సెల‌వులో I&PR డైరెక్ట‌ర్‌

23, Jan 2026

రాష్ట్ర స‌మాచార‌శాఖ డైరెక్ట‌ర్ విశ్వ‌నాధ‌న్ 15 రోజుల సెల‌వుపై తైవాన్ వెళ్ల‌నున్నారు. ఆయ‌న ఈ నెల 31వ తేదీ నుంచి ఫిబ్ర‌వ‌రి 16వ‌ర‌కు సెల‌వులో ఉంటారు. స్వంత ప‌నుల‌పై ఆయ‌న తైవాన్ వెళుతున్నారు. వాస్త‌వానికి 2వ తేదీ నుంచి ఆయ‌న సెల‌వు వ‌ర్తిస్తుంది. అయితే 31,1వ తేదీలు ప్ర‌భుత్వ సెల‌వులు కావ‌డంతో ఆయ‌న 31వ నుంచే విదేశాల‌కు వెళ్ల‌డానికి ప్ర‌భుత్వం అనుమతి ఇచ్చింది. కాగా విశ్వ‌నాధ‌న్ సెల‌వుపై వెళ్ల‌నుండ‌డంతో ఆయ‌న స్థానంలో రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్‌గా ఉన్న ప్ర‌ఖ‌ర్‌జైన్‌కు అద‌న‌పు బాధ్య‌త‌లను ప్ర‌భుత్వం అప్ప‌గించింది. విశ్వ‌నాధ‌న్ చూస్తోన్న ఎపీ డిజిట‌ల్ కార్పొరేష‌న్‌,  ఏపీ రాష్ట్ర ఫిలిం, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ల‌కు కూడా ప్ర‌ఖ‌ర్‌జైన్ ఇన్‌ఛార్జిగా వ్య‌వ‌హ‌రిస్తారు. కాగా రాష్ట్ర స‌మాచార‌శాఖ జ‌ర్న‌లిస్టుల‌కు అక్రిడిటేష‌న్ మంజూరుపై ఇప్ప‌టికే  విదివిధాన‌ల‌ను ఖ‌రారు చేసింది. రాష్ట్ర స్థాయిలో ఇప్ప‌టికే అక్రిడిటేష‌న్ క‌మిటీ స‌మావేశ‌మై కొంత మంది జ‌ర్న‌లిస్టుల‌కు అక్రిడిటేష‌న్ మంజూరుకు అంగీక‌రించింది. అయితే జిల్లా స్థాయిలో ఇంకా క‌మిటీలు ఏర్పాటు కాలేదు. విశ్వ‌నాధ‌న్ సెల‌వుపై వెళ్లేలోగా జిల్లా క‌మిటీల‌ను ఒక కొలిక్కి తెస్తార‌నే అంచనాలు ఉన్నాయి. జిల్లా క‌మిటీల జీవోలు విడుద‌లైతే..జిల్లాల్లో జ‌ర్న‌లిస్టుల అక్రిడిటేష‌న్ల ప‌క్రియ ప్రారంభం అవుతుంది. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాట‌యి దాదాపు రెండేళ్లు కావ‌స్తున్నా..ఇంత వ‌ర‌కూ అక్రిడిటేష‌న్లు ఇవ్వ‌లేక‌పోయింది. అదిగో..ఇదిగో అంటూ..కార్డులు పొడిగిస్తూ వ‌స్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఇటీవ‌ల ప‌క్రియ‌ను ఒక కొలిక్కి తెచ్చారు. అయితే..ఇప్పుడు డైరెక్ట‌ర్ విదేశీప‌ర్య‌ట‌న‌కు వెళుతుండ‌డంతో..ఈ ప‌క్రియ కొన‌సాగుతుందా?  లేదా వాయిదాలు ప‌డుతుందా? అనేది చూడాలి. 


(0)
(0)

Comments