ఈడీబీ సిఇఓగా ధాత్రిరెడ్డి..!?

31, Jan 2026

రాష్ట్ర ప్ర‌భుత్వం త్వ‌ర‌లో కొంద‌రు ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేయ‌బోతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్యంగా నూత‌నంగా ఏర్పాటు చేసిన మార్కాపురం, పోల‌వరం జిల్లాల‌కు నూత‌న క‌లెక్ట‌ర్ల‌ను నియ‌మించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ జిల్లాల‌కు APIIC, Managing Directorగా ఉన్న Abhishikth Kishoreను,APEBD ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్‌గా ఉన్న సాయికాంత్ వ‌ర్మ‌ను నియ‌మిస్తారంటున్నారు. కాగా ఎపిఈడీబీ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్‌గా ఉన్న సాయికాంత్ వ‌ర్మ స్థానంలో ఇప్పుడు ఓ జూనియ‌ర్ అధికారిని నియ‌మిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. Ratan Tata Innovation Hub (RTIH) Chief Executive Officerగా ఉన్న ధాత్రిరెడ్డిని ఈడీబీలో నియ‌మిస్తారంటున్నారు. 2020 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ధాత్రిరెడ్డి ఇటీవ‌ల కాలంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప్ర‌శంస‌ల‌ను పొందారు. ప‌నిచేసే అధికారిగా పేరుతెచ్చుకున్నారు. అయితే..అత్యంత జూనియ‌ర్ అధికారి అయిన ఆమె ఈడీబీలో ఎలా ప‌నిచేస్తార‌నే దానిపై ప‌లు సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. 


(1)
(0)

Comments