‘తల్లికివందనాని’కి రూ.9407కోట్లు
‘జగన్’ ‘అమ్మఒడి’ కన్నా రెట్టింపు నిధులు...!
ఐదేళ్లలో ‘జగన్’ ఇచ్చింది రూ.26వేల కోట్లు...!
ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తోంది రూ.47వేల కోట్లు
సంక్షేమమంటే..ఇది రాజా...!
రాష్ట్రంలోని ‘కూటమి ప్రభుత్వం’ తొలిసారి ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో సంక్షేమపథకాలకు భారీగానే నిధులు కేటాయించింది. ఈ రోజు అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ‘పయ్యావుల కేశవ్’ తన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో అటు అభివృద్థికి, ఇటు సంక్షేమానికి సమానంగా నిధులు పంచారు. ‘కూటమి ప్రభుత్వం’ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంక్షేమపథకాలకు సొమ్ములు ఇవ్వడం లేదని వైకాపా అధినేత ‘వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి’ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన విమర్శలు, ఇతర వర్గాల ద్వారా వచ్చిన సూచనలను తీసుకుని ప్రభుత్వం సంక్షేమానికి భారీగానే నిధులు కేటాయించింది. గత కొన్నాళ్లుగా ‘అమ్మఓడి’ ఎగగొట్టారని వైకాపా అధినేత ‘జగన్’తోపాటు, ఆయన మీడియా చేస్తోన్న ప్రచారానికి తెరపెడుతూ ‘కూటమి ప్రభుత్వం’ ‘తల్లికివందనం’కు భారీగా నిధులు కేటాయించింది. రాష్ట్రంలో చదువుకునే ప్రతి విద్యార్థికి ‘తల్లికివందనం’ పేరిట రూ.15వేలు ఇస్తామని ‘కూటమి ప్రభుత్వం’ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టింది. అయితే.. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా..‘అమ్మకువందనం’ ఇవ్వలేదని...నీకు రూ.15వేలు..నీకు రూ.15వేలు..నీకు రూ.15వేలు.. అంటూ ‘జగన్’ తన సభల్లో, మీడియా సమావేశాల్లో ఎద్దేవా చేస్తున్నారు. ఆయనతో పాటు కొన్నివర్గాలు తమకు ఇంత వరకూ ప్రభుత్వం నేరుగా సొమ్ములు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రభుత్వం ‘తల్లికివందనం’కు భారీగా నిధులు కేటాయించింది. అర్హులైన విద్యార్థులందరికీ రూ.15వేల చొప్పున ఇవ్వబోతోంది. తాము ‘తల్లికివందనం’ పథకాన్ని ‘మే’ నెల నుంచి అమలు చేస్తామని ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు. ఆయన ప్రకటన దరిమిలా ఇప్పుడు ఆర్థిక మంత్రి ‘తల్లికివందనం’కు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. దాదాపు రూ.9407 కోట్లు బడ్జెట్‌లో పెట్టారు. ఇది గత ‘జగన్’ ప్రభుత్వం కన్నా ఎక్కువ. గతంలో ‘జగన్’ ఐదేళ్లుపాటు అధికారంలో ఉండి ‘అమ్మఒడి’ ద్వారా రూ26వేల కోట్లు ఖర్చుచేశారు. వరుసగా 2020లో రూ.6349కోట్లు, 2021లో రూ.6673కోట్లు, 2022లో రూ.6595కోట్లు, 2023లో రూ.6,392కోట్లు విద్యార్థులకు అందించారు. అయితే..ఐదేళ్లు ఇస్తానన్న ఆయన ఒక ఏడాదిని ఎగకొట్టారు. అంటే దాదాపు రూ.6500కోట్లు ఆయన విద్యార్థులకు బాకీ పడ్డారు. కాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తన తొలి ఏడాదిలోనే ‘జగన్’ కన్నా మిన్నగా దాదాపు రూ.9407 కోట్లు ఇవ్వబోతోంది. అంటే ఐదేళ్లలో రూ.47వేల కోట్లును ఇవ్వబోతోంది. అంటే ఇది ‘జగన్’ ఇచ్చిన దానికన్నా రెట్టింపు అన్నమాట. సంక్షేమానికి మేమే రాజులమని డప్పు కొట్టుకున్న ‘జగన్’ కంటే..‘‘చంద్రబాబు’,‘పవన్’ల ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేయబోతోంది. ఇప్పటికే సామాజిక ఫింఛన్లు ఒకేసారి వెయ్యిరూపాయలు పెంచి తమ చిత్తశుద్దిని చాటుకుంది. ఇప్పుడు ‘తల్లికివందనం’ ‘అన్నదాత సుఖీభవ’ ద్వారా రూ6300 కోట్లు ఇవ్వబోతోంది. తానే నేరుగా ఐదేళ్లలో రెండున్నర లక్షల కోట్లు పేదలకు ఇచ్చానని డప్పుకొట్టుకునే ‘జగన్’ సంక్షేమాన్ని ‘కూటమి ప్రభుత్వం రెండేళ్ల’లో చేయబోతోంది. దీన్ని బట్టి చెప్పవచ్చు. ఎవరు సంక్షేమ ఛాంఫియనో..? సంపద సృష్టిద్వారా సంక్షేమాన్ని అమలు చేస్తామన్న ‘చంద్రబాబు’ హామీ ఇప్పుడిప్పుడే అమలు అవుతోంది. భవిష్యత్తులో మరింతగా అమలు అవుతుందన్న భావన రాష్ట్ర ప్రజల్లో క్రమంగా నెలకొంటోంది.