ఇద్దరికీ కలిపి ఒకటే జీవో- ముందే చెప్పిన జనమ్ఆన్‌లైన్...!
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయానంద్ సర్వీస్‌ను ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. ఆయన సర్వీసును పొడిగిస్తూ..ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులను జారీ చేసింది. అయితే..ఆయనతో పాటు మార్చి నుంచి నూతన సిఎస్‌గా సాయిప్రసాద్‌ను కూడా నియమిస్తూ అదే జీవోలో ఉత్తర్వులు జారీ చేసింది. వీరిద్దరికీ కలిపి ఒకే జీవో ఇస్తారని Janamonline.com ఈనెల 22వ తేదీనే తన కథనంలో పేర్కొంది. (http://www.janamonline.com/home/news_item/132) Janamonline.com పేర్కొన్న విధంగానే విజయానంద్‌కు సర్వీసును పొడిగిస్తూ జీవోను విడుదల చేస్తూనే ఆ తరువాత సాయిప్రసాద్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు గతంలో కూడా ఇదే విధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఒకే జీవో ఇచ్చారు. అప్పట్లో అజయ్‌కల్లం, దినేష్‌కుమార్‌లకు కలిపి ఒకే జీవో ఇచ్చారు. అప్పట్లో ఇది వివాదాస్పదమైంది. అయితే..అదే రీతిలో మరోసారి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకు ఆయన ఈ విధంగా చేస్తున్నారో..అనే దానిపై రకరకాలైన వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి విజయానంద్ కంటే ముందే సాయిప్రసాద్‌కు సిఎస్ పోస్టు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే..సాయిప్రసాద్ తన కులం వాడు కనుక ఆయనను నియమించుకుంటే..తనకు ఎక్కడ కులముద్ర వేస్తారో అన్న భయంతో బీసీ సామాజికవర్గానికి చెందిన విజయానంద్‌ను చంద్రబాబు సిఎస్‌గా నియమించుకున్నారు. అప్పట్లో ఈ పోస్టు కోసం ప్రయత్నించిన సాయిప్రసాద్‌కు చంద్రబాబు నచ్చ చెప్పి విజయానంద్ తరువాత ఇస్తానని ఆయనకు హామీ ఇచ్చారు. అయితే..విజయానంద్ రిటైర్ అయిన తరువాత తనకే ఈ పోస్టు వస్తుందనుకుంటే..విజయానంద్‌కు మరో మూడు నెలలు పొడిగింపు ఇచ్చారు. దీంతో..సాయిప్రసాద్ అలకబూనారని, ఆయనకు నమ్మకం కల్గించేందుకే ఇప్పుడు ఇద్దరికీ కలిపి ఒకే జీవో ఇచ్చారనే ప్రచారం ఉంది. వాస్తవానికి ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా ఎవరు ఉండాలనేది ముఖ్యమంత్రి ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. సీనియర్ ఐఏఎస్‌కు ఈ పదవిని కేటాయించడం ఆనవాయితీ. అయితే..రాజకీయాల్లో వచ్చిన మార్పులతో సిఎంలకు ఇష్టమైన ఐఏఎస్‌లనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, డిజీపీలుగా నియమించుకుంటున్నారు. గతంలో జగన్మోహన్‌రెడ్డి సిఎంగా ఉన్నప్పుడు తన కులానికి చెందిన వారినే సిఎస్‌గా, డీజీపీగా నియమించుకున్నారు. ఆయన ఎటువంటి శంకలు, భయాలు లేకుండా తన కులానికే ప్రాధాన్యత ఇచ్చారు. తన కులం వారికంటే..సీనియర్లు ఉన్నా వారిని కాదని జగన్ తన వారికి ప్రాధాన్యత కల్గిన పోస్టులను కట్టబెట్టారు. అయితే..చంద్రబాబు మాత్రం అటువంటి పనిచేయలేకపోతున్నారు. స్వంత సామాజికవర్గమంటే ఆమడ దూరం పెడుతున్నారు. మొత్తం మీద కులముద్ర పడకుండా ఉండాలన్న భావనతో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి.