ఐఏఎస్ అధికారుల బ‌దిలీలు

12, Jan 2026

రాష్ట్ర ప్ర‌భుత్వం కొంద‌రు ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ మ‌రి కొంద‌రికి పోస్టింగ్‌లు ఇచ్చింది. 13 మంది ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ సోమ‌వారంనాడు  ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యానంద్ ఉత్త‌ర్వుల‌ను విడుద‌ల చేశారు. గుంటూరు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మీష‌న‌ర్‌గా ఉన్న పులి శ్రీ‌నివాసుల‌ను కొత్త‌గా ఏర్ప‌డిన మార్కాపురం జిల్లా సంయుక్త క‌లెక్ట‌ర్‌గా నియ‌మించారు. 2017 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన గోపాల‌కృష్ణ రోణంకిని వైద్య మ‌రియు కుటుంబ సంక్షేమ శాఖ‌లో సంయుక్త కార్య‌ద‌ర్శిగా నియ‌మించారు. ప్ర‌స్తుతం పోస్టింగ్ కోసం వేచి ఉన్న శ్రీవాస్ నుపూర్ అజయ్‌కుమార్, ఐఏఎస్ (2018) ను సివిల్ సప్లైస్ డైరెక్టర్‌గా మరియు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & సివిల్ సప్లైస్ శాఖలో ప్రభుత్వ ఉప కార్యదర్శిగా నియ‌మించారు. శ్రీమతి కల్పనా కుమారి, ఐఏఎస్ (2018), గిరిజన సహకార సంస్థ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సేవలను గిరిజన సంక్షేమ శాఖ నుండి త‌ప్పించి ఆమెను ప్రకాశం జిల్లా సంయుక్త కలెక్టర్‌గా ప్ర‌భుత్వం నియ‌మించింది. విశాఖ‌ప‌ట్నం జిల్లా సంయ‌క్త క‌లెక్ట‌ర్‌గా ఉన్న క‌త‌వ‌టే మ‌యూర్ అశోక్‌ను గుంటూరు మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌గా నియ‌మించారు. తిరుప‌తి పట్ట‌ణాభివృద్ధి సంస్థ వైస్ ఛైర్మ‌న్‌గా ఆర్‌.గోవింద‌రావు(2018)ను నియ‌మించారు. వైఎస్సార్ కడప జిల్లా సంయుక్త కలెక్టర్ నిధి మీనా, ఐఏఎస్ (2019) ను నియ‌మించారు. విష్ణు చరణ్, ఐఏఎస్ (2019) అనంత‌పురం జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్‌గానూ, మల్లవరపు సూర్యతేజ, ఐఏఎస్ (2020) అన‌కాప‌ల్లి జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్‌గానూ, ఆధర్ష్ రాజేంద్రన్, ఐఏఎస్ (2020)ను చిత్తూరు జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్‌గానూ,షోబికా ఎస్‌ఎస్, ఐఏఎస్ (2020) గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించి, గిరిజన సహకార సంస్థ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గాను, గొబ్బిళ్ల విద్యాధరి, ఐఏఎస్ (2021) ను విశాఖపట్నం జాయింట్ క‌లెక్ట‌ర్‌గా,శివ్ నారాయణ్ శర్మ, ఐఏఎస్ (2021) ను అన్నమయ్య జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్‌గా, వి. సంజన సింహా, ఐఏఎస్ (2022)ను ప‌ల్నాడు జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్‌గా నియ‌మించారు. బ‌దిలీ అయిన‌ప్ప‌టికీ ఇంకా పోస్టింగ్ కేటాయించ‌ని అధికారుల‌కు సంబంధించి ప్ర‌త్యేకంగా ఉత్త‌ర్వులు జారీ చేస్తామ‌నిప్ర‌భుత్వం జీవోలో పేర్కొంది. 


(1)
(1)

Comments