లేటెస్ట్

‘జ‌గ‌న్’ ‘పిఆర్వోలా’...మ‌జాకా...!?

తెలుగుదేశం పార్టీ కొన్ని విషయాల్లో పదే పదే తప్పులు చేస్తూనే ఉంటుంది. పార్టీకి నష్టం చేకూరుస్తున్నా..వాటిని సరిదిద్దడానికి ఎవరూ ముందుకు రావడానికి ఇష్టపడరు. ఎందుకో..కొన్ని విషయాలను చాలా చిన్న విషయాలుగా భావించి...వదిలేస్తారు. చివరకి అవే..పార్టీని ఇబ్బందుల పాలుచేస్తుంటాయి.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ఉద్యోగుల విషయాల్లో చాలా రగడ జరిగింది. కొన్నిశాఖల్లో ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగులను నియమించారని, వారికి భారీగా వేతనాలు ఇచ్చారనే విషయంపై ‘టిడిపి’లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడి చివరకు ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌గా ఉన్న ‘జివిరెడ్డి’ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇబ్బడిముబ్బడిగా వైకాపా కార్యకర్తలను, ‘సాక్షి’ ఉద్యోగులను ‘ఫైబర్‌నెట్‌’లో నియమించారని, వారిని తొలగించాలని ‘జీవీరెడ్డి’ డిమాండ్‌ చేయడం..దానికి అప్పటి దాని ఎండి వేగంగా చర్యలు తీసుకోకపోవడంతో..అది పెద్ద ఎత్తున రచ్చ కావడంతో..‘జీవీరెడ్డి’ రాజీనామా చేసి వెళ్లిపోయారు. అయితే..ఆయన రాజీనామా తరువాత..ఇలా అక్రమంగా నియమించిన కొందరు ఉద్యోగులు..ఇప్పుడు ఈ ప్రభుత్వం తమనేమీ చేయలేదని విర్రవీగుతున్నారు. తమను ఈ ప్రభుత్వం తొలగించలేదని చెబుతూ..‘చంద్రబాబు’ను ఆయన కుమారుడు ‘లోకేష్‌’ను బూతులు తిడుతున్నారు. వారిద్దరూ ఏమీ పీకలేరని, తమను కదిలించలేరని వారు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇలా చేస్తోన్నవారిలో చాలా మంది ‘పిఆర్వోలు’ కూడా ఉన్నారు. గత ‘జగన్‌’ ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో కొందరు ‘జగన్‌’ భక్తులను ‘పిఆర్వోలు’గా నియమించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీరినెవరినీ తొలగించలేదు. దాంతో..వీరు కొన్ని కీలకమైనశాఖల్లో ఇప్పటికీ ‘పిఆర్వోలు’గా చలామణి అవుతున్నారు. కూటమి నేతల మంచితనాన్ని అలుసుగా తీసుకుని వీరంతా చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా కొందరు మంత్రుల వద్ద పనిచేసే ‘పిఆర్వోలు’ అయితే..అలవికావడం లేదు. మంత్రుల వద్దకు వచ్చే సందర్శకుల ముందే ‘జగన్‌’ గొప్పవాడు..మంచివాడు..ధైర్యవంతుడు.. అంటూ ఆయన భుజకీర్తులు తొడుగుతున్నారు. సరే..జగన్‌ను పొగుడుతున్నారని సర్దుకున్నా..వారు అంతటితో ఆగడం లేదు. ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ను ఆయన తనయుడు ‘లోకేష్‌’ను దూషిస్తున్నారు. వేల కొద్ది జీతాలు తీసుకుంటూ వీళ్లు చేస్తున్న పనులు ఇవి. నిత్యం సచివాలయంలో వివిధ విభాగాల్లో ఉన్న వీరు..ప్రతిచోటా రాజకీయ చర్చలు చేస్తూ..వారిద్దరితో పాటు ఉపముఖ్యమంత్రి ‘పవన్‌’ను ఎద్దేవా చేస్తున్నారు.


‘జగన్‌’ హయంలో నియమితులైన వీరిని తొలగించకుండా వాళ్లకు కూటమి ప్రభుత్వం మేలు చేసినా..వీళ్లు తమ బుద్దిమాత్రం మార్చుకోవడం లేదు. దాదాపు లక్షన్నర జీతం తీసుకుంటూ ఓ శాఖలో పిఆర్వోగా ఉన్న ఓ వ్యక్తి నిత్యం ఇదే రీతిలో వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వ మంచితనాన్ని చేతకానితనంగా భావించి వీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలా వ్యవహరిస్తున్నవారిపై ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోకపోతే..ప్రభుత్వానికి, పార్టీకి మరిన్ని ఇబ్బందికర పరిస్థితులను వీరు సృష్టిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. అసలు పిఆర్వోలుగా వీరు చేస్తోన్న పని ఏమిటో..? వీరు ఏమేమి చేస్తున్నారో..పర్యవేక్షించేవారు లేకపోవడమే దీనంతటికి కారణం. నిత్యం సచివాలయానికి రావడం..అక్కడా ఇక్కడా పెత్తనాలు చేయడం..పైరవీలు చేసుకోవడం...పది మంది ఉన్నచోటకు చేరి..ప్రభుత్వ పెద్దలను దూషించడం.. ‘జగన్‌’కు భుజకీర్తులు తొడగడమే పనిగా వీరు వ్యవహరిస్తున్నారు. వీళ్లే కాదు.. ఇటీవల కొందరు పిఆర్వోలుగా నియమితులైన వారి వ్యవహారాలు కూడా ఇలా ఉన్నాయి.విద్యుత్ సంస్థ‌ల్లో రూ.90వేల జీతంతో నియమించబడ్డ..ఓ పిఆర్వో అయితే..నిత్యం సచివాలయంలో ప్రదిక్షిణలు చేస్తున్నారు. ఆయన పనిచేసేది విద్యుత్ సంస్థ‌ల్లో అయితే..ఆయన మాత్రం సచివాలయంలో ప్రతి సెక్షన్‌లో దర్శనమిస్తుంటారు. అయితే.. ఆయనకు మంత్రే ఏ పనిచెప్పకండి...? ఆయనను అలా వదిలేయండి..జీతం మాత్రం ఇవ్వండి అని చెప్పారని ఆయన చెప్పుకుంటున్నారట. ఇతగాడు..గత ‘జగన్‌’ ప్రభుత్వంలో పైరవీలు చేసుకుని..ఇప్పుడు ‘టిడిపి’ మద్దతుదారు కోటాలో ‘పిఆర్వో’గా నియమించబడ్డారు. ఈయనగారు విద్యుత్ సంస్థ‌ల్లో ఏమి ఉద్దరిస్తున్నాడో..కానీ..నిత్యం సచివాలయంలో మాత్రం హాజరు వేయించుకుంటారు. పబ్లిసిటీ సెల్‌లో పిచ్చాపాటి చేస్తూ కాలం గడిపేస్తున్నారని..మంత్రి పేరు చెప్పుకుని జీతం తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అదే విధంగా మరో మంత్రి వద్ద ఉన్న పిఆర్వోదీ అదే దారి. ‘చంద్రబాబు’ను ఆయన కులాన్ని దూషించే ఈయన గారు..‘జగన్‌’ హయాంలో నియమింపబడ్డారు. ఆయనను కూడా కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుంది. ‘జగన్‌’ పార్టీ నుంచి వచ్చి మంత్రి అయిన ఆయన దగ్గర ఈయనగారు పిఆర్వో పదవి వెలగబెడుతున్నారు. ఇటువంటి వారినంతా కూటమి ప్రభుత్వం ఎందుకు పెంచిపోషిస్తుందో..వాళ్లకు జీతాలు ఇచ్చి..ఎందుకు..తిట్టించుకుంటుందో..ఎవరిఈ అర్థం కావడం లేదు. ఏది ఏమైనా..ఇటువంటి వారిని ఇంకా కొనసాగిస్తే..ప్రభుత్వానికి, పార్టీకి ఇబ్బందులు తప్పవు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ