రప్పా...రప్పా నరుకుతారట...!?
వైకాపా అధినేత,మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి చేస్తోన్న యాత్రలు రాష్ట్రంలో శాంతిభ్రదతల సమస్యలను సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో వివిధ అంశాలపై ఆయన చేస్తోన్న యాత్రలు, పరామర్శలు, ఓదార్పుయాత్రల్లో ఆయన అభిమానులు అశాంతిని రేకెత్తిస్తున్నారు. ఏదైనా సమస్యపై ప్రతిపక్షంగా వైకాపా స్పందించడంలో తప్పులేదు కానీ..దాన్ని అడ్డుపెట్టుకుని అసాంఘికశక్తులను రెచ్చగొట్టడం, తమ వ్యతిరేకులపై దాడులకు ప్రోత్సహించడం సరైన విధానం కాదు. పరామర్శ చేయడంలో తప్పులేదు కానీ..జగన్ చేస్తోంది పరామర్శ కాదు..బలప్రదర్శన. ఇలా బలప్రదర్శన చేస్తూంటే..ఆయన ప్రత్యర్థులు ఊరకుంటారా..? వారూ తమ సత్తాచూపిస్తారు కదా..అప్పుడు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం అవుతుంది కదా..జగన్‌కు కావాల్సింది కూడా అదేననట్లు ఆయన వ్యవహరిస్తున్నారు. ఆయన బయటకు వస్తే..ఏదో ఒక సమస్య సృష్టిస్తున్నారు. మొన్నటికి మొన్న రాప్తాడులో హెలికాప్టర్ ఉదంతం, నిన్న పొదలిలో, అంతకు ముందు తెనాలిలో..ఇప్పుడు సత్తెనపల్లిలో..ఎక్కడికి వెళ్లినా..బలప్రదర్శన చేయడం..తన బాడుగ కార్యకర్తలతో, ఉన్మాదులతో..రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయించడం, రెచ్చగొట్టే ప్లెక్సీలు పెట్టించి..గొడవలు సృష్టించడమే ఆయన తన విధానంగా మార్చుకున్నారు. ఈరోజు సత్తెనపల్లిలో జగన్ కార్యకర్తలు ప్రదర్శించిన ప్లెక్సీలు..ఇలానే ఉన్నాయి. కొందరు కార్యకర్తలు 2029లో జగన్ అధికారంలోకి రావడంతోనే..గంగమ్మ జాతరలో గొర్రెలు నరికినట్లు రప్ప..రప్పా నరికేస్తారట..మరో పోస్టర్‌లో రాజారెడ్డి రాజ్యాంగాన్ని తెస్తారట..అన్నవస్తాడు..అంతు చూస్తాడట... ఎవడైనా..తొక్కిపడేస్తారట. ఇలా..పలు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రజల్లో జగన్ శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నారు. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. మొదట్లోలోనే ఇలాంటి విపరీత ధోరణితో వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోతే..ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుంది.