‘బుర్ర’ లేని ‘వైకాపా’...!?
‘మేము అధికారంలోకి వస్తే..నరుకుతాం’..చంపేస్తాం..గుడ్డలూడదీస్తాం...పరుగులు పెట్టిస్తాం...పాతేస్తాం....సప్తసముద్రాల అవతల ఉన్నా లాకొస్తాం’...రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా దాదాపు నాలుగున్నరేళ్ల సమయం ఉండగానే..వైకాపా నేతలు చేస్తోన్న హెచ్చరికలు. ఏదో చిన్నస్థాయి నాయకులు చేశారంటే..సరే అనుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ‘వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి’ ఎప్పుడు బయటకు వచ్చినా..చేసే హెచ్చరికలు ఇవే..! గుడ్డలూడదీస్తాం...’ ఆయనకు అలవాటైన పదమో..లేక గుడ్డలూడదీస్తే చూడడం..ఆయనకు ఇష్టమో తెలియదు కానీ...ప్రతిసారీ..దాదాపుగా ఇవే మాటలు....! ఆయనతో పాటు ఆయన సోషల్ మీడియా సైన్యాది ఇదే మాటలు. 2029లో అధికారంలోకి వస్తే..ప్రతివారినీ చంపేస్తాం...నరికేస్తాం..మాకు ఎదురుతిరిగిన ప్రతివారినీ..నచ్చని వారినందరినీ లేపేస్తామంటూ..ఆయన సైన్యం సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. ఇలా ప్రగల్భాలు పలికితే..‘జనం’లో తమకు బలం తగ్గలేదని, మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని పార్టీలోని కార్యకర్తలను నమ్మించడానికి వాళ్లు చేస్తోన్న ప్రయత్నమే ఇది. అయితే..ఇలా చేస్తే..‘జనం’లో వారికి బలం పెరుగుతుందా..? లేనే లేదు. ఎందుకంటే..ఐదేళ్ల క్రితం..ఏవేవో మాయమాటలతో, కులాన్ని, మతాన్ని, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి అధికారంలోకి వచ్చిన తరువాత ‘జగన్’ అండ్ కో బ్యాచ్ చేసిదేమిటో..రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సమాజంలోని ప్రతివర్గమూ వీరి చేతిలో అష్టకష్టాలు పడ్డారు. ఈ వర్గం..ఆవర్గం అంటూ లేదు..ప్రతివారికీ వెతలే..చివరకు ఇది కులాలను, మతాలను, ప్రాంతాలను మరిచిపోయేటట్టు చేసి..మెజార్టీ నిర్ణయంగా మార్చేసింది. వాళ్లు జనాలను భయపెట్టి అధికారాన్ని అనుభవించినా..మరోసారి..జనాలకు ఎంగిలిమెతుకులు వేసి..మళ్లీ భయపెట్టి..అధికారంలోకి రావాలని చూస్తే..మెజార్టీ ప్రజలు సరైన సమయం చూసుకుని..కర్రుకాల్చి వాతపెట్టారు. అప్పట్లో ‘చంద్రబాబు’, ‘పవన్’లు ఏదో ఊడబొడుస్తారని వారికి అధికారాన్ని కట్టబెట్టలేదు. కేవలం తమను భయపెట్టి..రాజ్యాన్ని సాధించాలనుకున్న ‘నియంత’కు బుద్దిచెప్పేందుకే..వాళ్లు..‘కూటమి’కి అధికారాన్ని అప్పచెప్పారు. అయితే..గత ఎన్నికల ఫలితాలను ‘బుద్ది,బుర్ర’ లేని వైకాపా నేతలు సరిగా విశ్లేషించుకోలేకపోతున్నట్లుంది. ఆ పార్టీ అధినేత ‘జగన్’ చెప్పే చేతకాని మాటలనే నమ్ముతున్నారు. ‘ఈవిఎం’ల వల్లే ‘టిడిపి కూటమి’ గెలిచిందని, ఇప్పటికీ తనకు ప్రజల్లో ఆదరణ తగ్గలేదని వాళ్లను నమ్మించడానికి జిమ్మిక్కులు చేస్తున్నారు. అసలు వాస్తవాన్ని వాళ్లకు చెప్పకుండా..చెప్పే అవకాశం లేకుండా..దోచిన సొమ్ముతో జనాన్ని పోగేస్తూ..మళ్లీ అధికారం మనదే..అంటూ వాళ్లను వెర్రివాళ్లను చేస్తున్నారు. ఈ కోవలోనే..బట్టలూడదీస్తాం..చంపేస్తాం.. నరికేస్తాం..అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇలా భయపడితే..గతంలో జరిగిందే మళ్లీ జరుగుతుందని ఆ పార్టీ వారికి చెప్పే నాధుడే లేడు. మెజార్టీ ప్రజలు ‘జగన్’ నియంతృత్వానికి, దొరతనానికి, బిచ్చగాళ్లను చేసే యత్నాలకు వ్యతిరేకమని మొన్నటి ఎన్నికల్లో తేలిపోయింది. ఇప్పుడు మళ్లీ అలా చేస్తే..ఆ మెజార్టీ ప్రజలు మరోసారి..వాళ్లను నేలకేసి కొడతారని వైకాపా హితవు కోరుకునే ‘శుక్రాచార్యుడు’ ‘ఉండవల్లి అరుణ్‌కుమార్’ అయినా..వాళ్లకు చెప్పాల్సింది. కానీ..‘శుక్రాచార్యుని’ మాట కూడా..ఆలకించే పరిస్థితి లేకుండా ‘బట్టలుఊడదీసే’ కార్యక్రమంలోకి..‘జగన్’ పార్టీని తీసుకెళుతున్నారు.