లేటెస్ట్

‘స్టాక్‌మార్కెట్‌’కు తాత్కాలిక ఉపశమనం...!

భారత స్టాక్‌మార్కెట్‌ అనేక రోజులుగా నష్టాలబాటలోనే పయనిస్తోంది. గత ఐదు మాసాలుగా లక్షల కోట్ల మదుపురల సంపద ఆవిరైంది. ఈ నష్టాలకు విదేశీ సంస్థాగత పెట్టుబడుదారుల నిరంతర అమ్మకాలే కారణం. దానితో పాటు దేశీయ కంపెనీలు నష్టాల బాట పట్టడంతో..‘చైనా’కు చెందిన కంపెనీల స్టాక్‌లు తక్కువ ధరకు దొరుకుతుండడంతో..విదేశీపెట్టబడుదారులు మనదేశం నుంచి భారీ స్థాయిలో సొమ్ములను తరలించుకుపోతున్నారు. దీంతో గత ఐదు నెలల నుంచి భారత స్టాక్‌మార్కెట్‌ నేల చూపులు చూస్తోంది. అయితే అనేక రోజులుగా నష్టాల్లో ఉన్న మార్కెట్‌ ఈరోజు కొద్దిగా కోలుకుంది. ఒకవైపు ‘అమెరికా’ అధ్యక్షుడు ‘ట్రంప్‌’ సుంకాల హెచ్చరికల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్‌ కోలుకుంటుందని మార్కెట్‌ విశ్లేషకులు ఎవరూ అంచనా వేయలేకపోయారు. అయితే..ఈరోజు ‘ట్రంప్‌’ హెచ్చరికలను పట్టించుకోకుండా ‘భారతస్టాక్‌ మార్కెట్‌’ కొద్ది మేర కోలుకుంది. ఇప్పుడు రికవరీ రావడానికి ప్రధానంగా నాలుగు కారణాలు విశ్లేషకులు చెబుతున్నారు. 

1.అనేక రోజులుగా మార్కెట్‌ నష్టాల్లో ఉన్నప్పుడు పుల్‌బ్యాక్‌ వస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. గత కొన్ని రోజుల నుంచి వచ్చిన పతనానికి వచ్చిన తాత్కాలిక రికవరీ మాత్రమే..!

2.కెనడా, మెక్సికో సుంకాల తగ్గింపు అవకాశాలు

ట్రంప్‌ విధించిన సుంకాలు తాత్కాలికమైనవని మాత్రమే అనే భావన

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఈ సుంకాల విధింపును బుద్దిహీనమైన చర్యగా అభివర్ణించారు

మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా షైన్‌బౌమ్‌ కూడా త్వరలో ప్రతి చర్యలు ఉంటాయని ప్రకటించారు.

3.జెలెన్స్కీ శాంతి చర్చలు

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీ రాజీ మార్గాన్ని పరిశీలిస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.

ఇది అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ధైర్యాన్ని ఇచ్చింది.

4. బ్యాంకింగ్‌ రంగంలో బలమైన పెరుగుదల

వివిధ బ్రోకింగ్‌ సంస్థలు బ్యాంకింగ్‌ రంగంలో వృద్ధి, ఇతర రంగాల్లో కీలక రీబౌండ్‌ వస్తుందని ప్రకటించడం కూడా మార్కెట్‌ పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు. మొత్తం మీద గత ఐదు నెలల నుంచి భారీ నష్టాలు చవిచూస్తోన్న స్టాక్‌మార్కెట్‌ మదుపుదారుల మొహాల్లో ఈరోజు కొంచెం చిరునవ్వు కనిపించింది. వారి వారి ఫోర్ట్‌పోలియోల్లో నష్టాలు కొద్దిమేర తగ్గాయి. అయితే..ఈరోజు వచ్చిన రికవరీని చూసి..భారీగా పెట్టుబడులు పెట్టవద్దని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది తాత్కాలిక రికవరీ అని, అప్పుడే మార్కెట్‌ కోలుకోలేదని, మార్కెట్‌ కోలుకోవడానికి ఇంకా సమయం ఉందని వారు మదుపురులను హెచ్చరిస్తున్నారు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ