లేటెస్ట్

‘సగం మంత్రి పదవి’ ‘స్నేహితుడి’కి రాసిచ్చేశాడు..!?

‘మహాభారతం’లో ‘దుర్యోధనుడు’ తన మిత్రుడైన ‘కర్ణుని’కి రాజ్యంలో, సింహాసనంలో సగం భాగం ఇచ్చేస్తాడు. ‘కర్ణుని’ని స్నేహితునిగా చేసుకునేందుకు, తద్వారా తన శత్రువులైన ‘పాండవుల’ను జయించడానికి ‘దుర్యోధనుడు’ ముందు చూపుతో తన రాజ్యంలో సగభాగాన్ని స్నేహితుడికి ఇచ్చేశాడు. ఇప్పుడు అదే రీతిలో ‘ఆంధ్రప్రదేశ్‌’కు చెందిన ఓ కీలకమంత్రి తన స్నేహితుడి కోసం సగం మంత్రి పదవిని అతనికి ఇచ్చేశారని సచివాలయంలో ప్రచారం సాగుతోంది. కేవలం ‘సచివాలయం’లోనే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల్లో..ఈ వ్యవహారం గురించి మాట్లాడుకుంటున్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన కీలక ఎమ్మెల్యేకు ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తుంటే..ఆయనకు రాకరాక మంత్రి పదవి వచ్చింది. అదీ అషామాషీ మంత్రి పదవి కాదు. కీలకమైన నాలుగుశాఖల్లో ఒకటి. అయితే..కీలక మంత్రి పదవి దక్కిన తరువాత సదరు మంత్రి తన స్నేహితుడికి ఆ పదవిలో సగభాగం పంచేశారట. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సదరు స్నేహితుడిని రోజూ తన వెంటబెట్టుకుని కార్యాలయానికి వస్తున్నారట. అంతేనా..తన అధికారాల్లో సగం ఆయనకు పంచేశారట.అధికారుల బదిలీల్లో, ముఖ్యమైన సమీక్షా సమావేశాల్లో, అధికారుల రివ్యూల్లోనూ సదరు స్నేహితుడు మంత్రి పక్కనే ఉంటారట.


వివిధ శాఖలకు చెందిన అధికారులకు ఫోన్‌ చేసి..ఆ పనిచేయి..ఈ పనిచేయి..అంటూ హుంకరిస్తారట. అసలు ఈయనకు ఉన్న అధికారాలేమిటి..? ఈయనకు తామెందుకు సమాధానం చెప్పాలి..? తామెందుకు పనులు చేసి పెట్టాలని సదరు ఉన్నతాధికారులు నివ్వెరపోతున్నారట. పైగా ఫలానా వారిపై దాడులు చేయండి..? వారి నుంచి ఇంత సొమ్ములు వసూలు చేయండి..? ఇంత టార్గెట్‌ అంటూ..వారిపై అజమాయిషీ చేస్తున్నారట. అసలు మంత్రి తమనేమీ అనడం లేదని..కానీ ఆయన స్నేహితుడు మాత్రం తమపై ఎక్కడ లేని పెత్తనం చేస్తున్నారని అధికారులు వాపోతున్నారు. అధికారిక సమావేశాల్లోనూ, ఇతర సమీక్షల్లోనూ ఆయన హడావుడే ఉంటోందట. సదరు స్నేహితుడిని శాఖకు సంబంధించిన కీలకమైన సమావేశాలకు తీసుకెళ్లాలని, చివరకు న్యూఢల్లీిలో జరిగే సమావేశాలకూ ఆయనను తీసుకెళ్లాట. అలా తీసుకెళ్లడానికి రూల్స్‌ ఒప్పుకోవు అంటే సదరు స్నేహితుడు ఇంతెత్తున లేచి మండిపడుతున్నారట. దీంతో..మంత్రిగారికి ఎక్కడ కోపం వస్తుందోనన్న భయంతో..అధికారులు..ఆయనను తీసుకెళుతున్నారట. నిన్నటికి నిన్న జరిగిన కీలకమైన మీటింగ్‌లోనూ సదరు మంత్రి స్నేహితుడు ఉన్నారు. ఆయన అక్కడ తిష్టవేయడం చూసిన అధికారులు..ఇక్కడ ఈయన అవసరమా..? అంటూ నొసలు చిట్లించారట. అయితే..తమ మంత్రి ఆయనకు సగభాగం రాసిచ్చారు కనుక..ఆయన అక్కడే ఉంటారని మరి కొందరు బదులిచ్చారట.


పాత ఐరన్‌ స్క్రాప్‌ లారీల నుంచి దోపిడీ...!?

కాగా సదరు మంత్రిగారి స్నేహితుడు ఇప్పుడు పాత ఐరన్‌ స్క్రాప్‌ను రవాణా చేసే లారీలపై దృష్టిసారించారట. నిబంధనలకు విరుద్ధంగా తిరిగే లారీలపై భారీ జరిమానా వేయిస్తానని బెదిరిస్తున్నారట. ముందుగా తనను కలిసి తనకు ఇవ్వాల్సినవి ఇస్తే..వాటిని వదిలేస్తానని, లేకుంటే..మీ అంతు చూస్తానని పాత ఇనుము అమ్ముకునే వ్యాపారులను బెదిరించి సొమ్ములు గుంజుతున్నారని ఆయా వర్గాలకు చెందిన వారు లబోదిబోమంటున్నారు. గతంలో ‘దీపావళి’ సందర్భంగా ‘క్రాకర్స్‌’ వ్యాపారులను బెదిరించిననట్లు..ఇప్పుడు పాత ఇనుప వ్యాపారులను బెదిరిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వివిధ వ్యాపార సముదాయాలపై దాడులు చేయించి..వారిపై ముందుగా అధికారులతో భారీగా జరిమానాలు విధించి..అనంతరం వారితో బేరాలు చేసి...దండుకుంటున్నారట. దీనిపై సదరు అధికారులు కక్కామింగలేకపోతున్నారట. ‘జగన్‌’ ప్రభుత్వంలోనూ ఇటువంటి దోపిడీ జరగలేదని, ఇప్పుడు ‘జగన్‌’ను మించిన దోపిడీదారు వచ్చాడంటూ..వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ‘మాశాఖలో మేము దాడులు చేసిన తరువాత..ఎంతో కొంత రాజకీయ ఒత్తిడితో జరిమానాలు తగ్గిస్తాం’..ఇది సహజంగా జరిగేదే..? కానీ..ఇప్పుడు.. ముందుగా ఎవరిపై దాడులు చేయాలో..? ఎవరికి ఎంత జరిమానా విధించాలో..? సదరు మంత్రిగారి స్నేహితుడే నిర్ధేశిస్తున్నారు’..అని ఆ శాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు. పైగా తమలో ఎవరికైనా బదిలీ కావాలంటే తనతో సంప్రదించాలని కూడా ఆయన సెలవిస్తున్నాట. మొత్తం మీద..ఈ సగం మంత్రిగారి వ్యవహారం పార్టీ పెద్దలకు, సిఎంఓకు చేరిందంటున్నారు. దీనిపై ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ సీరియస్‌గా వ్యవహరిస్తారని తెలుస్తోంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ