లేటెస్ట్

మరో సర్వే: టిడిపిదే అధికారం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన అనంతరం చేసిన ఓ సర్వే టిడిపి కూటమిదే అధికారమని తేల్చింది. బిగ్‌ టివి నిర్వహించిన ఈ సర్వేలో టిడిపి కూటమి 81 సీట్లు గెలుచుకుంటుందని, వైకాపా 53సీట్లు వస్తాయని, మరో 49 సీట్లలో హోరాహోరి పోరు ఉంటుందని తేల్చింది. ఏదైనా పార్టీ అధికారంలోకి రావాలంటే మ్యాజిక్‌ ఫిగర్‌ 89. అయితే..ఇప్పుడు టిడిపి కూటమికి 81 సీట్లు వస్తాయంటే..అధికారానికి మరో 8 సీట్లు మాత్రమే తక్కువ. పోటాపోటీ ఉన్న 41 సీట్లలో 9 సీట్లు గెలుచుకోవడం సునాయాసమే. అంటే..ఈ సర్వే ప్రకారం టిడిపి కూటమి అధికారంలోకి వచ్చినట్లే. పోలింగ్‌కు మరో 58 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత మరింత పెరిగేదే కానీ, తగ్గేదేమీ ఉండదు. అపధర్మ ముఖ్యమంత్రిగా ‘జగన్‌’ ఇక చేసేదేమీ ఉండదు. బటన్‌ నొక్కుడులు ఉండవు. ఇక ఆయన చేయగలిగింది తాను నొక్కిన బటన్ల గురించి ప్రజలకు చెప్పుకోవడమే. అయితే.. ఈ నొక్కుడుపై ప్రజలు ఇప్పటికే తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ప్రజలను బిక్షగాళ్లను చేసే ‘జగన్‌’పథకాలు తప్ప..ఐదేళ్లలో రాష్ట్రానికి ఆయన చేసిందేమిటని రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉంటే..జిల్లాల వారీగా కూడా ఈ సంస్థ తన సర్వే వివరాలను అందించింది.

శ్రీకాకుళం: (10) టిడిపి 5, వైకాపా:3, టఫ్‌పైట్‌ : 2

విజయనగరం (9) టిడిపి 4, వైకాపా : 4 టఫ్‌ ఫైట్‌ : 1

విశాఖపట్నం (15) టిడిపి 7, వైకాపా : 5, టఫ్‌ ఫైట్‌ : 3

తూర్పు గోదావరి జిల్లా (19) టిడిపి 7 వైకాపా : 5 టఫ్‌ఫైట్‌ : 7

పశ్చిమగోదావరి (15) టిడిపి 9, వైకాపా : 2, టఫ్‌ఫైట్‌ : 4

కృష్ణా (16) టిడిపి : 9, వైకాపా : 4 టఫ్‌ ఫైట్‌ : 3

గుంటూరు (17) టిడిపి : 11, వైకాపా : 2 టఫ్‌ఫైట్‌ : 4

ప్రకాశం (12) టిడిపి : 6, వైకాపా : 3, టఫ్‌ ఫైట్‌ :3

నెల్లూరు (10) టిడిపి: 4 వైకాపా:4, టఫ్‌ఫైట్‌ : 2 

చిత్తూరు (14) టిడిపి : 7, వైకాపా : 6, టఫ్‌ఫైట్‌ : 1

కడప (10) టిడిపి : 2, వైకాపా : 4, టఫ్‌ఫైట్‌ : 4

కర్నూలు (14) టిడిపి: 4, వైకాపా: 8, టఫ్‌ఫైట్‌ :2

అనంత‌పురం (14) టిడిపి: 6, వైకాపా : 3, టఫ్‌ఫైట్‌ : 5

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ