లేటెస్ట్

కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు: ఆరా మస్తాన్‌

బిజెపితో టిడిపి, జనసేన పొత్తు పెట్టుకుంటే నష్టపోతామని, గెలిచే అవకాశాలను కోల్పోతామని కొందరు టిడిపి,జనసేనకు చెందిన కొంతమంది నేతలు, కార్యకర్తలు వ్యక్తం చేస్తోన్న సందేహాలకు ఎన్నికల సర్వేల్లో పేరుగాంచిన ఆరా మస్తాన్‌ కొట్టిపారేశారు. బిజెపితో టిడిపి, జనసేన పొత్తు పెట్టుకుంటే ముస్లింలు,క్రిస్టియన్లు కూటమికి ఓటు వేయరని, దాని వల్ల కూటమి ఓడిపోతుందని భయాలు వ్యర్థమని ఆరా మస్తాన్‌ వాదిస్తున్నారు. ఆయన వాదన ప్రకారం ముస్లింలు, క్రిస్టియన్లు ఇప్పటికీ వైకాపాకే మద్దతు ఇస్తున్నారని, ఒకవేళ టిడిపి,జనసేన బిజెపితో పొత్తు పెట్టుకోకపోయినా వారు టిడిపి, జనసేన వైపుకు రారని, జగన్‌ను అభిమానించే వారంతా..ఆయన వెంటే ఉన్నారని, ఇప్పుడు వీరి కోసం బిజెపిని వద్దునుకోవడం తెలివైన పనికాదని ఆయన విశ్లేషించారు. ఇప్పటికే..టిడిపి,జనసేన పొత్తుపెట్టుకున్నాయి. ఇప్పుడు ఈ కూటమిలోకి బిజెపి వస్తోంది. దీని వల్ల కొత్తగా వచ్చే నష్టమేమీ లేదని, కొన్ని వర్గాలు వైకాపా వెంటనే నడుస్తాయని, వారి కోసం నైతిక బలాన్ని, స్థైర్యాన్ని ఇచ్చే బిజెపిని వదులుకోవడం సరైన పనికాదని ఆయన అంటున్నారు. బిజెపి కూటమితో కలిస్తే టిడిపి,జనసేన నాయకులు, కార్యకర్తలు మనోస్థైర్యంతో పనిచేస్తాయని, అధికార వైకాపా అరాచకాన్ని అడ్డుకోవడానికి బిజెపి పనికి వస్తుందని ఆయన చెబుతున్నారు.


వాస్తవానికి బిజెపితో పొత్తు టిడిపిలో చాలా మందికి ఇష్టం లేదు. అయితే..అధికార వైకాపా అరాచకాలను, దౌర్జన్యాలను తట్టుకోవడం అంత సులువైన పనికాదనే భావనతో టిడిపి అధినేత చంద్రబాబు ఉన్నారు. ఆయన జీరో పర్సెంట్‌ రిస్క్‌ చేయడానికి కూడా ఇష్టపడడం లేదు. జగన్‌ను ఓడిరచడమే ముందు చేయాల్సిన పనని, దాని కోసం ఎటువంటి బాధలు, అవమానాలనైనా తట్టుకోవడానికి ఆయన సిద్ధపడుతున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో బిజెపితో హోరాహోరిగా పోరాడితే..ముస్లిం,మైనార్టీ, క్రిస్టియన్‌ వర్గాలు టిడిపిని ఆదరించాయా..? లేదు కదా..ఇప్పుడు బిజెపితో పొత్తుపెట్టుకోకపోతే..వారేదో ఉద్దరిస్తారనే ఆశలు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. బిజెపితో పొత్తు వల్ల కొత్తగా వచ్చే నష్టమేమీ లేదని, కలిసిరాని వర్గాల కోసం, బలవంతుడితో మరోమారు తలపడితే..తల మరోసారి పగులుతుందని, ఇప్పటికైతే..బిజెపితో పొత్తులో వెళ్లడమే ఉత్తమ మార్గమని ‘ఆరా మస్తాన్‌’తో పాటు మరి కొందరు కూడా విశ్లేషిస్తున్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ