స్టేట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం నాడు జీవో ఆర్.టి.నెం.30ని విడుదల చేసింది. రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేసేందుకు మార్గం సుగమమం అయింది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అక్రిడిటేషన్ కార్డులనే ఇప్పటి వరకూ పొడిగించుకుంటూ వస్తున్నారు. ఏడాదిన్నర నుంచి అక్రిడిటేషన్ ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం కాలక్షేపం చేసింది. అయితే ఎట్టకేలకు అక్రిడిటేషన్ కమిటీల ఏర్పాటుతో అక్రిడిటేషన్ పక్రియ ముందుకు వెళ్లనుంది. ఈ కమిటీకి రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్ ఛైర్మన్‌గా ఉంటారు. ఆయనతో పాటు బిగ్ మీడియా తరుపున ఐదు జర్నలిస్టు సంఘాలకు చెందిన ప్రతినిధులు ఉంటారు. స్మాల్ అండ్ మీడియా తరుపున ఇద్దరు, పెద్ద మధ్య తరహా పత్రికల తరుపున నలుగురు, ఎలక్ట్రానిక్ జర్నలిస్టుల సంఘం నుంచి ఇద్దరు, ఫోటో జర్నలిస్టుల సంఘం నుంచి ఒకరు ఉంటారు. వీరితో పాటు వైద్య & ఆరోగ్యశాఖ, కార్మికశాఖ, గృహనిర్మాణ శాఖ ప్రతినిధులు, దక్షిణమధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, ఏపీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ లేదా ఆయన నామినీ (జనరల్ మేనేజర్ హోదా కంటే తక్కువ కాకూడదు) – సభ్యుడు, I&PR శాఖ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ / రీజినల్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ – సభ్యుడు, అవసరాన్ని బట్టి SMAC చైర్మన్ నియమించే ఎక్స్-ఆఫిషియో సభ్యుడు – ఎక్స్-ఆఫిషియో సభ్యుడు, అదనపు డైరెక్టర్, I&PRలు సభ్యులుగా ఉంటారు.
పేరేమో డైలీః సభ్యుడేమో వీక్లీ-ఇదెక్కడ్డ విడ్డూరం...!
కాగా స్మాల్ అండ్ మీడియం డైలీ న్యూస్ పేపర్స్ అసోషియేషన్ తరుపున ఎంపిక చేసిన ఇద్దరు సభ్యుల్లో ఒకరిని ప్రభుత్వం తప్పుగా నామినేటెడ్ చేసింది. ఈ కేటగిరిలో Small and Medium Newspapers Association of Andhra Pradesh (Regd. No. 134/2018) తరుపున ఎంపిక చేసిన డి.ఉదయభాస్కర్ రావు అంగన్‌వాడి వాయిస్ డైలీ అని జీవోలో పేర్కొన్నారు. వాస్తవానికి అది డైలీ పేపర్ కాదు. Anganwadi Voice అనేది మాసపత్రిక. Press Registrar General of India websiteనూ అది మాసపత్రికగానే నమోదు అయింది. (దీనికి సంబంధించిన సమాచారం ఇదిగో)
డైలీ కేటగిరిలో మాసపత్రికను ఎలా ఎంపిక చేశారో..సమాచారశాఖ అధికారులకే తెలియాలి. బోగస్ యూనియన్లను స్టేట్ అక్రిడిటేషన్ మీడియా కమిటీలోకి ఎంపిక చేస్తున్నారని, వారిని తప్పించాలని చెప్పినా..కొందరు అధికారులు రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్‌ను తప్పుదోవ పట్టించారు. ఇంత స్పష్టంగా మాసపత్రికకు చెందిన వారిని దినపత్రిక కేటగిరిలో చేరుస్తున్నా..ఈ విషయం ఆయనకు తెలియకపోవడం నిజంగా విచిత్రమే. ఎందుకు రూల్స్‌కు వ్యతిరేకంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో..? ఎవరికి లబ్ది చేకూర్చేందుకు ఇలా చేస్తున్నారో..మంత్రికి, అధికారులకే తెలియాలి. వైకాపాకు వంతపాడే...బోగస్ యూనియన్లను రాష్ట్ర సమాచారశాఖ అధికారులు మద్దతు ఇస్తున్నా..ప్రభుత్వ పెద్దలు మాత్రం యధావిధిగా మౌనముద్రనే దాలుస్తున్నారు.