లేటెస్ట్

విధ్వేషాలను రెచ్చగొడుతున్న ‘జగన్‌’ మీడియా...!?

‘జగన్‌’ మీడియా మరోసారి కులాలను, మతాలను రెచ్చగొట్టడమే ధ్యేయంగా వార్తలు వండివారుస్తోంది. 2014`19ల మధ్య అనుసరించిన వ్యూహాన్నే ఈ సారి మరింత దూకుడుగా అమలు చేస్తోంది. దీనిలో భాగంగా కులాలను, మతాలను, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడానికి భారీ ఎత్తున్న సొమ్ములను కూడా ఖర్చు చేస్తోంది. అప్పట్లో రాజధాని ‘అమరావతి’పై విషపురాతలు, కుట్రలతో ఈ ప్రాంతంలో చిచ్చురేపిన ‘జగన్‌’ మీడియా..తరువాత ఇతర ప్రాంతాల మధ్య ముఖ్యంగా ‘రాయలసీమ’కు అన్యాయం జరిగిందనే ప్రచారంతోనూ..మధ్యాంధ్రలో ‘కాపు’లకు రిజర్వేషన్ల పేరిట చిచ్చుపెట్టి తరువాత ఎన్నికల్లో భారీగా లాభపడిరది. అప్పట్లో ‘రాజధాని’ అమరావతిని ‘కమ్మరావతి’ అంటూ..విధ్వేషాలను రెచ్చగొట్టింది. రాజధాని ‘అమరావతి’లో అందరూ ‘కమ్మ’ కులానికి చెందిన వారే ఉన్నారంటూ..వారి ప్రయోజనాల కోసమే రాజధాని నిర్మిస్తున్నారంటూ..ప్రజలను నమ్మించింది. అప్పట్లో ‘జగన్‌’ మీడియా, జగన్‌ పార్టీ ప్రచారాన్ని ప్రజలు బాగానే నమ్మారు. నిజానిజాలేమిటో తెలుసుకోకుండా..వాళ్లు చేసిన ఫేక్‌ ప్రచారాన్ని నమ్మి ప్రజలు ‘జగన్‌’కు అధికారాన్ని కట్టబెట్టారు.


తాజాగా..ఇప్పుడు కూడా ‘జగన్‌’ అదే ప్రచారాలకు తెరలేపారు. రోడ్డు ప్రమాదంలో ఓ ఫాస్టర్‌ మృతి చెందితే..అది ప్రభుత్వం చేయించిన హత్య అంటూ..సోషల్‌ మీడియాలో హోరెత్తించారు. పోలీసులు..అసలు విషయాన్ని బయటపెట్టినా..అది హత్యేనంటూ..అడ్డగోలుగా వాదిస్తూ మతాల మధ్య చిచ్చుపెట్టడానికి యత్నిస్తున్నారు. అదే విధంగా..‘కమ్మ’ కులానికిచెందిన ఓ వ్యక్తి..‘ఎస్సీ’ సామాజికవర్గానికి చెందిన వారిని కులం పేరుతో తిట్టారంటూ..ఆ కులం పేరును తమ పత్రికలో ప్రముఖంగా పేర్కొంటూ..ఆ కులానికి, కమ్మ కులానికిచెందిన వారి మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించింది. ఓ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ (అది నిజంగా జరిగిందా..లేదా..అనేది తెలియదు)ను కులాల పేర్లు పేర్కొంటూ... తాటికాయంత అక్షరాలతో ముద్రించడం వెనుక ఉన్న దురుద్దేశ్యాలను ప్రభుత్వ పెద్దలు గుర్తించారో లేదో తెలియదు. అయితే..కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు రాజేసేందుకు ‘జగన్‌’ పార్టీ నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వారిపై ప్రత్యేక నిఘా లేకపోతే..ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు.


ఇప్పటికే వందల యూట్యూబ్‌ ఛానెల్స్‌ను పెట్టేసి..వాటికి ప్యాకేజీలు ఇచ్చేసి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తోంది. మేధావుల పేరిట కొంతమందిని పెయిడ్‌ ఆర్టిస్ట్‌ను తీసుకువచ్చి, విశ్లేషణల పేరుతో ప్రభుత్వంపై బురద గుమ్మరిస్తోంది. వీరిలో కొందరు అతి చేష్టలకు పోతున్నారనే విమర్శలు ఉన్నాయి.ముఖ్యంగా ‘చంద్రబాబు’ను, ఆయన తనయుడిని ఇష్టారాజ్యంగా దూషిస్తున్నారు. వాళ్లు దూషిస్తే పోయేదేమీ ఉండదు కానీ..సమాజంలో శాంతిభద్రతల సమస్యలను సృష్టించడానికి నిత్యం యత్నిస్తున్నారు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు లేకపోతే.. ప్రభుత్వం ఎంత అభివృద్ధిచేసినా..ఎన్ని సంక్షేమపథకాలను అందించినా..అది వృధానే అవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు ముందుచూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇటీవల తెలంగాణలో జరిగిన ‘కంచె గచ్చిబౌలి’ విషయంలో అక్కడి రాజకీయపార్టీ సోషల్‌ మీడియాను ఉపయోగించుకుని ప్రభుత్వానికి చుక్కలు చూపించింది. ఉన్నవీ లేనివీ..ఐఏ ద్వారా సృష్టించి..ప్రభుత్వానికి చెమటలు పోయించింది. సోషల్‌మీడియాలో వస్తోన్న కల్పిత వీడియోల విషయంలో అక్కడి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంతోనే వారికి భారీ దెబ్బ తగిలింది. సోషల్‌ మీడియాలో వస్తోన్న వీడియోలు నిజమా..? కల్పితమా..? అనేది వాళ్లు తెలుసుకోలేకపోయారు. తెలుసుకునేవ‌ర‌కు.. వారికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక్కడ కూడా..అదే విధంగా ‘జగన్‌’ సృష్టించే కల్పిత వార్తలు కానీ..ఇతర విషయాలపై కానీ ప్రభుత్వం సత్వరమే స్పందించకపోతే..తెలంగాణలో వలే..ఇక్కడి ప్రభుత్వం కూడా ఎదురుదెబ్బలు తినాల్సిన పరిస్థితి ఉంటుంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ