..ఎట్టకేలకు ఆయనకు ఈ రోజు ఉత్తర్వులు వచ్చాయి. ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’ నాలుగోసారి ‘సిఎం’ అయిన తరువాత తన కార్యాలయంలో పిఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదు. తగినంత మంది సిబ్బంది లేకుండానే సిఎం పిఆర్‌ఓ వ్యవస్థ నడుస్తూంది. మొత్తం పిఆర్‌ వ్యవస్థను కేవలం ‘రమేష్‌’ ఒక్కడే నిర్వహిస్తున్నారు. ఒక్కడే అయినా..ఆయన ముఖ్యమంత్రి మీడియా వ్యవహారాలను చక్కగా నడిపిస్తున్నారనే పేరు తెచ్చుకున్నారు. కష్టపడి పనిచేస్తున్నారనే భావన కల్గిస్తున్నారు.మొత్తం మీద ‘చంద్రబాబు’ నాన్చి నాన్చి..ఆయనకు సిపిఆర్‌ఓ పోస్టును అప్పగించారు. ఈ పోస్టు కోసం పలువురు సీనియర్‌ జర్నలిస్టులు పోటీ పడ్డారు. అయితే..‘రమేష్‌’ కష్టాన్ని చూసి..ఆయనకే..ముఖ్యమంత్రి ఓటు వేశారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ