లేటెస్ట్

‘జ‌గ‌న్’ బెయిల్ ర‌ద్దుపై ఆగ‌స్టు 25న తుదితీర్పు....!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బెయిల్ ర‌ద్దు చేయ‌మంటూ వైకాపా రెబెల్ ఎంపి ‘ర‌ఘురామ‌కృష్ణంరాజు’ వేసిన కేసు వ‌చ్చే నెల 25వ తేదీకి వాయిదా ప‌డింది. ఈ కేసులో ఈ రోజు సీబీఐ వాద‌న‌లు విన్న సీబీఐ కోర్టును వాయిదా వేసింది. గ‌తంలో తాము ఈ కేసులో వాద‌న‌లు వినిపించేది లేద‌ని, కేసులోని మెరిట్ ఆధారంగా తీర్పు ఇవ్వాల‌ని చెప్పింది. అయితే గ‌తంలో తాము చెప్పిన దానికి విరుద్ధంగా మ‌ళ్లీ తాము వాద‌న‌లు వినిపిస్తామ‌ని చెప్పారు. అప్ప‌టి నుంచి సీబీఐ వాద‌న వినిపిస్తార‌ని ఆశించ‌గా, ఈ రోజు తాము గ‌తంలో చెప్పిన దానికే క‌ట్టుబ‌డ్డామ‌ని సీబీఐ వాద‌న‌లు వినిపించింది. కేసులోని మెరిట్స్ ఆధారంగా కోర్టు నిర్ణ‌యం తీసుకోవాల‌ని తెలిపింది. దీంతో కేసును ఆగ‌స్టు 25తేదీకి వాయిదా వేస్తున్న‌ట్లు కోర్టు తెలిపింది. కాగా ఈ కేసులో ఇదే ఆఖ‌రి వాయిదా అవుతుంద‌ని, ఆగ‌స్టు 25న తుది తీర్పు వ‌స్తుంద‌ని న్యాయ‌వ‌ర్గాలు అంటున్నాయి.


కాగా సీబీఐ ఈ కేసు వ్య‌వ‌హారంలో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మొద‌ట్లో జోక్యం చేసుకోబోమ‌న్న సీబీఐ మ‌ళ్లీ కౌంట‌ర్ వేస్తామ‌ని ఇన్ని రోజులు నాన‌బెట్టి, స‌మ‌యాన్ని వృధా చేసి ఇప్పుడు తాము మ‌ళ్లీ మొద‌ట్లో చెప్పిన దానికే క‌ట్టుబడి ఉన్నామ‌ని చెప్ప‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నిందుతులను ప‌ట్టుకునేందుకు సీబీఐ ఉందా..?  లేక వారిని కాపాడేందుకు ఉందా..? అన్న ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. గ‌త వాయిదా సందర్భంగా సీబీఐ అధికారుల‌కు జ్వ‌రం రావ‌డంతో కోర్టుకు హాజ‌రుకాలేమ‌ని చెప్పార‌ని, అప్పుడే ఇప్పుడు చెప్పింది చెబితే స‌మ‌యం వృధా కాదుక‌దా..?  సీబీఐ ఎందుకు ఇలా చేస్తోందో అన్న దానిపై ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. రాజ‌కీయ జోక్యంతోనే సీబీఐ ఈ విధంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌నే మాట వివిధ వ‌ర్గాల నుంచి వ్య‌క్తం అవుతోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ