కాబోయే మంత్రికి క‌ష్టాలు...!?

28, Dec 2025

మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఎప్పుడు జ‌రిగినా మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని భావించిన జ‌న‌సేన ఎమ్మెల్సీ నాగ‌బాబు అనుకోని ఇబ్బందుల్లోప‌డ్డారు. ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోద‌రుడైన నాగ‌బాబు సినీన‌టుడు శివాజీ మ‌హిళ‌ల‌ను ఉద్దేశించిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న‌ను విమ‌ర్శిస్తూ చేసిన వ్యాఖ్య‌లు  వైర‌ల్ అయ్యాయి. నాగ‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను మ‌హిళ‌ల‌తో పాటు, ఆయ‌న పార్టీ కార్య‌క‌ర్త‌లు, ఇత‌రులు కూడా ఖండిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా విప‌రీతంగా ట్రోలింగ్ జ‌రుగుతోంది. సినీన‌టుడు శివాజీని చెప్పుతో కొట్టాల‌న్న నాగ‌బాబుపై తీవ్ర‌మైన ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. శివాజీ మ‌హిళ‌ల గురించి త‌ప్పుగా ఏమీ మాట్లాడ‌లేద‌ని, మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధారణ‌పై ఆయ‌న మంచి సూచ‌నే చేశార‌ని, అలా చేయ‌డం త‌ప్పు ఎలా అవుతుంద‌ని, మ‌హిళల మంచికోస‌మే ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై నాగ‌బాబు పెడ‌ధోర‌ణితో వ్యాఖ్య‌లు చేశార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి సినీన‌టుడు శివాజీ మ‌హిళ‌ల బ‌హిరంగ ప్ర‌దేశాల్లో జాగ్ర‌త్త‌గా వ‌స్త్ర‌ధార‌ణ చేసుకోవాల‌ని, అస‌భ్య‌మైన వ‌స్త్ర‌ధార‌ణ వ‌ల్ల స‌మాజంలోని సైకోల భారిన ప‌డ‌తార‌ని, ఇటీవ‌ల కాలంలో కొంత మంది సినీ హీరోయిన్‌లు అలా ఇబ్బందులు ప‌డ్డార‌ని, వాళ్ల‌లా కావ‌ద్ద‌ని ఆయ‌న చెబుతూ కొన్ని అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై యాంక‌ర్ అన‌సూయ శివాజీని విమ‌ర్శిస్తూ ఆయ‌న క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఆమెకు మ‌రికొంద‌రు జ‌త‌క‌ల‌వ‌డంతో శివాజీ క్ష‌మాప‌ణ చెప్పారు. ఆయ‌న తెలంగాణ మ‌హిళా క‌మీష‌న్ వ‌ద్ద‌కు వెళ్లి కూడా క్ష‌మాప‌ణ‌లు కోరారు. తాను కొన్ని అన‌కూడ‌ని మాట‌లు అన్నాన‌ని, తాను త‌ప్పు చేశాన‌ని ఒప్పుకున్నారు. దీంతో..అంతా స‌ద్దుమ‌ణుగుతుంద‌నుకున్న స‌మ‌యంలో ఎమ్మెల్సీ నాగ‌బాబు శివాజీనీ చెప్పు తీసుకుని కొట్టాల‌ని అన‌డంతో..ఆయ‌నేమి త‌ప్పు చేశార‌ని సోషల్ మీడియా మొత్తం నాగ‌బాబుకు వ్య‌తిరేకంగా ట్రోలింగ్ చేస్తోంది. ఆయ‌న శివాజీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల వీడియో కింద నాగ‌బాబును విమ‌ర్శిస్తూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ..విప‌రీతంగా కామెంట్లు పెడుతున్నారు. దీంతో..నాగ‌బాబు ఆ వీడియో కామెంట్‌లు ఆపుకోవాల్సి వ‌చ్చింది. విచిత్రంగా జ‌న‌సేన సోష‌ల్ మీడియా కూడా నాగ‌బాబుకు వ్య‌తిరేకంగానే స్పందిస్తోంది. ఎందుకు అన‌వ‌స‌రంగా ఈ వివాదంలోకి ఆయ‌న ఎంట‌ర్ అయ్యారు..? అంటూ వాళ్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. కాగా..గ‌తంలోనే నాగ‌బాబుకు మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప్ర‌క‌టించారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఎప్పుడు జ‌రిగినా ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌నే భావ‌న అటు జ‌న‌సేన‌లోనూ, ఇటు టిడిపి వ‌ర్గాల్లోనూ ఉంది. అయితే..అన‌వ‌స‌ర విష‌యాల్లో రాద్ధాంతం చేసే నాగ‌బాబు..ఇప్పుడు కూడా ఒక సున్నిత‌మైన విష‌యంలో త‌ల‌దూర్చి ఇబ్బందులు కొని తెచ్చుకున్నార‌ని, ఇటువంటి వారిని మంత్రిని చేస్తే..త‌రువాత ప‌రిస్థితి ఎలా ఉంటుందోన‌ని కూట‌మి నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మంచి వ్య‌క్తి అని కానీ..నాగ‌బాబు వ‌ల్ల చాలా ఇబ్బందులు ఉంటాయ‌ని, ఆయ‌న‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకోక‌పోతేనే మంచిద‌ని కూట‌మి నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌స్తుత వివాదం వ‌ల్ల నాగ‌బాబుకు మంత్రిప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌చ్చేమోన‌న్న అభిప్రాయాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. 


(4)
(2)

Comments


  • 2025-12-30 08:26:52
  • SESHAGIRI TALLURI

జనసేన అంతం నాగబాబు పంతం ????????ఇవ్వాలి మంత్రి - ముయ్యాలి జనసేన ????????

(0)
(0)