ఆ సామాజికవర్గమే..ఇప్పుడు ‘జగన్’కు అండా..దండా...!?
మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి రాజకీయవ్యూహాలు ఇటీవల కాలంలో బెడిసికొడుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఆయన ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత చేస్తోన్న యాత్రలతో ఆయనకు పెద్దగా మైలేజ్ రాకపోగా..గతంలో ఆయనను సమర్ధించిన వాళ్లూ ఇప్పుడు ఆయన చేస్తోన్న తప్పులను చూసి నిర్వేదాన్ని వ్యక్తం చేస్తున్నారు. తనను ప్రజలు ఓడించలేదని, ఇవిఎంలే ఓడించాయని తన మద్దతుదారులను నమ్మించే వ్యూహంలో భాగంగా తన పర్యటనలకు భారీగా జనాన్ని పోగేసుకుంటూ..వస్తోన్న ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో వినుకొండ పట్టణంలో ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగత కక్షలతో హతమార్చుకుంటే..వైకాపా కార్యకర్తను టిడిపి నేతలు చంపించారంటూ..ఆయన వినుకొండలో చేసిన పర్యటన వివాదాస్పదమైంది. చీరాలలో పోలీసులు రౌడీలకు కౌన్సిలింగ్ ఇస్తే..అది తప్పంటూ ఆయన చేసిన యాత్రపై కూడా ప్రజల్లో నిరసన వ్యక్తం అయింది. ఇక సత్తెనపల్లిలో జరిగిన సంఘటనలు చెప్పేనవసరమే లేదు. ఎప్పుడో ఏడాది క్రితం ఎన్నికల బెట్టింగ్‌లో వైకాపా కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే..అతని కుటుంబాన్ని పరామర్శిస్తానని భారీగా జనాన్ని పోగేసి..ఇద్దర వైకాపా కార్యకర్తల మరణానికి ‘జగన్’ కారణమయ్యాడని పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ అంశంలో ‘జగన్’ భారీగా ప్రజల నుంచి నిరసనను ఎదుర్కొంటున్నారు. తన పార్టీ కార్యకర్త తన కారు కింద పడితే..అతనిని హాస్పటల్‌కు తీసుకెళ్లకుండా..కారుచక్రాల నుంచి లాగేసి..రోడ్డు పక్కన పడేసిన వైనంపై రాష్ట్ర ప్రజలు బిత్తరపోయారు. ఇంత కాఠిన్యమా..? ఇతను ఒక నాయకుడా..? ఇతనికి రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా..? అంటూ మెజార్టీ ప్రజలు చర్చించుకుంటున్నారు. రోడ్డు ప్రమాదం ఎవరికైనా జరగవచ్చు. కానీ..స్పందించే విధానం ఇదా..? అంటూ..ప్రతి ఒక్కరూ ప్రతిస్పందిస్తున్నారు. అసలు ఇంత జనాన్ని పోగేసుకుని..ఇంత అర్జంట్‌గా అతను నిరూపించుకునేది ఏమైనా ఉందా..? అనే ప్రశ్నలు కూడా పలువురి నుంచి వస్తున్నాయి. తనకు బలం తగ్గలేదని పోగేసిన జనంతో కాదుగా నిరూపించాల్సింది..? ఎన్నికల సమయంలో..ఓటింగ్ ద్వారానే కథా..? మరి ఇంత చిన్న లాజిక్ మరిచిపోయి..పదే పదే బలప్రదర్శనలతో..ప్రజలకు నష్టం చేయడం ఏమిటి..? అసలు ఇతని సభలకు వస్తున్న జనం ఎక్కడి వారనే సందేహాలు పలువురు రాజకీయ విశ్లేషకుల్లో నెలకొంటుంది. ‘జగన్’ సామాజికవర్గ నేతలు పెద్దగా ఇప్పుడు రోడ్డు ఎక్కడం లేదు. వాళ్లుకు అర్థం అయింది..‘జగన్’ నైజం ఏమిటో..? దాంతో వాళ్లు పెద్దగా అతన్ని కలవడానికి ఉత్సాహం చూపించడం లేదు. అయితే..ఎస్సీ సామాజికవర్గంలో ఓ వర్గం మాత్రం ‘జగన్’ను మళ్లీ అధికారంలోకి తేవడానికి విపరీతంగా ఆసక్తి చూపిస్తోంది.
అతను తమ సామాజికవర్గమనే భావన వారిలో నెలకొంది. అంతేనా..తమ మతస్తుడు కనుక అతనిని అధికారంలోకి తీసుకురావలనే లక్ష్యం వారిలో బలంగా కనిపిస్తోంది. ‘జగన్’ స్వంత సామాజికవర్గానికి కూడా ఇంత ఇది లేదు. కేవలం ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓ వర్గం ప్రజలే ‘జగన్’నుమళ్లీ అధికారంలోకి తేవాలనే లక్ష్యంతో ఉన్నారు. అందుకే ఆ వర్గానికి చెందిన వారే ‘జగన్’ పర్యటనల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. తమ మతానికి చెందిన వాడే ముఖ్యమంత్రిగా ఉండాలనే భావన, ‘జగన్’ కుటుంబంతో తమ కుటుంబానికి చెందిన వారు వియ్యం అందుకున్నారనే భావనతోనే వాళ్లు ‘జగన్’కు మద్దతు పలుకుతున్నారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. వీళ్లే ఇప్పుడు రపా..రపా నరుకుతాం...అడ్డం వస్తే తొక్కుకుంటూపోతాం..అన్నవస్తాడు..అంతు చూస్తాడు..రాజారెడ్డి రాజ్యాంగం తెస్తాం..అంటూ వీరంగాలు వేస్తోంది. కేవలం కులం, మతం ప్రాతిపదికనే వీళ్లు ఇలా రెచ్చిపోతున్నారు. వాస్తవానికి వాళ్లకూ తెలుసు ‘జగన్’ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదని, కానీ..తమ వాడనే భావనతో..ఏదో విధంగా మరోసారి ఆయననుముఖ్యమంత్రిని చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన పాస్టర్ విషయంలో వీళ్లు మతాన్ని కులాన్ని రెచ్చగొట్టడానికి చేయాల్సిందంతా చేశారు. కానీ..వాళ్ల ప్లాన్ విఫలమైంది.మొత్తం మీద ‘జగన్’ తన కుటుంబ సభ్యులు, తన సామాజికవర్గానికి చెందిన వారు మద్దతు కోల్పోయినా..తన మతస్తుల మద్దతును మాత్రం భారీగానే కూడగట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆయనకు వారే అండా దండా అందిస్తున్నారు. అయితే విచిత్రంగా ఈ వర్గం అండా దండా పొందుతున్న ‘జగన్’ ఆ వర్గానికిచెందిన వారికి పార్టీలో పెద్దగా ప్రోత్సాహం ఇవ్వడం లేదనే చర్చ జరుగుతోంది. ఆ వర్గానికి చెందిన నేతలను ఆయన వాడుకుంటున్నారని, వారికి పార్టీలో క్రియాశీలక పదవులు ఇవ్వడం లేదనే చర్చ ఆ పార్టీలోనే ఉంది. తమతో అన్ని పనులు చేయించుకుంటున్నారని, పార్టీపై పెత్తనం మాత్రం మళ్లీ సజ్జల రామకృష్ణారెడ్డికే అప్పగించారనే గుసగుసలు ఆయన స్వంత పార్టీలోనే ఉన్నాయి.