లేటెస్ట్

ఇప్పటికీ...వాళ్లిద్దరూ...ఒక్కటే...!?

వైకాపా మాజీ నాయకుడు, మాజీ ఎంపి ‘విజయసాయిరెడ్డి’ ఈరోజు ‘జగన్‌’ గురించి, ఆయన పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలపై ‘టిడిపి’కి చెందిన మీడియా సంబరాలు చేసుకుంటోంది. ‘ఇంకేముంది...‘విజయసాయిరెడ్డి’ ‘జగన్‌’ గురించి అంతా చెప్పేశాడు..భవిష్యత్తులో మరిన్ని నిజాలు చెబుతారు..ఇక ‘జగన్‌’కు జైలుకే అంటూ ఒకటే హడావుడి చేస్తోంది. ఇంతకీ ‘జగన్‌’ గురించి ‘విజయసాయి’ ఏమి చెప్పాడంటే...! ‘కాకినాడ’పోర్టు విషయంలో..‘జగన్‌’కు సంబంధం లేదు...? ‘మద్యం’ కుంభకోణంలో ‘జగన్‌’ పాత్ర లేదు..? ‘కోటరీ’ వల్లే..‘జగన్‌’ అలా అయ్యాడు..? ‘కోటరీ’ని ‘జగన్‌’ పక్కన పెడితే..ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుంది..? అంటూ..పరోక్షంగా..‘జగన్‌’ ఎటువంటి తప్పులు చేయలేదు..? అంతా కోటరీనే చేసిందనే విధంగా ఆయన తెలివిగా..‘జగన్‌’ అవినీతి, అక్రమాలను  ‘విజయసాయిరెడ్డి’ ‘కోటరీ’పైకి నెట్టేస్తున్నారు. ‘కాకినాడ’ పోర్టు వ్యవహారంలో ‘విక్రమ్‌రెడ్డి’యే ‘కెవిరావు’తో డీల్‌ చేశాడని, దీనిలో ‘జగన్‌’కు సంబంధం లేదని ఆయన చెప్పారు. అంటే..ఈ కేసు మొత్తం ‘విక్రమ్‌రెడ్డి’ చుట్టూనే తిరిగేలా..‘విజయసాయిరెడ్డి’ ప్లాన్‌ వేస్తున్నారు. పార్టీలో లేకపోయినా..తన మాజీ బాస్‌ను రక్షించే చర్యలను మాత్రం ‘విజయ్‌సాయిరెడ్డి’ ఆపలేదు. మాజీ బాస్‌కు కష్టం రాకుండా ఉండేందుకు ఇతర వ్యక్తులను బలి చేయడానికి ఆయన సిద్ధపడుతున్నారు. రాబోయే నాలుగేళ్లు..ఆయన ‘జగన్‌’ పార్టీలో లేకపోయినా..ఆయనను రక్షించే చర్యలు మాత్రం చేస్తూనే ఉంటాడు. ఇప్పుడేదో..‘జగన్‌’కు వ్యతిరేకంగా మాట్లాడినట్లు ఆయన బిల్డప్‌ ఇస్తారని, ఈ క్రమంలో ఆయన ‘బిజెపి’లో చేరతారని, ఆయన ‘బిజెపి’లో చేరిన తరువాత..‘జగన్‌’ ను ‘బిజెపి’ని మళ్లీ దగ్గర చేసే మార్గాలను వెతుకుతారు. ఈలోగా..‘జగన్‌’కు ‘ఢిల్లీ’లో సహకరించే పారిశ్రామికవేత్తల ద్వారా..‘జగన్‌’ను బలహీనపడకుండా చేయాల్సింది ఆయన చేస్తారు. ‘బాహుబలి’ సినిమాలో ‘కట్టప్ప’ మాదిరి..‘విజయసాయిరెడ్డి’ ఎప్పటికీ..‘జగన్‌’కు బానిసే..అంటూ పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వైకాపా నేత ‘Janamonline.com’తో వ్యాఖ్యానించారు. ఇప్పుడు తమకు పడడం లేదని, తనను ‘జగన్‌’ అవమానించారనేది..శుద్ధ అబద్దమని, ‘జగన్‌’ అధికారంలో ఉన్నప్పుడు ‘విజయసాయిరెడ్డి’ ‘వైజాగ్‌’ను దోచేస్తున్నప్పుడు...‘జగన్‌’ ఎందుకు ఆపలేదని ఆ నాయకుడు ప్రశ్నించాడు...? వారిద్దరూ నాణేనాకి బొమ్మా బొరుసులాంటి వారని, వారి మధ్య విభేదాలనేవి రావని కూడా ఆయన అన్నారు. మొత్తం మీద..‘విజయసాయిరెడ్డి’ ఏదో చెప్పాడని ‘టిడిపి’ నేతలు, ఆ పార్టీకి చెందిన మీడియా హడావుడి చేస్తుంది..దీని వల్ల ‘జగన్‌’కు పెద్దగా నష్టమేమీ జరగదని కొందరు తటస్థులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే లక్షల కోట్లు ఇద్దరూ కలిసి దోచేశారని, ఆ సొమ్ములు చేరాల్సిన చోటుకు ఇద్దరూ కలిసే చేర్చారని, వచ్చే నాలుగేళ్లలో అవసరం ఉన్నప్పుడు ఆ సొమ్ముతో ఎవరెవరిని కొనాలో..ఎంతకు కొనాలో..అంతకు కొని..తమ తమను తాము రక్షించుకుని..మళ్లీ అధికారపీఠానికి ఎగబాకేందుకు యత్నిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. వీరి వ్యూహాలకు ‘టిడిపి’ అధినేత ‘చంద్రబాబు’ ప్రతివ్యూహాలు రచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలా చేయకుండా..‘జగన్‌’ బలహీనపడ్డారు..ఆయన పార్టీ నుంచి నాయకులు వెళ్లిపోతున్నారని సాచివేత ధోరణిని అవలంభిస్తే...మరోసారి‘జగన్‌’ చేతిలో దెబ్బతింటారనడంలో ఎటువంటి సందేహం లేదు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ