లేటెస్ట్

‘బురద’ చల్లడానికి వందల కొద్ది...యూట్యూబ్‌ ఛానెళ్లు రెడీ...!?

‘ఆంధ్రప్రదేశ్‌’లో అధికారంలో ఉన్న ‘కూటమి ప్రభుత్వం’పై బురద చల్లడానికి వందల కొద్ది యూట్యూబ్‌ ఛానెళ్లు రెడీగా ఉన్నాయి. గత సార్వత్రిక ఎన్నికల ముందు వందల కొద్ది పెయిడ్‌ ఛానెల్స్‌ ‘వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి’ మళ్లీ అధికారంలోకి వస్తారని ఒకటే ఊదరగొట్టాయి. 175/175 అంటూ ఆ ఛానెల్స్‌ ఒకటే హడావుడి చేశాయి. ఇలా ఊదరగొట్టిన ఛానెల్స్‌లో మెజార్టీ ఛానెల్స్‌ ‘ఆంధ్రప్రదేశ్‌’కు చెందినవి కావు. ‘హైదరాబాద్‌’ కేంద్రంగా..ఈ ఛానెల్స్‌ ఏర్పాటు చేసుకుని ‘జగన్‌’కు బాగా కొట్టాయి. స్థానిక పరిస్థితులు తెలుసుకోకుండా..ఇష్టారాజ్యంగా వార్తలు వండి వార్చాయి. ఇలా వార్చిన వాటిలో ఏవో..దిక్కుమాలిన ఛానెల్స్‌ ఉన్నాయంటే..ఏదో వారి పొట్టకూటికోసమని..అర్థం చేసుకోవచ్చు. కానీ..అలాంటి వారే కాకుండా సమాజంలో ఒక స్థాయిలో ఉన్నవారు..ప్రొఫెసర్లమని చెప్పుకునేవారు..గతంలో ప్రతిష్టాత్మక పత్రికల్లో సుధీర్ఘకాలం జర్నలిస్టులుగా పనిచేసిన వారు కూడా ఉన్నారు. వీరందరూ..అప్పటి అధికార పార్టీకి బాకాలు ఊదారు. ‘జగన్‌’ పాలన బ్రహ్మాండం అంటూ..ఆయన పేదల పక్షపాతి అంటూ ప్రచారం చేశారు. అయితే..వారి ప్రచారాన్ని తెలివైన ‘ఆంధ్రులు’ తిప్పికొట్టి వాళ్లకు బుద్ది చెప్పారు. ఎన్నికల్లో ‘ఆంధ్రా’ ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి ఈ మేధావుల నోళ్లు గత కొన్నాళ్లుగా మూత పడ్డాయి.


అయితే..ఇటీవల కాలంలో మళ్లీ పుట్టగొడుగుల్లా..ఈ ఛానెల్స్‌ పుట్టుకొస్తున్నాయి. ఇలా పుట్టుకొచ్చేవాటిలో దాదాపు 99శాతం ‘వైకాపా’ను సమర్థించేవే. రాష్ట్రంలో ఏ చిన్న ఇబ్బందికరమైన సంఘన జరిగినా..వీళ్లు ముందే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. ప్రతిదానికి ప్రభుత్వమే చేయించిందని.. ‘చంద్రబాబు’, ‘పవన్‌’లే దీనికి కారణమంటూ..ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. తాజాగా పాస్టర్‌ ‘ప్రవీణ్‌’ మృతిపై ఈ య్యూటూబ్‌ ఛానెల్స్‌ వ్యవహరించిన తీరు..వివాదాస్పదంగా మారింది. ‘ప్రవీణ్‌’ మృతికి ‘కూటమి ప్రభుత్వమే’ బాధ్యత వహించాలని, ఆయనను కూటమి నేతలే చంపించారని ఇష్టారాజ్యంగా వీడియోలు వదిలారు. అసలు ఎవరు వీరంతా..? ఎక్కడ నుంచి పుట్టుకొస్తున్నారు..? ఒక వార్తను బాధ్యతారహితంగా ప్రసారం చేసి సమాజంలో అలజడి సృష్టిస్తారా..? ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ‘పాస్టర్‌’ మృతిపై ప్రభుత్వం విచారణ జరిపిస్తుండగానే..ఫలానా వాళ్లు చంపించారు..? ‘పవన్‌’ హస్తం ఉంది..అంటూ ఊదరగొట్టడమేమిటి..? వీరిని ప్రోత్సహిస్తున్న వారెవరు..? ఇలా ఇష్టారాజ్యంగా వీడియోలు పెడుతున్నవారిపై ప్రభుత్వం ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తుంది. సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న ఈ యూట్యూబ్‌ అతిగాళ్లపై చర్యలు లేవా..? వీరి ఇలా వదిలేస్తే..ఇష్టారాజ్యంగా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసి..ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం లేకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి మూకలపై ‘కూటమి ప్రభుత్వం’ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ