లేటెస్ట్

‘జగన్‌’ సీక్రెట్లను ‘మోడీ’ చెబుతారా..?

సార్వత్రిక ఎన్నికలతో పాటు ‘ఆంధ్రప్రదేశ్‌’ అసెంబ్లీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్‌ విడుదల కావడంతో..రాష్ట్రంలోని రాజకీయపార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అధికారపార్టీ కంటే ముందుగానే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన ‘టిడిపి,జనసేన, బిజెపి కూటమి ప్రజల్లోకి వేగంగా వెళుతోంది. ఐదేళ్లలో రాష్ట్రాన్ని ‘జగన్‌’ దివాలా తీయించారని, ఆయన వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని, మళ్లీ ‘జగన్‌’ వస్తే..రాష్ట్రం పూర్తిగా అగాథంలోకి వెళ్లిపోతుందని వారు ప్రజలను హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలను నిర్వహిస్తూ తమ వాదనలను ప్రజలకు చేరుస్తున్నారు. కూటమిలో ‘బిజెపి’చేరిన తరువాత ‘ఆదివారం’ నాడు వారు ‘చిలకలూరిపేట’ వద్ద నున్న ‘బొప్పూడి’ వద్ద మూడుపార్టీల తరుపున బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. షెడ్యూల్‌ విడుదలైన తరువాత జరగనున్న సభ కావడం, దీనికి దేశ ప్రధాని ‘మోడీ’ హాజరవనుండడంతో..రాష్ట్ర ప్రజల దృష్టి అంతా దీనిపైనే ఉంది. ముఖ్యంగా ఈ సభలో ‘చంద్రబాబు’ ‘మోడీ’లు కలయిక ఎలా జరుగుతుంది. వారు ఏ విధంగా సభలో వ్యవహరిస్తారనే దానిపై రాజకీయపార్టీలు, నాయకులు, కార్యకర్తలు, సామాన్య ‘జనం’ ఆసక్తిగా గమనిస్తున్నారు. వాస్తవానికి ‘టిడిపి’తో పొత్తు ‘మోడీ’కి ఇష్టం లేదని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ‘మోడీ’కి ఇష్టం లేకపోయినా..‘ఆర్‌ఎస్‌ఎస్‌’ ఒత్తిడితో ‘టిడిపి’తో పొత్తుకు ‘మోడీ’ అంగీకరించారని ఆ వర్గం చెబుతోంది. ‘మోడీ’ ఆపధర్మ ముఖ్యమంత్రి ‘జగన్‌’ వైపే ఉన్నారని, ఆయన ‘జగన్‌’కు వ్యతిరేకంగా వ్యవహరించడానికి ఇష్టపడడం లేదని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే..ఇదంతా ‘వైకాపా’ కావాలని చేస్తోందని, పొత్తు విడగొట్టడానికి ఆ పార్టీ చేస్తోన్న ప్రయత్నాలనే మాట టిడిపి,జనసేన వర్గాల నుంచి వినిపిస్తోంది.సరే...! ‘మోడీ’కి ‘జగన్‌’పై ప్రేమ ఉన్నా లేకున్నా..ఇప్పుడు ‘కూటమి’ సభకు వస్తున్నారు కనుక..ఆ కూటమికి మద్దతుగా మాట్లాడాల్సి ఉంటుంది. అదే సమయంలోఅధికారంలో ఉన్న ‘జగన్‌’పై విమర్శలు గుప్పించాల్సి ఉంటుంది. సహజంగానే ఇవి జరుగుతాయి. అయితే..ఈ ప్రచారసభలో ‘మోడీ’ ‘జగన్‌’కు ఎంత మేర నష్టం చేస్తారు..? ఆయన ప్రసంగంలో ఏమి చెబుతారనే దానిపై ఇటు కూటమి నేతలు, అటు వైకాపా పెద్దలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘మోడీ’ తెలంగాణ ఎన్నికల సభల్లో మాట్లాడుతూ..తన వద్ద ‘కెసిఆర్‌’కు చెందిన ఒక రహస్యం ఉందంటూ..ఆ రహస్యాన్ని బహిరంగ సభలో చెప్పేశారు. అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న ‘కె.చంద్రశేఖర్‌రావు’ తన వద్దకు వచ్చి తన కుమారుడు ‘కెటిఆర్‌’ను ముఖ్యమంత్రిని చేయడానికి సహకరించాలని కోరారని, దానికి తాను ఒప్పుకోలేదని చెప్పుకొచ్చారు. దీంతో..తెలంగాణ సమాజం మొత్తం ఉలిక్కిపడిరది. ‘ప్రధాని’ స్థాయిలో ఉన్న వ్యక్తి వ్యక్తిగతంగా పంచుకున్న సమాచారాన్ని బహిరంగంగా చెప్పడం ఏమిటనే విమర్శలు వచ్చాయి. అయితే..‘మోడీ’ చేసిన పనిని ‘బిజెపి’ హర్షించింది. తెలంగాణ ఎన్నికల సభలో చెప్పినట్లు..ఇక్కడ కూడా ‘మోడీ’ ‘జగన్‌’ రహస్యాలను బయటపెడతారా..? పెడితే..ఏ విషయం గురించి చెబుతారు..అనేదానిపై రాజకీయవిశ్లేషకుల్లో చర్చ సాగుతోంది. ‘జగన్‌’ బాబాయి హత్య కేసులో నిందితుడైన ‘కడప’ ఎంపి ‘అవినాష్‌రెడ్డి’ని కాపాడమని ‘జగన్‌’ అడిగిన విషయాన్ని బయటపెడతారా.? లేక తనపై ఉన్న కేసులను నిదానం చేయమని అడిగిన దాని గురించి చెబుతారా..? లేక ఇంకేదైనా వ్యక్తిగత సహాయాలను గురించి చెబుతారా..? అనే దాని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘మోడీ’ కనుక ‘బాబాయి’ హత్య విషయం గురించి చెబితే మాత్రం వైకాపా గుండెల్లో పిడుగులు పడినట్లే. గత ఎన్నికల ముందు..‘వివేకా’ హత్యను అడ్డుపెట్టుకుని..వైకాపా అధికారంలోకి వచ్చింది. అయితే కాలక్రమంలో ఆ హత్యను ‘జగన్‌’ కుటుంబసభ్యులే చేశారని ‘సీబీఐ’ తేల్చడం, దీనిలో ‘ఎంపి’తో పాటు, ‘జగన్‌’ కుటుంబసభ్యులను అరెస్టు చేయడం జరిగింది. ఈ సమస్య నుంచి తనను కాపాడాలని ‘జగన్‌’ కోరారని చెబితే..ఇక రాజకీయంగా ‘జగన్‌’కోలుకోవడం అసాధ్యం. పోలింగ్‌కు ముందే..‘జగన్‌’ కాడిపారేయడం ఖాయం. ఇదంతా ఊహాగానమే. నిజంగా తెలంగాణలో ‘కెసిఆర్‌’ గురించి చెప్పినట్లు...‘ఆంధ్రా’లో ‘మోడీ’ చెపితే..కూటమికి 160 సీట్లు రావడం పక్కా. ‘మోడీ’కి ‘జగన్‌’కు ఉన్న సాన్నిహిత్యం వల్ల..‘జగన్‌’కు ‘మోడీ’ పెద్ద డ్యామేజ్‌ చేయరనే భావన ఉంది. మొత్తం మీద ‘ఆదివారం’ నాడు జరిగే కూటమి సభ కోసం ‘ఆంధ్రావనంతా’ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ