లేటెస్ట్

‘క‌మ్మ‌’ల‌పై ఇంత ప్రేమేమిటి బాబూ...!?

వైకాపా అధినేత‌ వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి హ‌ఠాత్తుగా క‌మ్మ సామాజిక‌వ‌ర్గంపై ఎక్క‌డ‌లేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఎందుకు హ‌ఠాత్తుగా ఆయ‌న‌కు వీరిపై ప్రేమ పుట్టుకువ‌చ్చిందే తెలియ‌దు కానీ..ఆయ‌న చేస్తోన్న కుల ప్ర‌చారాల‌ను చూసిన వారు..ఔరా..జ‌గ‌న్... అంటూ ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌వు తున్నారు. ఒక‌ప్పుడు వాళ్ల పొడ‌నే గిట్ట‌ని జ‌గ‌న్‌కు..ఇప్పుడు వారిపై ఇంత అవాజ్య‌ప్రేమ ఎక్క‌డి నుంచి పుట్టుకొచ్చిందోనంటూ..ఇది నిజ‌మేనా.. అంటూ..గిల్లి గిల్లి చూసుకుంటున్నారు. ఈ రోజు స‌త్తెన‌ప‌ల్లిలో..ఎప్పుడో ఏడాది క్రితం ఎన్నిక‌ల బెట్టింగ్‌లో కోట్లు పోగొట్టుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న క‌మ్మ వైకాపా కార్య‌క‌ర్త విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు జ‌గ‌న్ వ‌చ్చి..చేసిన ప్ర‌సంగం చూసి చివ‌ర‌కు టిడిపి వాళ్లు కూడా ఔరా..జ‌గ‌న్ అంటూ ఆశ్చ‌ర్య చ‌కితుల‌య్యారు. ఇంత న‌ట‌నాచాతుర్యం..మ‌న విశ్వ‌విఖ్యాత న‌ట‌సౌర్వ‌భౌముడు ఎన్టీఆర్‌కు కూడా చేత కాదు క‌దా...అంటూ.. నిట్టూర్పులు విడుస్తున్నారు. ఏడాది క్రితం క‌మ్మ వైకాపా కార్య‌క‌ర్త టిడిపి వాళ్ల వేధింపులు త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ట‌...?  దాని కోసం వాళ్ల క‌మ్మ కుటుంబాన్ని ఓదార్చ‌డానికి  ఈయ‌న గారు వ‌చ్చార‌ట‌... వ‌చ్చిన వాడు..వ‌చ్చిన‌ట్లు ఓదార్చిపోతే..మ‌జా ఏముంటిది..ఈ మ‌ధ్య‌... జ‌బ‌ర్ధ‌స్ట్ కూడా బాగా ఉండ‌క‌పోవ‌డంతో..స‌రైన ఎంటైర్‌టైన్‌మెంట్ లేక ఆంధ్రా, తెలంగాణ జ‌నాలు ఊసుర‌మంటుంటే..జ‌గ‌న్ వాళ్లకు ఆలోటు తీర్చ‌డానికి ప్ర‌తివారం ఏదో ఒక షో చేస్తునే ఉన్నాడు. అలాంటి షో ఈరోజు స‌త్తెన‌ప‌ల్లిలో జ‌రిగింది.  ఈ షోను జ‌గ‌న్ భ‌లే ర‌క్తి క‌ట్టించారు. క‌మ్మ వైకాపా నాయ‌కులను, క‌మ్మ వైకాపా కార్య‌క‌ర్త‌ల‌ను చంద్ర‌బాబు వేధిస్తున్నాడ‌ట‌...?  నాకు తెలిసి అధికారంలో ఉన్న‌పార్టీకానీ, ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీలు కానీ..ఇలా కుల ముద్ర‌వేసి కార్య‌క‌ర్త‌ల‌ను,నాయ‌కుల‌ను ప‌రిచియం చేయ‌డం ఇదే మొద‌టిసారి కావ‌చ్చేమో..? ఇంత ఇంగితం లేని ప‌నులు గ‌తంలో ఏ నాయ‌కుడూ చేయ‌లేదేమో..? ఇలా చేయాలంటే..జ‌గ‌న్‌కే చెల్లు. క‌మ్మ వైకాపా నాయ‌కులంటా..? ఏమైనా మ‌తి ఉందా..? జ‌గ‌న్‌కు మ‌తిలేక‌పోయినా..ఫ‌ర్వాలేదు..ఆ పార్టీలో ఉన్న క‌మ్మ‌ల‌కు కొద్దిగానైనా బుద్ది ఉందా..?  జ‌గ‌న్ విధానాల‌ను న‌చ్చి ఆ పార్టీలో ఉన్నారా..?  లేక‌.. క‌మ్మ కోటా కింద ఆ పార్టీలో ఉన్నారా? ఎందుకు ఇంత‌గా దిగ‌జారిపోతున్నారు..? 


వాస్త‌వానికి క‌మ్మ‌లు తెలివైన వారు అనుకుంటుంది ఇత‌ర సమాజం. కానీ..వైకాపాలో ఉన్న క‌మ్మ నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను చూస్తుంటే..జ‌గ‌న్ ఇంత‌గా దిగ‌జారిపోయి..కులాల ప్ర‌స్తావ‌న తెస్తుంటే..ఇదేమి రాజ‌కీయం అంటూ..ప్ర‌శ్నించాలి క‌దా..?  కానీ..పైన చెప్పుకున్న‌ట్లు క‌మ్మ‌లేమీ తెలివైన వాళ్లు కాదు..వీళ్ల‌లోనూ సైకోలు, దోపిడీదారులు, అవినీతిప‌రులు, అక్ర‌మార్కులు ఉన్నారు. ఇలా ఉన్న‌వారంతా..జ‌గ‌న్ పంచ‌న చేరి ఆయ‌న మోచేతి నీళ్ల తాగ‌డానికి ఏమైనా చేస్తారు..?  అందుకే ఆ పార్టీలో ఉంటూ...ఆయ‌న భ‌జ‌న చేస్తారు..! వాస్త‌వానికి గుంటూరు, కృష్టా, ప్ర‌కాశం, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఉన్న క‌మ్మ ఓట‌ర్ల‌లో 2019 ఎన్నిక‌ల్లో స‌గం మందికి పైగా వైకాపాకే ఓటేశారు. అప్ప‌ట్లో జ‌గ‌న్ సంగ‌తి తెలియ‌నివాళ్లు.. ఆయ‌న‌కూ ఒక అవ‌కాశం ఇద్దామ‌నుకుని కులాల ప్ర‌స్తావ‌న లేకుండా..జ‌గ‌న్‌కు ఓటేశారు. కానీ..అధికారంలోకి వ‌చ్చాక‌.. క‌మ్మ‌కులాన్ని ఎలా వేధించారో..అన్న సంగ‌తిని అప్పుడే వీరు మ‌రిచిపోయారా..  స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌లేద‌ని నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌ను కులం పేరుతో దూషించిన సంగ‌తి, అమ‌రావ‌తి క‌మ‌రావ‌తి అంటూ ఎక‌సెక్కాలు ఆడిన సంగ‌తి, ఎబీ వెంక‌టేశ్వ‌ర‌రావును వేధింపుల‌కు గురిచేసిన‌ప్పుడు, స్వ‌ర్గీయ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావును వేధించి ఆత్మ‌హ‌త్య‌కు పురికొల్పిన‌ప్పుడు..క‌మ్మ మీడియా అంటూ..సోష‌ల్ మీడియాలో వికృత పోస్టింగ్‌లు పెట్టించిన సంగ‌తిని, క‌మ్మ‌వారైతే.. కార్యాల‌యాల‌కు రానీయ‌కుండా అడ్డుకున్న సంగ‌తిని, చివ‌ర‌కు మంత్రి ప‌ద‌వి కూడా ఇవ్వ‌కుండా అవ‌మానించిన సంగ‌తిని క‌మ్మ‌లంతా మ‌రిచిపోయార‌ని వీళ్లు భావిస్తున్నారేమో..?  నిన్న‌టి దాకా..ఆ కులం పొడ‌నే గిట్ట‌ని జ‌గ‌న్‌కు ఒక్క‌సారిగా వీరిపై ప్రేమ ఎందుకు వ‌చ్చిందంటే..మ‌ళ్లీ ఎన్నిక‌లకు వాళ్ల‌తోనే పెట్టుబ‌డులు పెట్టించి..వాళ్ల‌ను వెధ‌వ‌ల‌ను చేయ‌డానికే. జ‌గ‌న్ ఏది చేసినా..దానిలో ఏదో ఒక ప‌థ‌కం త‌ప్ప‌కుండా ఉంటుంది. ఇప్పుడీ క‌మ్మ‌జ‌పం వెనుక ఏదో మాస్ట‌ర్ ప్లాన్ ఉంద‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ