లేటెస్ట్

దేవినేనికి బెయిల్ మంజూరు

మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుకు బెయిల్ మంజూరు అయింది. 6 రోజుల క్రితం ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులో అరెస్టు అయిన ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్త‌ర్వులు ఇచ్చింది. త‌న‌పై అక్ర‌మంగా కేసులు పెట్టార‌ని, త‌న‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని ఆయన హైకోర్టును ఆశ్ర‌యించారు. కృష్ణా జిల్లాలోని జి.కొండూరు పోలీస్ స్టేష‌న్ లో ఆయ‌న‌పై కేసు న‌మోదు అయింది. అక్ర‌మ‌మైనింగ్ చేస్తున్నార‌ని దాన్ని ప‌రిశీలించేందుకు వెళ్లిన దేవినేని ఉమ‌పై వైకాపా కార్య‌క‌ర్త‌లు దాడులుచేశారు. టిడిపి, వైకాపా కార్య‌క‌ర్త‌లు ఘ‌ర్ష‌ణ జ‌ర‌గ‌డంతో పోలీసులు అక్క‌డ‌కు వెళ్లి వారిని చెద‌ర‌గొట్టారు. ఈ సంద‌ర్భంలో దేవినేని ఉమ ఎస్సీ వ‌ర్గానికి చెందిన‌వారిపై దాడి చేశార‌ని పోలీసులు కేసు న‌మోదు చేశారు. దీంతో ఆయ‌న‌ను అరెస్టు చేసి రాజ‌మండ్రి జైలుకు త‌ర‌లించారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ