లేటెస్ట్

‘సింగిల్‌ సింహాని’కి భయమేసిందా...!?

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని ఆయన అభిమానులు ‘సింగిల్‌ సింహం’ అంటూ ఎత్తేస్తుంటారు. ఆయనేదో వీరాధివీరుడని, సోనియాను ఎదిరించిన ధీరుడని..ఇంకా ఏమిటేమిటో...అర్థంపర్థం లేని బిరుదులు తగిలించి..రీల్స్‌ విడుదల చేస్తుంటారు. అయితే..ఆయనకు అంత సీన్‌ లేదని..మొన్నటి ఎన్నికల్లో..‘ఆంధ్రాజనాలు’ తేల్చేశారు. ప్రజలు ప్రతిపక్షస్థానానికి కూడా ఆయన అర్హుడుకాడంటూ.. తిరస్కరిస్తే.. ఆయన పేటీఎం బ్యాచ్‌ మాత్రం..ఇవిఎంలు..కూటమితో వచ్చారు..సింగిల్‌గా రండంటూ..రంకెలేస్తుంటారు. వీరంతా ఆయనను ఆసాంతం నాకించినా..ఇంకా ఆయనకు నిచ్చెనలు వేస్తూనే ఉంటారు. వాస్తవానికి...ఈ సింగిల్‌ సింహం ఎప్పుడూ..ఎక్కడా..నేరుగా ఎవరినీ ‘ఢీ’ కొట్టిన పాపాన పోలేదు. అప్పట్లో..తండ్రి మరణించినప్పుడు కాంగ్రెస్‌ ‘సిఎం’ సీటు ఇవ్వలేదని స్వంత పార్టీ పెట్టుకుంటే..‘సోనియా’కు ఎక్కడో మండి..తీసుకెళ్లి ‘చర్లపల్లి’జైలులో పారేసింది. అక్కడ నుంచి బయట పడడానికి ఈ ‘సింగిల్‌ సింహం’ తల్లి, భార్య, సోదరితో..‘సోనియా’ కాళ్లు పట్టుకుని బ్రతిమలాడితే..ఏదో పోనీలే అంటూ...ఆనాడు ఆమె వదిలేసింది. ఆమె వదిలేసిన తరువాత...అదృష్టం తిరగబడితే..మళ్లీ  అధికారంలోకి వచ్చిన ‘మోడీ’ పాదసేవ చేస్తూ తరిస్తున్నారు. సుధీర్ఘకాలం అధికారంలో ఉన్న ‘మోడీ’కి ఎక్కడ కోపం వస్తుందో..ఆయనకు కోపం వస్తే..తనను మళ్లీ ఎక్కడ శ్రీకృష్ణజన్మస్థానానికి పంపుతారో..అన్న భయంతో..అడుగడుగునా..ఆయన సేవలోనే తరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 25కు 25 స్థానాలు ఇస్తే..ప్రత్యేకహోదా తెస్తానని, పోలవరం కట్టేస్తానని అరివీరభయంకరంగా...శపథాలు చేసిన ఈయనగారిని చూసి..‘ఆంధ్రాజనాలు’ పోనీ ఏదో చేస్తాడనే ఊహలతో అధికారాన్ని కట్టబెట్టారు. అయితే.. అయ్యగారు అధికారంలోకి వచ్చిన తరువాత..ఆ శపథాలను మరిచిపోయి...‘మోడీ’ ‘అమిత్‌షా’ ధ్వయానికి కోపం రాకుండా....ఐదేళ్లు వారి సేవలో తరించారు. వారు కూర్చోమంటో.. కూర్చున్నారు..నిలబడమంటే నిలబడ్డారు...వాళ్ల కనుసైగలతో ఐదేళ్లు అడుగులకు మడుగులొత్తారు. ఇప్పుడు మళ్లీ ప్రతిపక్షంలోకి వచ్చినా...మన్న ‘సన్నీ’లో ఆ భయం ఇంకాపోలేదు. ఇప్పుడు పార్లమెంట్‌ నియోజకవర్గాల ఢిలిమిటేషన్‌ వల్ల ‘దక్షిణాది’ రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని, దీన్ని ఎదుర్కోవాలని ‘తమిళనాడు’ ముఖ్యమంత్రి ‘స్టాలిన్‌’ ఓ మీటింగ్‌ ఏర్పాటు చేసి...దానికి ‘జగన్‌’ను ఆహ్వానించారు. అయితే..‘జగన్‌’ మాత్రం ‘మోడీ’ ‘షా’ ధ్వయం భయంతో..ఆ మీటింగ్‌కు వెళ్లలేదు. అక్కడకు వెళితే..ఏమి జరుగుతుందో..తెలుసు కనుక..తనకు వెళ్లాలని ఉన్నా...వెళ్లకుండా..దుప్పటి ముసుగేసి..తాడేపల్లిలో..నిద్రనటిస్తున్నాడు. అదేమంటే..‘మోడీ’కి లేఖ రాశానని.. ‘ఢిలిమిటేషన్‌’ను వ్యతిరేకిస్తున్నానని..పేటీఎం జనాలకు నచ్చ చెప్పుకుంటున్నాడు. మరి సింగిల్‌ సింహం..సోనియాను ఎదిరించిన ధీరుడు ‘చెన్నెయి’ మీటింగ్‌కు ఎందుకు వెళ్లలేదు...? భయంలేని ‘సింగిల్‌ సింహం’..అక్కడికి వెళ్లి ‘మోడీ’కి లేఖ రాసింది..చెప్పవచ్చు కదా..? అప్పుడు కదా..నిజమైన ధీరుడు..వీరుడు..కాగితాల కట్టల చాటున దాగునే వాడికి ఎందుకీ ఎలివేషన్లు...? ఇప్పటికైనా..ఇటువంటి ఎలివేషన్లు మానుకుంటే..కొద్దో గొప్పో విలువ ఉంటుంది.  

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ