వ‌య‌స్సునూ నొక్కేసిన జ‌గ‌న్‌...!?

23, Jan 2026

మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అల‌వోక‌గా అబ‌ద్దాలు చెప్పేస్తుంటారు. రాజ‌కీయాల్లో ఆయ‌న చెప్పే అస‌త్యాలు చూస్తుంటే..అబ్బో అన‌క‌త‌ప్ప‌దు. నిన్న‌టికి నిన్న ఆయ‌న ప‌ట్టాదారు పాస్ పుస్త‌కాల విష‌యంలో అల‌వోకంగా అస‌త్యాలు అల్లేశారు. బ్రిటీష్ వారి త‌రువాత తానే ల్యాండ్ స‌ర్వే చేశాన‌ని, ప‌ట్టాదారు పాస్ పుస్త‌కాలు తాను తెస్తే..ఆ క్రెడిట్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు కొట్టేశారంటూ..త‌న పాస్ పుస్త‌కాల‌కు..ఇప్పుడు ఇస్తోన్న పుస్త‌కాల‌కు చాలా తేడా ఉంద‌ని, తాను ప‌క‌డ్బందిగా అన్నీ చేశాన‌ని చెప్పేసుకున్నారు. అస‌లు ల్యాండ్ స‌ర్వే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండూ..వేర్వేర‌నే విష‌యాల‌ను ఆయ‌న అల‌వోక‌గా దాచిపెట్టేశారు. అదే స‌మ‌యంలో ప‌ట్టాదార్ పాస్ పుస్త‌కాల‌పై వేసుకున్న త‌న బొమ్మ‌ల‌ను, స‌రిహ‌ద్దురాళ్ల‌పై చెక్కిన త‌న బొమ్మ‌ల గురించి మాట మాత్ర‌మైనా ప్ర‌స్తావించ‌లేదు. అప్ప‌ట్లో రాష్ట్ర ప్ర‌జ‌లు త‌మ భూముల‌పై జ‌గ‌న్ బొమ్మ‌లేమిట‌నే క‌దా..గోల‌గోల చేసింది. త‌మ పూర్వికులు ఇచ్చిన ఆస్తుల‌పై ఆయ‌న బొమ్మ‌లు..ఆయ‌న రాళ్లు ఏమిట‌నే గ‌గ్గోలు పెట్టేస్తే..అప్ప‌ట్లో స‌ల‌హాదారుగా ఉన్న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి జ‌గ‌న్ బొమ్మేస్తే త‌ప్పేమిట‌ని ద‌బాయించారు క‌దా..అప్ప‌ట్లో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని ఆగారు...కానీ..లేకుంటే..రాష్ట్రంలో నివ‌సిస్తున్న ప్ర‌తి వ్య‌క్తి మొఖంపై జ‌గ‌న్ బొమ్మ ప‌చ్చ‌బొట్టేసేవాళ్లు. అప్పుడు ప‌చ్చ‌బొట్టేసినా.. త‌ప్పేమీ లేద‌ని స‌జ్జ‌ల తీర్పుఇచ్చేసేవాడు.



అద‌లా ఉంచితే..ఆస్తులు నొక్కేయ‌డం..లాగేసుకోవ‌డం...ద‌బాయించ‌డం...అల‌వోక‌గా అస‌త్యాలు దంచ‌డం..జ‌గ‌న్‌కు అల‌వాటైతే..ఇప్పుడు కొత్త‌గా వ‌య‌స్సునూ నొక్కేస్తున్నారు. నిన్న జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో (ఎంపిక చేసిన విలేక‌రుల స‌మావేశం) త‌న వ‌య‌స్సూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కుమారుడు రాష్ట్ర విద్యా, ఐటి శాఖ‌మంత్రి నారా లోకేష్ వ‌య‌స్సూ ఒక‌టేన‌టా...? ఈ మాట విన్న వాళ్లు..అమ్మ జ‌గ‌నూ..వ‌య‌స్సూ నొక్కేస్తావా..? ఇప్ప‌టి దాకా..ఆస్తులు, ప్ర‌జ‌ల సొమ్మూ నొక్కేస్తావ‌నుకుంటే..ఇప్పుడూ వ‌య‌స్సూనూ నొక్కేస్తావా..అంటూ నోరెళ్ల‌బెడుతున్నారు. జ‌గ‌న్ వ‌య‌స్సు ఏంత‌?  లోకేష్ వ‌య‌స్సు ఎంత‌? ఆయ‌న‌కు ఈయ‌న‌కు క‌నీసం ప‌దేళ్ల పైన‌..వ‌య‌స్సు తేడా ఉంటుంది. జ‌గ‌న్‌కు 54 ఏళ్లు ఉంటే..లోకేష్‌కు 43ఏళ్లు. అంటే దాదాపు 11 ఏళ్లు జ‌గ‌న్ లోకేష్ కంటే పెద్ద‌. ఇంత తేడా ఉంటే..త‌న‌దీ లోకేష్‌దీ ఒక‌టే వ‌య‌స్స‌ని ద‌బాయించ‌డం జ‌గ‌న్‌కే చెల్లింది. ఎవ‌రైనా ఒక‌టి రెండు సంవ‌త్స‌రాలు తేడా ఉంటే..స‌రే ఏడాది అటో..ఇటో అని స‌రిపెట్టుకుంటారు. చాలా మంది త‌న వ‌య‌స్సును ఒక‌టి రెండేళ్లు త‌గ్గించి చెప్పుకుంటారు..అది మాన‌వ స‌హ‌జం. కానీ..జ‌గ‌న్‌లా ప‌దేళ్లు నొక్కేయ‌రు. వాస్త‌వానికి జ‌గ‌న్ వ‌య‌స్సు దాదాపు 55 ఏళ్లు ఉంటాయి. చంద్ర‌బాబు వ‌య‌స్సు దాదాపుగా 75 లేక 76 వీరిద్ద‌రి మ‌ధ్య 20ఏళ్ల తేడా ఉంటుంది. 20ఏళ్లేగా అని చంద్ర‌బాబు..తాను జ‌గ‌న్ స‌మ వ‌య‌స్కుల‌మంటే..ఎలా ఉంటుందో..జ‌గ‌న్ తానూ లోకేష్ స‌మ‌య‌స్కుల‌మ‌ని చెప్పుకుంటున్నాడు. మ‌రి న‌మ్మేవాళ్లు న‌మ్మేయండి. 


(2)
(1)

Comments