లేటెస్ట్

ఈ వర్గాలు...‘జగన్‌’ను ఎప్పటికీ నమ్మవు...!?

రాష్ట్రంలో జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు..అధికార కూటమిని సంభ్రమాశ్చార్యాల్లో ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా,గుంటూరు, గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్‌ ఎన్నికల ఫలితాలు...కూటమి నేతలను, ఆ పార్టీ కార్యకర్తలను, నాయకులను, సానుభూతిపరుల్లో ఎక్కడ లేని సంతోషాన్ని తెచ్చి పెట్టాయి. మామూలుగా అయితే..బ్రహ్మాండమైన మెజార్టీతో పాలన చేస్తోన్న కూటమి ఈ ఎన్నికలు, వీటి ఫలితాలపై పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. అంతే కాదు..అనాదిగా ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధానమైన రాజకీయపార్టీలు పెద్దగా పట్టించుకోవు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాలు, ఉపాధ్యాయులు, ఇతర సంఘాలే దృష్టి సారిస్తాయి. ఈ విషయాన్ని అపార రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ కూడా నేడు చెప్పారు. తన రాజకీయ జీవితంలో..ఎప్పుడూ వీటిపై దృష్టి సారించలేదని, కానీ..గత ‘జగన్‌’ ప్రభుత్వంలో మూడు ఎమ్మెల్సీలను గెల్చుకున్న తరువాతే..వీటిపై అందరిలో ఆసక్తి నెలకొందన్నారు. అంతే కాదు..ఒక ఎమ్మెల్సీకి దాదాపు 82వేల మెజార్టీ రావడం ఏమిటి..? ఒకరు కాదు..ఇద్దరికి అదే స్థాయిలో రికార్డు మెజార్టీ వచ్చింది. దాదాపు 67శాతం ఓట్లు ఒక ప్రధాన పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడూ పడలేదు. ఇదో రికార్డు. అదీ పట్టభద్రుల నియోజకవర్గంలో..ఇలా రావడం ఇదే మొదటి సారి. విద్యావంతులు అంటే  కేవలం పట్టభద్రులే కాదు. సమాజంలోని అన్ని వర్గాలు వీరిలో ఉన్నాయి. ఒక విద్యార్థి, ఒక నిరుద్యోగి, ఒక ఇంజనీర్‌, ఒక ఉపాధ్యాయుడు, ఒక డాక్టర్‌, ఒక ఇంజనీర్‌, ఒక వ్యాపారస్తుడు, ఒకట్రేడర్‌, ఒక ఆటో కార్మికుడు, ఒక న్యాయ‌వాది, ఒక రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి,ఒక రైతు, ఒక మహిళ.. వీళ్లేనా..సమాజంలో...దాదాపు అన్ని వర్గాలు..వీరిలో ఉన్నాయి. ఈ వర్గాలన్నీ..తెలివైనవి..లోకం పోకడ తెలిసినవి..లోకంలో ఏమి జరుగుతుందో..ఎవరు అన్యాయం చేస్తున్నారో..ఎవరు న్యాయం చేస్తున్నారో..ఎవరి వల్ల రాష్ట్రానికి న్యాయం జరుగుతుందో..ఎవరి వల్ల తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో..ఎవరి వల్ల శాంతిభద్రతలు భద్రంగా ఉంటాయో..ఎవరి వల్ల న్యాయం జరుగుతుందో..తెలిసిన వాళ్లు...వాళ్లు..నాలుగు విధాలుగా ఆలోచిస్తారు. వారేమీ అనాలోచితంగా, ఎవరో చెప్పారనో..మనోడనో..మన కులం వాడనో..మన ప్రాంతం వాడనో.. లేక ఇతర ప్రలోభాలకో..లొంగి ఓట్లు వేయరు. ఒకటికి రెండు సార్లు ఆలోచించే ఓట్లు వేస్తారు.


వాళ్ల కోపం జ‌గ‌న్ మీదేనా..?

మరి ఇప్పుడు దాదాపు 70శాతం మంది ఒకే పార్టీకి మద్దతు ప‌లికారంటే...వారిలో ఏదో కసి ఉండాలి. ఆ కసి ఎవరిపైన..? ఇప్పుడు ‘టిడిపి’పై పోటీ చేసిన ‘కమ్యూనిస్టులు’పై వారికి ఆ కసి ఉండదు. ఎందుకంటే..కమ్యూనిస్టులు ఎంత మకిలిమైనా, సొమ్ములకు ఆశ పడి..దొంగలకు మద్దతు ఇస్తోన్నా..వారిపై ‘విద్యావంతుల’కు ఆ కసి ఉండనే ఉండదు. మరి..ఎవరిపైన ఆ కసి..? అంటే..సమాధానం వారికి మద్దతు ఇస్తోన్న ‘జగన్‌’పైనే..వారి కసి..అని చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో ‘కమ్యూనిస్టులు’ గెలిస్తే..‘జగన్‌’ గెలిచినట్లే..అన్న భావం వారిలో ఏర్ప‌డింది. గత ఎన్నికల్లోనే..‘జగన్‌’ అనే భూతాన్ని పాతాళలోకానికి పాతేసిన ‘విద్యావంతులు’ ఇప్పుడు మళ్లీ ఆ భూతాన్నిబతికించాలనే భావనతో లేరు. ఆ భూతం మళ్లీ లేవకుండా ఉండాలంటే..ఏమి చేయాలో తెలిసిన వాళ్లు కనుక..‘టిడిపి’ అభ్యర్థులకు ఓట్లు గుద్దేశారు. ఇప్పుడే కాదు..గత సార్వత్రిక ఎన్నికల ముందు కూడా వీళ్లు ఇదే పనిచేశారు. కానీ..అప్పుడు అధికార మదం తలకెక్కిన ఉన్న ‘జగన్‌’ బృందం దాన్ని గమనించలేదు. వాళ్లేదో తమ ఓటర్లు కాదని, తమ ఓటర్లు తాము బిచ్చం వేస్తున్నవాళ్లేనని, రాష్ట్రంలో దాదాపు 80శాతం మందిని బిచ్చగాళ్లను చేశామని, ఇక తమకు అడ్డే లేదని..తామ వేస్తోన్న బిచ్చం కోసం మళ్లీ తమనే గెలిపిస్తారనే చావు తెలివి తేటలతో..బోల్తాపడ్డారు. అప్పట్లో తమను పాతేసిన ‘విద్యావంతులు’ ఇప్పుడు మళ్లీ తాము పోటీ చేస్తే..తమను మళ్లీ చావుదెబ్బ తీస్తారనే ఉద్దేశ్యంతో..‘కమ్యూనిస్టుల’ ముసుగులో ఎన్నికల్లో దిగారు. కానీ..అపారమైన తెలివితేటలు ఉన్న ‘విద్యావంతులు’ ముందు వీరి పాచిక పారలేదు. గతంలో కానీ..ఇప్పుడు కానీ...భవిష్యత్తులో కానీ ఈ వర్గాలు..‘జగన్‌’ అనే భూతాన్ని నమ్మేందుకు సిద్దంగా లేవు. మరో యాభై ఏళ్లు అయినా..ఈ భూతం చేసిన అకృత్యాలు, అఘాయిత్యాలు, అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలను మరిచిపోలేరు..పోలేరు. ఇది సత్యం..సత్యం..!  

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ