52 సీట్లలో 32 సీట్లు ‘రెడ్ల’కే...!?
ఇదేనా జగన్ మార్కు సామాజిక న్యాయం
సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నామని, తమతోనేసామాజిక న్యాయం జరుగుతోందన్న వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి మాటలు ఎంత మోసమో..ఈ రోజు ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థులతోనే తేలిపోయింది. రాష్ట్రం మొత్తం మీద సామాజిక న్యాయం ఎలా ఉన్నా..‘రాయలసీమ’లో మాత్రం సామాజికన్యాయం ఎంత మోసమో..ఈ లిస్టు చెబుతోంది. రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ సీట్లు ఉంటే..దానిలో 32 సీట్లు తన స్వంత కులానికి ముఖ్యమంత్రి కేటాయించుకున్నారు. సగానికి పైగా తన వర్గానికి సీట్లు ఇచ్చుకుని సామాజిక న్యాయానికి కొత్తర్థాన్ని ఆయన చెప్పారు. మాట్లాడితే పేదలకు, పెత్తందార్లకు యుద్ధమని చెప్పే ముఖ్యమంత్రి ఎమ్మెల్యే సీట్ల విషయంలో మాత్రం పెత్తదారుల పక్షమేవహించాడు. తాను చెప్పింది చేయడనే మాటను మరోసారి రుజువు చేశారు. రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాలో దాదాపు సగానికి పైగా తన వర్గానికే ఇచ్చుకున్నారు. రిజర్వేషన్ సీట్లను తీసివేస్తే..ఇది దాదాపు 75శాతం అవుతుంది. అంటే తన వర్గానికి ఆయన 75శాతం సీట్లను కేటాంచుకున్నారు. ఉమ్మడి ‘అనంతపురం’ జిల్లాలో మొత్తం 14 సీట్లు ఉంటే దానిలో 8 సీట్లు తన సామాజికవర్గానికి ఇచ్చుకున్నారు. 14లో రెండు ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలను తీసి వేస్తే..మిగిలేవి 12. దీనిలో 8 తన కులానికి కేటాయించుకున్నారు. అంటే..ఇది దాదాపు 80శాతం. ‘కడప’ జిల్లాలో మరీ అన్యాయం. ఇక్కడ మొత్తం 10సీట్లు ఉంటే 7 సీట్లు తన స్వంత సామాజికవర్గానికి ఇచ్చుకున్నారు. ఇక్కడ రిజర్వ్ నియోజకవర్గాలు రెండు ఉన్నాయి. ఇవి పోతే మిగిలిన ఒక్కటి మాత్రమే బీసీలకు ఇచ్చారు. ఇదేనా..నా బీసీ..నా ఎస్సీలు.. కర్నూలులోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ 14 సీట్లు ఉంటే..ఇక్కడ కూడా అదే దారి. 14లో 9 తన కులస్ధులకు ఇచ్చారు. చిత్తూరులోనూ అదే పరిస్థితి. 14 సీట్లు ఉంటే దీనిలో 8 సీట్లు ‘రెడ్ల’కే. ఇదేనా ‘జగన్’ చెప్పే సామాజికన్యాయం. పేదలకు పెత్తందార్లుకు యుద్ధమని చెబుతూనే..బడుగు,బలహీనవర్గాలకు అధికారాన్ని ఇవ్వకుండా, వారిని తన తప్పుడు మాటలతో..తనకు ఓటుబ్యాంకర్లగానే మార్చుకుంటున్న నయా పెత్తందారుపోకడ ఇది.