పి4 వైస్ ఛైర్మన్‌గా కుటుంబరావు నియామకం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్‌నర్‌షిప్) ఫౌండేషన్‌కు వైస్ ఛైర్మన్‌గా సి.కుటుంబరావును నియమిస్తూ ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి పియూష్ కుమార్ ఈ రోజు ఉత్తర్వులను జారీ చేశారు. ఆయనను పి4కు వైస్-ఛైర్మన్‌గా నియమిస్తారని Janamonline.com మే 19 2025నే ఓ కథనాన్ని ప్రచురించింది. www.Janamonline.com చెప్పిన విధంగానే ఈరోజు ఉత్తర్వులు వెలువడ్డాయి.(https://janamonline.com/article?nid=599) గతంలో స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ (SAPF) ను పునర్నిర్మించి, దానిని ఇప్పుడు స్వర్ణ ఆంధ్ర పి4 ఫౌండేషన్(SAPF)గా పేరు మార్చారు., SwarnaAndhra@2047 దృష్టికోణానికి అనుగుణంగా కొత్త జనరల్ బాడీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, జిల్లా మరియు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి విభాగాలు, విధులు, బాధ్యతలు, లోగోలు, బైలాస్ మార్పులు, కొత్త పాలనా నిర్మాణానికి ఆమోదం మరియు 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపులు అమలులోకి తెచ్చినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం పేర్కొన్న విధంగా పి4 ఫౌండేషన్‌కు కుటుంబరావును వైస్ ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా కుటుంబరావు ఫౌండేషన్ పాలన యరియు పర్వవేక్షణతో పాటు SAPF ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. జనరల్ బాడీ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయాల అమలును పర్యవేక్షించడంతో పాటు SAPF కార్యకలాపాలు SwarnaAndhra@2047 లక్ష్యాలకు అనుగుణంగా సాగేటట్లు చూడడం ఆయన ప్రధాన పని. దీనితో పాటు వ్యూహాత్మక నాయకత్వం, ప్రభుత్వంతో పి4ను అనుసంధానం చేసుకోవడం, సిఎస్ఆర్, అంతర్జాతీయ డోనర్ గ్రాంట్లు పొందేందుకు కృషి చేయడం, ప్లానింగ్ డిపార్ట్‌మెంట్, ఇతర శాఖలు, జిల్లాల మధ్య సమన్వయం చేసుకుంటారు. కాగా పి4 వైస్ ఛైర్మన్‌గా కుటుంబరావుకు ఇచ్చే వేతనాలు, ఇతర సౌకర్యాలను తరువాత ప్రభుత్వం వేరే ఉత్తర్వులను జారీ చేస్తుంది.