లేటెస్ట్

దొంగ‌లంద‌రూ క‌ల‌సి నాపై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు:ర‌ఘురామ‌

దొంగ‌లంద‌రూ క‌ల‌సి త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని వైకాపా రెబెల్ ఎంపి ర‌ఘురామ‌కృష్ణంరాజు ఆరోపించారు. నేర చ‌రిత్ర క‌లిగిన ఇద్ద‌రు వ్య‌క్తులు త‌న‌పై ప్ర‌ధాని మోడీకి, రాష్ట్రప‌తి కోవిద్ కు లేఖ‌లు రాశార‌ని ఆయ‌న అన్నారు. రూ.42వేల కోట్లు దోచుకున్నార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వ్య‌క్తులు త‌న‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. జూలై 26వ తేదీన సీబీఐ కోర్టులో అన్ని విష‌యాలు తేలిపోతాయ‌ని, రెండు రోజులు ఓపిక‌ప‌డితే చాలని ఆయ‌న అన్నారు. త‌న‌పై త‌మిళ‌నాడులో కేసులు న‌మోదు కావ‌డం వెనుక ముఖ్య‌మంత్రి వై.ఎస్.జ‌గ‌న్, మ‌చిలీప‌ట్నం ఎంపి బాల‌శౌరిలు ఉన్నార‌ని ర‌ఘురామ ఆరోపించారు. త‌న గురించి అన్నీ తెలిసి ఎందుకు టిక్కెట్ ఇచ్చార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. 16 నెల‌లు జైలులో ఉండి, ప‌ది సంవ‌త్స‌రాలుగా బెయిల్ పై ఉన్న వ్య‌క్తులు త‌న గురించి విమ‌ర్శిస్తున్నార‌న్నారు. విశాఖప‌ట్నాన్ని విజ‌య‌సాయిరెడ్డి దోచేస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ