లేటెస్ట్

ఆర్ధిక‌శాఖ‌కు చెందిన ముగ్గురు స‌చివాల‌య ఉద్యోగుల స‌స్పెండ్

ఆర్ధిక‌శాఖ‌కు చెందిన ర‌హ‌స్యాల‌ను బ‌య‌ట‌కు పంపుతున్నార‌ని, వివిధ దిన‌ప‌త్రిక‌లకు ప్ర‌భుత్వ ఆర్ధిక స‌మాచారం ఇస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌తో ఆర్దిక‌శాఖ‌కు చెందిన ముగ్గురు ఉద్యోగుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేసింది. నాగుల‌పాటి వెంక‌టేశ్వ‌ర్లు, అసిస్టెంట్ సెక్ర‌ట‌రీ, క‌సిరెడ్డి వ‌ర‌ప్ర‌సాద్, సెక్ష‌న్ ఆఫీస‌ర్, డి.శ్రీ‌నుబాబు, సెక్ష‌న్ ఆఫీస‌ర్ ల‌ను స‌స్పెండ్ చేస్తూ ఆర్ధిక‌శాఖ కార్య‌ద‌ర్శి రావ‌త్ ఈ రోజు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇటీవ‌ల కాలంలో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కొన్ని దిన‌ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌స్తున్నాయ‌ని, దీని కార‌ణం తెలుసుకోవ‌డానికి విజిలెన్స్ ద‌ర్యాప్తు చేయించామ‌ని దానిలో పైన పేర్కొన్న ముగ్గురిపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయ‌ని దాంతో వారిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. సున్నిత‌మైన విష‌యాల‌ను బ‌య‌టకు విడుద‌ల చేసి, ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌ల‌ను సృష్టించినందున వారిపై చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. స‌స్పెండ్ కు గురైన పైన ముగ్గురు అధికారులు అమ‌రావ‌తిని వీడి వెళ్ల‌కూడ‌ద‌ని ఆ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ