లేటెస్ట్

అప్పుడు...ఐదేళ్లు మంత్రులు...ఇప్పుడు టిక్కెట్టు కోసం ఇక్కట్లు....!

అధికారం ఉన్నప్పుడు తమంతవాడు లేడని, తమకు అడ్డేముందని ఇష్టారాజ్యంగా వ్యవహరించి, అహంకారాన్ని చాటుకున్న వారు..అధికారం పోయిన తరువాత...ఎంత బేలగా వ్యవహరిస్తారో...ప్రస్తుత పరిస్థితులు చాటి చెబుతున్నాయి. తెలంగాణ కానివ్వండి....‘ఆంధ్రా’ కానివ్వండి..అధికారాంతమున..కొందరి ఇక్కట్లు అన్నీ ఇన్నీకావు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుటుంబం వ్యహారం చూస్తే..వందరోజుల్లోనే పరిస్థితి అంతా తలకిందులైంది. వాళ్లును చూసైనా..అధికారంలో ఉన్నవారు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు..వ్యవహారశైలిని మార్చుకుంటే..పరిస్థితులు తలకిందులైనా..ప్రజల మద్దతు దొరుకుతుంది. తెలంగాణ సంగతిని పక్కన పెడితే..‘ఆంధ్రా’లోని ‘టిడిపి’పార్టీలో ఉన్న కొందరు సీనియర్‌ నాయకుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. ఒకప్పుడు ఎదురేలేదన్నకున్న వారికి ఎన్నికల సమయంలో టిక్కెట్లు దక్కక ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. నాడు చేసిన అహంకారపూరిత చర్యలే నేటి వారి పరిస్థితికి కారణం. గతంలో ఐదేళ్లు మంత్రి పదవులు వెలగబెట్టినవారు కూడా నేడు పోటీ చేయడానికి టిక్కెట్లు దక్కక ఎక్కే గడపా..దిగే గడపా..అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ‘చంద్రబాబు’ మంత్రివర్గంలో ఐదేళ్లు మంత్రి పదవులు అనుభవించిన వారిలో ‘దేవినేని ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు’ వంటి వారికి పోటీ చేసే అవకాశం వస్తుందా..రాదా..? అనే పరిస్థితి నెలకొంది. ‘చంద్రబాబు’ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీరిద్దరికీ ఎంతో విలువ ఇచ్చారు. అయితే..‘దేవినేని’ అహంకారపూరిత చర్యలు, మోసకారి మాటలవల్ల నియోజకవర్గంలో పట్టుకోల్పోయారు. అదే విధంగా ‘గంటా శ్రీనివాసరావు’ గత ఎన్నికల్లో గెలిచినా..పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు..పట్టించుకోకపోవడం, అధినేతకు చెప్పకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేసి పార్టీని ఇబ్బందులుపెట్టడం వంటి చర్యల కారణంగా ఇంకా ఆయన సీటును అధినేత ఖరారు చేయలేదు. వీరిద్దరే కాదు..గతంలో ఐదేళ్లు మంత్రులుగా ఉన్నవారిలో మరో ఇద్దరి పరిస్థితి కూడా ఇంతే. ‘పత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత’లు కూడా పార్టీ నాయకులు, కార్యకర్తల నమ్మకాన్ని కోల్పోయారు. అయితే..స్థానిక పరిస్థితుల వల్ల వీరిలో ఒకరికి టిక్కెట్‌ దక్కగా, పరిటాల సునీతకు ఆమె భర్త ‘పరిటాల రవి’ వల్ల సీటు లభించింది. వీరు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే..ఐదేళ్లు మంత్రులుగా చేసిన వారిలో కార్యకర్తలకు పెద్దపీట వేసిన ‘నిమ్మకాయల చినరాజప్ప’, చింతకాయల అయన్నపాత్రుడు, కొల్లు రవీంద్రలకు మొదటి జాబితాలోనే అధినేత టిక్కెట్లు ఖరారుచేశారు. అదే విధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ‘అచ్చెంనాయుడికి కూడా ముందుగానే టిక్కెట్‌ ఇచ్చారు. మొత్తం మీద 2014లో ఐదేళ్లు మంత్రులుగా ఉన్నవారిలో..‘దేవినేని, గంటా’లకు మాత్రమే పెండింగ్‌లో పెట్టారు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ