లేటెస్ట్

‘కేశినేని చిన్ని’కీ లిక్కర్‌కింగ్‌ ‘కసిరెడ్డి’తో సంబంధాలు: మాజీ ఎంపి కేశినేని నాని

విజయవాడ ఎంపి ‘కేశినేని శివనాధ్‌’(చిన్ని)పై ఆయన స్వంత సోదరుడు, మాజీ ఎంపి ‘కేశినేని నాని’ సంచలన ఆరోపణలు చేశారు. లిక్కర్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన ‘కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి’తో ‘విజయవాడ కేశనినేని శివనాథ్‌’కు దగ్గర సంబంధాలు ఉన్నాయని, వారిద్దరూ కలిసి ఒక కంపెనీని స్థాపించారని దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విచారణ చేయించాలని ఆయన కోరారు. ‘కేశినేని శివనాథ్‌’కు మద్యం స్కాంలో ప్రధాన నిందితుడై అరెస్టు అయిన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎంపి కేశినేని శివనాథ్‌ ఆయన భార్య జానకి లక్ష్మీలు కలిసి ‘ప్రైడ్‌ ఇన్‌ఫ్రాకాన్‌ అనే కంపెనీలో భాగస్వాములుగా ఉన్నారని ఆరోపించారు. ఈ కంపెనీ, కసిరెడ్డి కంపెనీ అయిన ‘ఈశ్వనీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లు ఒకే చిరునామాలో ఉన్నాయని, అంతే కాకుండా  ఈ రెండు సంస్థలు ఒకే ఈమెయిల్‌ ఐడిని వాడుతున్నారని దీంతో ఇవి కలసికట్టుగా పనిచేస్తున్నాయని తేలిపోయిందని, దీనిపై ముఖ్యమంత్రి సమగ్ర విచారణ చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మద్యం కేసుల్లో ఇప్పటికే ఇద్దరు కీలక వ్యక్తులు అరెస్టు అయ్యారని, ఇప్పుడు విజయవాడ ఎంపి ‘కేశినేని చిన్ని’కి  ‘కసిరెడ్డి’కి సంబంధాలు ఉండడంతో ఆయనకు రాజకీయ రక్షణ లభిస్తుందని అనుమానాలను వ్యక్తం చేశారు. ఇదే కాకుండా ఎంపి కేశినేని శివనాధ్‌కు హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మరియు విదేశీ కంపెనీల్లో అక్రమంగా నిధులను పెట్టుబడి పెట్టినట్లు నమ్మదగ్గ ఆధారాలున్నాయని దీనిపై విచారణ చేయించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ