లేటెస్ట్

‘టిడిపి’ ఎమ్మెల్సీ సీట్లు: ఎవరూ ఊహించని పేర్లు...!

తెలుగుదేశం పార్టీ అధినేత ‘నారా చంద్రబాబునాయుడు’ మరోసారి తన పాత పద్దతులనే అవలంభించారు. ఆఖరి నిమిషం వరకూ అభ్యర్ధులను ప్రకటించకుండా..నాన్చి...నాన్చి..చివరకు అభ్యర్థులను ప్రకటించే తన పాత వ్యూహాలనే ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో పాటించారు. ఎన్నికలు ఏవైనా..టిడిపి అధినేత ‘చంద్రబాబు’ తన అభ్యర్థులను ఆఖరి నిమిషం వరకూ టెన్షన్‌ పెడతారు. ఎన్నో ఆశలతో రంగంలోకి దిగిన వారంతా ఆఖరి నిమిషం వరకూ తమకు అవకాశం వస్తుందేమోనని ఎదురు చూస్తుంటారు. చివరకు ఏవో కారణాలతో..వారికి అవకాశం ఇవ్వలేదని చెప్పడంతో వారంతా నిరుత్సాహానికి గురవుతారు. ఇప్పుడు పాత పద్దతినే ‘చంద్రబాబు’ పాటించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో ‘చంద్రబాబు’ ఆఖరి నిమిషంలో ఎవరూ ఊహించని వారిని ఎంపిక చేసి..పార్టీ శ్రేణులను, నాయకులను, కార్యకర్తలను ఆశ్చర్యంలో ముంతెచ్చారు. చివరకు కొన్ని కులాలు కూడా షాక్‌ ఇచ్చారు. మ్మెల్సీ నోటిఫికేషన్‌ వచ్చిన తరువాత పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా ‘కమ్మ’, ‘కాపు’ సామాజికవర్గాలకు ప్రాధాన్యత ఇస్తారని భావించగా, ‘చంద్రబాబు’ మాత్రం వారిని వదిలేసి ‘బీసీ’లకు, ఎస్సీలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఐదు ఎమ్మెల్సీ సీట్లు ఉంటే..దీనిలో ఒకటి ‘జనసేన’కు పోయింది. ఈ సీటును ‘జనసేన’ ‘పవన్‌ కళ్యాణ్‌’ సోదరుడు ‘నాగబాబు’కు కేటాయించింది. ‘నాగబాబు’ ఒకటిపోగా..మిగతా నాలుగూ ‘టిడిపి’కి వస్తాయని పార్టీ శ్రేణులు భావించాయి. అయితే..ఈ నాలుగులో మరో సీటు ‘బిజెపి’కి కేటాయించారు. దీంతో..ఇప్పుడు ‘టిడిపి’కి మూడు సీట్లు మాత్రమే మిగిలాయి. అయితే..ఈ మూడు సీట్లలో ఒకటి ‘కమ్మ’ సామాజికవర్గానికి, మరోటి ‘కాపు’ సామాజికవర్గానికి, ఇంకోటి ‘బీసీ’లకు ఇస్తారని పార్టీ శ్రేణులతో పాటు, విశ్లేషకులు భావించారు.ముఖ్యంగా ‘కమ్మ’ల్లో విపరీతమైన పోటీ ఉంది. ఈ సామాజికవర్గంలో దాదాపు పది మంది ఎమ్మెల్సీ సీటు కోసం పోటీపడ్డారు. ముఖ్యంగా మాజీ మంత్రులు ‘దేవినేని ఉమామహేశ్వరరావు, నెట్టెం రఘురామ్‌’ల్లో ఒకరికి ఎమ్మెల్సీ ఖరారైందని ప్రచారం సాగింది. వీరితో పాటు ‘కాపు’ సామాజికవర్గానికి చెందిన ‘వంగవీటి రాధాకృష్ణ’కు కూడా అవకాశం ఉందని భావించారు. వీరు కాకుండా ‘పీఠాపురం’ మాజీ ఎమ్మెల్సీ ‘వర్మ’ ‘టిడి.జనార్థన్‌లకు అవకాశం ఉంటుందని భావించారు. అయితే..ఈ పేర్లేమీ లిస్టులో లేవు. ఎవరూ ఊహించని విధంగా మాజీ స్పీకర్‌ ‘ప్రతిభాభారతి’ కుమార్తె ‘గ్రీష్మ’కు ఎమ్మెల్సీ సీటును కేటాయించారు. ఈమె ఇప్పటికే ఓ నామినెటేడ్‌ పోస్టులో ఉంది. కాగా ‘నెల్లూరు’కు చెందిన ‘బీద రవిచంద్ర’, ‘బిటి నాయుడు’లకు అవకాశం ఇచ్చారు. వీరిలో ‘గ్రీష్మ’ ఎస్సీ  కాగా, మిగతా ఇద్దరు బీసీ వర్గానికి చెందిన వారు. బీసీపార్టీగా చెప్పుకునే ‘టిడిపి’ బీసీలకు మంచి అవకాశాలనే ఇచ్చింది. అయితే..ఇప్పటికే నామినెటెడ్‌ పోస్టులో ఉన్న ‘గ్రీష్మ’కు సీటు ఇవ్వడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. కాగా ‘చంద్రబాబు’ తన నిర్ణయాలతో అటు స్వంత పార్టీ నాయకులే కాకుండా సోషల్‌ మీడియా, ప్రధాన మీడియాకు షాక్‌ ఇచ్చారు. సోషల్‌ మీడియా కానీ, ప్రధాన మీడియా కానీ..ఈరోజు ఎమ్మెల్సీగా ఎంపిక అభ్యర్థులను సూచనా మాత్రంగానైనా అంచనా వేయలేకపోయింది.  మరోవైపు ఎంపికై ముగ్గురు ‘లోకేష్‌’ వర్గానికి చెందిన వారనే ప్రచారం జరుగుతోంది. ‘లోకేష్‌’ టీమ్‌ అయినందువల్లే వీరికి అవకాశం వచ్చిందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ