అవినీతి,అక్రమాలకు,అనైతికతకు.... కేరాఫ్ ‘టివిరెడ్డి’...!?
రాష్ట్ర సమాచారశాఖ మాజీ కమీషనర్ ‘తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి’ పాపం ఎట్టకేలకు పండిరది. గత ‘వైకాపా’ పాలనలో అనేక అవినీతి,అక్రమాలు, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన ఆయన ‘కూటమి ప్రభుత్వం’ అధికారంలోకి వచ్చినవెంటనే, చెప్పాపెట్టకుండా ‘ఢిల్లీ’కి పారిపోయారు. ‘ఢిల్లీ’కి పారిపోతే..తన అవినీతి, అక్రమాలు, అనైతిక కార్యక్రమాలు బయటకు రావని, తనను ఎవరూ ఏమీ చేయలేరనే ఉద్దేశ్యంతో..ఆయన ఉన్నారు. అయితే..చేసిన పాపాలు, అక్రమాలకు ఎప్పుడో ఒకప్పుడు శిక్ష అనుభవించక తప్పదు కదా..ఇన్నాళ్లకు ‘విజయ్‌కుమార్‌రెడ్డి’ వంతు వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత..తనను శిక్షిస్తారేమో...సంకెళ్లు వేసి..నడిపిస్తారేమో అన్న భయంతో..ఆయన పారిపోయారు. అయితే..‘చంద్రబాబు’ మాత్రం ఆచితూచి చర్యలు తీసుకుంటుండడంతో..తనను ఏమీ చేయరనే ధీమా ఆయనలో ఏర్పడింది. అయితే..విజిలెన్స్ విచారణలో ఆయన చేసిన అవినీతి, అక్రమాలు, అనైతిక కార్యక్రమాలు బట్టబయలు కావడంతో..ఇప్పుడు ‘ఏసీబీ’ అధికారుల ముందు నిల్చోవాల్సి వచ్చింది. ‘జగన్’ అధికారంలోకి రాకముందే..రాష్ట్ర సంపదను ఎలా ‘జగన్’కు దోచిపెట్టాలో...అనేదానిపై ఒప్పందం చేసుకుని..రాష్ట్రానికి వచ్చిన ‘విజయ్‌కుమార్‌రెడ్డి’ వచ్చిన వెంటనే పనిలోకి దిగిపోయారు.
‘సాక్షి’ కోసం టారిఫ్ పెంపుదల...!?
‘జగన్’ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ‘విజయ్‌కుమార్‌రెడ్డి’ చేసిన మొదటి పని..పత్రికల టారిఫ్ పెంపుదల. పత్రికా యాజమాన్యాలు ఎవరూ అడగకపోయినా..అన్ని పత్రికల టారిఫ్ పెంచేశారు. ఇదేమిటి..ఎవరూ అడగకుండానే టారిఫ్‌లు పెంచేశారు..అంటూ పత్రికా యాజమాన్యాలు ఆశ్చర్యచకితులయ్యాయి. పత్రికలంటే..‘జగన్’కు ‘విజయ్‌కుమార్‌రెడ్డి’కి ఎంత ప్రేమో..అనుకున్నారు. కానీ..దాని వెనుక ఉన్న కుట్రను అప్పట్లో కనిపెట్టలేకపోయారు. కేవలం పెద్ద పత్రికలకే కాదు..చిన్న పత్రికలకు కూడా టారిఫ్ పెంచేసి..వారి దృష్టిలో దేవులయ్యారు. అయితే..వాళ్లు దేవుళ్లు కాదు..తమ స్వార్థం కోసమే ఇలా చేశారు...రేపు ఎవరో ఒకరు కోర్టులో కేసులు వేసి..‘సాక్షి’కి దోచిపెట్టకుండా అడ్డుకుంటారన్న భావనతో..అందిరికీ పెంచేశారు. రేట్లు పెంచారు కానీ..ఇతర పత్రికలకు ఐదేళ్లలో కనీసం ఒక్క ప్రకటన ఇచ్చిన పాపాన పోలేదు. గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా..చిన్నపత్రికలకు ఎన్నోకొన్ని ప్రకటనలు ఇచ్చేవి. ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పుడల్లా..వారికీ ప్రకటనలు ఇచ్చేవి. కానీ...ఘనత వహించిన ‘జగన్’, ‘విజయ్‌కుమార్‌రెడ్డి’లు..ఐదేళ్లలో ఒక్క ప్రకటనా ఇచ్చిన పాపానపోలేదు. అంతా ‘సాక్షి’ దాని అనుబంధ పత్రికలకే..కట్టబెట్టారు.
‘కరోనా’ సాయం మాయం...!
దేవుడి దయతో..అధికారంలోకి వచ్చానని చెప్పుకునే ‘జగన్’..అధికారంతో పాటు..‘కరోనా’ను వెంటబెట్టేసుకొచ్చారు. ఈ కరోనా కాలంలో పదుల సంఖ్యలో జర్నలిస్టులు..కరోనాతో చనిపోయారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షలు సహాయం చేస్తున్నామని జీవో కూడా ఇచ్చారు.కానీ..ఐదులక్షలు కాదు కదా...ఐదు పైసలు కూడా..కరోనాతో చనిపోయిన కుటుంబాలకు సహాయం అందలేదు. చివరికి వారి స్వంత పత్రిక ‘సాక్షి’లో పనిచేసి..కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకూ..పైసా సహాయం చేయలేదు. ఇది..ధర్మప్రభువుల పాలనలో జర్నలిస్టులకు మిగిలింది. వందల కోట్లు ‘సాక్షి’ దాని అనుబంధ సంస్థలకు దోచిపెట్టిన ‘విజయ్‌కుమార్‌రెడ్డి’ కరోనా..బాధిత కుటుంబాలకు ఐదు లక్షలు ఇవ్వాలంటే..మనసొప్పలేదు. ఇది ఇతగాడి..నీతి..! ఇప్పుడేదే తనపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని వేదన చెందుతున్న ఇతగాడికి కనీసం ఇంగితం లేదా..? జీవో ఇచ్చాం..దాన్ని అమలు చేయాలనే బాధ్యత ఉండక్కర్లా..?
మైనార్టీ జర్నలిస్టు ఆవేదన...!
ఎన్నికలకు ముందు ఓ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి ‘చంద్రబాబు’ ప్రభుత్వం పోయి..‘జగన్’ ప్రభుత్వం రావాలని అహోరాత్రులు ప్రచారం చేశాడు. చివరకు..ఆయన అనుకున్నట్లు...‘జగన్’ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో..ఆ మైనార్టీ జర్నలిస్టు..రాష్ట్ర సమాచారశాఖలో స్వీట్లు పంచిపెట్టాడు. ఇక ‘జగన్’ ‘విజయ్‌కుమార్‌రెడ్డి’లు తనను ఆకాశానికెత్తాస్తారని ఆశపడ్డారు. కానీ..ఆయన ఆశలకు ఆదిలోనే...ఈ ద్వయం బొందపెట్టింది. ‘కరోనా’ సమయంలో..ఆయన భార్య మృతి చెందిందని, తనకు ‘చంద్రబాబు’ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రకటనల సొమ్ము (అక్షరాలా లక్షా తొంబైవేలు) ఇప్పించాలని ‘విజయ్‌కుమార్‌రెడ్డి’ కాళ్ల చుట్టూ తిరిగినా..ఈ కర్కోటకుడు కరుణించలేదు. సరికదా..నీ భార్య చనిపోతే..నేనేమి చేస్తాను..సిఎంతో చెప్పించు..అప్పుడు నీ సొమ్ములు ఇస్తాను..అంటూ ఈసడించుకున్నారు. ఆయన వైఖరి, ‘జగన్’ వైఖరి చూసిన ఆ మైనార్టీ జర్నలిస్టు..ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా..? ఈ దుర్మార్గులకు శిక్ష ఎప్పుడు పడుతుందా..? అంటూ..గొంతెత్తి..అరిచి అరిచి..చివరకు ‘గుండెపోటు’తో చనిపోయారు. తన బాస్, తనకు వ్యక్తిగత బలహీనతలను తీర్చేవారికి వందల కోట్లు గుమ్మరించిన ‘విజయ్‌కుమార్‌రెడ్డి’ ఈ మైనార్టీ జర్నలిస్టుకు లక్ష రూపాయలు ఇవ్వలేకపోయారు. పోనీ..అదేమన్నా.ఈయన తాత గారి సొమ్మా..పోనీ.. ఈయనేమైనా ఇచ్చారా..? లేదు కదా..గత ‘చంద్రబాబు’ ప్రభుత్వం ఇచ్చిందే కదా..? ‘చంద్రబాబు’ ప్రభుత్వం ఇచ్చిన వందలకోట్ల ప్రకటనలకు కమీషన్లు తీసుకుని ‘విజయ్‌కుమార్‌రెడ్డి’ బిల్లులు చెల్లించలేదా..? ఇంత అన్యాయమా..చేసేది...? ఇలా ఒకటా..రెండా...? వేల మంది ఉపాధిని బజారు పాలు చేసి..ప్రభుత్వ సొమ్మును అన్యాయంగా...అక్రమంగా, అనైతికంగా ‘జగన్’కు దోచిపెట్టడానికా..‘ఢిల్లీ’ నుంచి ఇక్కడకు దిగబడిరది.
అవుట్‌డోర్ యాడ్ ఏజెన్సీల పేరిట దోపిడీ...!
ఒకవైపు ‘సాక్షి’ మీడియాకు దోచిపెడుతూనే..మరోవైపు అవుట్‌డోర్ యాడ్ ఏజెన్సీలకు వందల కోట్లు గుమ్మరించి వారి వద్ద నుంచి కోట్లలో కమీషన్లు మింగేశారు. దీనిలో భాగంగా తన కులస్థులకు, తన వ్యక్తిగత బలహీనతలను తీర్చేవారికి పెద్దపీట వేశారు ‘విజయ్‌కుమార్‌రెడ్డి’. ఎటువంటి.. అనుభవం.. సీనియార్టీ లేకపోయినా.. మహిళలైతే చాలు..వారికి యాడ్ ఏజెన్సీల పేరుతో భారీగా దోచిపెట్టారు. అవినీతి, అక్రమాలే కాదు..అనైతిక కార్యక్రమాల్లో ఆయన దిట్ట. ఆయన అనైతిక వ్యవహారాల గురించి శాఖలో కథలు..కథలుగా చెప్పుకుంటారు. ఐదేళ్లపాటు..ఓ అధికారికి రాష్ట్ర సమాచారశాఖను కట్టబెట్టిన ఈ ఘనుడు ..ఆ అధికారి అక్రమాలకు, అవినీతికి, దౌర్జన్యాలకు పాల్పడినా..చివరకు తనను బెదిరించినా..నోరెత్తలేదు. ఎందుకంటే..ఈయనగారి వ్యవహారాలు వారి చేతిలో ఉండడమే దీనికి కారణం. ఇక్కడే కాదు..ఈయన గారు గతంలో హైదరాబాద్‌లో పనిచేసినప్పుడూ, తరువాత ‘ఢిల్లీ’లోపనిచేసినప్పుడూ..స్వకులం వారు కనిపిస్తే చాలు..అయ్యగారికి ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తుంది. వారి అడిగినదల్లా చేసిపెట్టారు. ‘జగన్’కు ‘కట్టప్ప’లా..ఆయనేమి చెబితే..అది చేసిన ఈ అధికారి ఇప్పుడు ఊచలు లెక్కించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈయనగారితో పాటు..అప్పటి అక్రమాల్లో భాగస్తులైన మరికొందరు కూడా జైలుకు వెళ్లడానికి సిద్ధమవ్వాల్సిందే. వాస్తవానికి విజిలెన్స్ నివేదిక వచ్చిన వెంటనే..‘ఈయన’గారిని ‘చంద్రబాబు’ ప్రభుత్వం అరెస్టు చేయాల్సింది. కానీ..అంతా చట్టప్రకారమే చేయాలంటూ..‘చంద్రబాబు’ సున్నితంగా వ్యవహరిస్తున్న కారణంగా..ఈ అక్రమార్కుడు..అవినీతిపరుడికి ఇంకా అరదండాలు పడలేదు.
వివరణ:- కాగా ‘విజయ్‌కుమార్‌రెడ్డి’ అవినీతిలో భాగస్వాములైన కొంత మంది అధికారులు ప్రస్తుతం కీలక స్థానాల్లో ఉన్నవారు, పోస్టింగ్‌లు లేని వారు....‘జనమ్‌ఆన్‌లైన్.కామ్’కు ప్రకటనలు ఇవ్వకపోవడం వల్లే..కక్షపూరిత రాతలు రాస్తున్నారని, మా సంస్థపై లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు. ‘విజయ్‌కుమార్‌రెడ్డి’ ఐదేళ్ల కాలంలో మాకు ప్రకటనలు ఇవ్వాలని కనీసం మేము ధరఖాస్తు కూడా చేసుకోలేదు. కనీసం ఆయన మొహం కూడా చూడలేదు. ఆయనపై కానీ, ఆయన అవినీతిలో భాగస్వాములైన వారిపై కానీ..వ్యక్తిగతంగా..మాకు ఎటువంటి కక్ష లేదు. కానీ..వ్యవస్థను ధ్వంసం చేశారనే బాధ, జర్నలిస్టుల ప్రాధమిక హక్కులను హరించారనే కారణం తప్ప ఇంకేమీ లేదు. ఈ వివరణ ఎందుకంటే.. మాపై కొందరు అవినీతిలో భాగస్వాములైన వారు..లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని, నిజం తెలియాలనే..ఈ వివరణ ఇస్తున్నాం.