గుంటూరు సివంగిపై ప్రశంసల జల్లు...!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అసభ్య, మురికి వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది. సభ్యసమాజం అంగీకరించని మాటలతో అంబటి ముఖ్యమంత్రిని దూషించారు. దీనిపై రాష్ట్రంలోని అన్నివర్గాలు ఆగ్రావేశాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిందరికీ భిన్నంగా గుంటూరు పట్టణంలో మాత్రం టిడిపి కార్యకర్తలు, మహిళలు, వివిధ వర్గాలకు చెందిన వారు తీవ్ర ఆగ్రహంతో అంబటి ఇంటిపై దాడి చేశారు. అంబటి గతంలోనూ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు..జగన్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలోనూ,తరువాత ఇంటా బయటా చంద్రబాబును, ఆయన కుమారుడ్ని ఎద్దేవా,ఎగతాళి, వెటకారంచేసేవారు. అయితే ఆయన మాటలపై టిడిపి నేతలు, కార్యకర్తల్లో, సామాన్య జనంలోనూ తీవ్ర ఆగ్రహం, ఆవేదనా వ్యక్తం అయినా... ఎప్పుడూ ఆయనపై దాడికి దిగలేదు. అయితే..ఈసారి మాత్రం టిడిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు అంబటికి బుద్దిచెప్పాలనే కృతనిశ్చయంతో ఆయనపై దాడి చేశారు. మొదట ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలు చేసినప్పుడు అందరూ లోలోన బాధపట్టారు. అధికారంలో ఉండి కూడా ఈ రకంగా తిట్టించుకోవడం ఏమిటని పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆవేదన చెందారు తప్ప ఎవరూ బయటకు రాలేదు. అయితే..గుంటూరు-2 ఎమ్మెల్యే గల్లా మాధవి మాత్రం ఊరుకోలేదు. ఆయనతో అమీతుమీకి, వీధిపోరాటానికి దిగారు. అంబటి అంతు చూసేవరకూ వదిలేది లేదన్నట్లు ఆమె తీవ్ర ఆగ్రహంతో ఆయనపై దూసుకుపోయారు. తన తండ్రిలాంటి చంద్రబాబుపై అటువంటి కూతలు కూస్తారా...? అసలు అంబటికి బుద్ది ఉందా....? లేదా అంటూ..ఆయన అంతు చూడడానికి ఒక్కరే ధైర్యంగా అంబటి ఇంటి ముందు పోరాడారు.
మొదట ఆమె మరో ఇద్దరు ముగ్గురు మహిళలలు నేరుగా అంబటి ఇంటి వద్దకు వెళ్లి ఆయనతో ముఖాముఖి తలపట్టారు. ఎమ్మెల్యే మాధవి అంబటి ఇంటి వద్దకు వెళ్లినప్పుడు అంబటి తన మనుషులను భారీగా మొహరించి మాధవిపై దాడి చేశారు. ఆమెను ఆమెతో పాటు మరో ఇద్దరు ముగ్గురినీ తరిమేయడానికి, బెదిరించ డానికి యత్నించారు. అయితే..మాధవి మాత్రం వారిని చూసి బెదరకుండా..ఎదురుదాడి చేశారు. వారితో నేరుగా తలపడ్డారు. వారికిసై అంటే సై అంటూ..సవాళ్లు విసిరి ధైర్యంగా ఆ మూకను ఎదుర్కొన్నారు. మాధవి వెంట ముగ్గురే ఉన్నా..అంబటి సైన్యానికి చుక్కలు చూపించారు. వారు విసిరే సవాళ్లను తిప్పికొడుతూ ధైర్యంగా ఆమె వారిని ఎదరించారు. అంబటి మనుషులు రాళ్లు, చెప్పులతో మాధవిపై దాడి చేయడానికి ప్రయత్నించగా ఆమె కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించి వారిపై దాడి చేశారు. వీళ్లు ముగ్గురే ఉన్నా..అంబటిని మనుషులను ఎదుర్కొన్న తీరును గుంటూరు ప్రజలు కథలు..కథలుగా చెప్పుకుంటున్నారు. మాధవిని చూసిన తరువాత...మిగతా టిడిపి నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ మహిళలు భారీగా కదలివచ్చి సంజనా అంబటి అంతు చూశారు. ఆయనపైనా, ఆయన ఇంటిపైనా దాడి చేసి..తమ నేతను అవమానించినందుకు, మహిళలను కించపర్చినందుకు ప్రతీకారం తీర్చుకున్నారు. చంద్రబాబును దూషిస్తే..ఆయన మౌనంగా ఉన్నా..తాము మాత్రం మౌనంగా ఉండమని తేల్చి చెప్పారు. ఈ స్థాయిలో ప్రతిదాడులు ఎదురుకావడంతో అంబటి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఊహించని స్థాయిలో జరిగిన దాడికి అంబటి ఆయన పరివారం నిశ్చేష్టులయ్యారు. గుంటూరు లేడీ సివంగి దెబ్బకు అంబటి రౌడీ బ్యాచ్ గుంటూరు వీధుల్లో పరుగులు పెట్టేశారు.
మాధవా..మజాకానా...!
చూడడానికి మన పక్కింటి మహిళలా, సాధారణ గృహిణిలా, ఎంతో పరిచయం ఉన్న సాదాసీదా మహిళగా కనిపించే ఎమ్మెల్యే మాధవి పేరు ఇప్పుడు గుంటూరు మొత్తం మారుమ్రోగిపోతోంది. ఇప్పుడు గుంటూరు పట్టణం మొత్తం ఎమ్మెల్యే మాధవి అంబటితో చేసిన పోరాటన్ని ఆసక్తిగా వింటూ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఏ ఒక్క టిడిపి కార్యకర్తను, సానుభూతిపరులను పలకరించినా.. ఆమె ధైర్యాన్ని, నాయకుడి పట్ల ఆమెకు ఉన్న గౌరవాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ అభినందిస్తున్నారు. ఒక మహిళ అయినా వెనకంజ వేయకుండా..ఆమె ముందుకు దూసుకెళ్లడంపై టిడిపి నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వాళ్లే టిడిపికి కావాలని..ప్రత్యర్థిని ఎదుర్కొనడంలో..ఈ మాత్రం చొరవ ఉంటే..వైకాపా రౌడీ బ్యాచ్ పరార్ అవుతుందనే భావన వారిలో ఉంది. మాధవిలా మిగతా నాయకులు..వ్యవహరించాలని, పెద్దపెద్ద పదవులు తీసుకున్న వాళ్లు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంటే...కార్యకర్తల్లో మనోధైర్యంఎలా పెరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. కాగా నిన్న మొన్నటి దాకా..ఎమ్మెల్యే మాధవిపై అంతో ..ఇంతో టిడిపి కార్యకర్తల్లో అసంతృప్తి, అసహనం ఉన్నాయి. ముఖ్యంగా ఆమె భర్త రామచంద్రరావు వివాదాస్పద వ్యవహారాలు, రియల్ఎస్టేట్ విషయాల్లో ఉన్న గొడవలు ఈ దెబ్బతో పక్కకు వెళ్లిపోయాయి. ఒక ఎమ్మెల్యేగా ఆమె స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. గుంటూరు పట్టణంలో ఎక్కడ చూసినా..ఇదే విషయంలపై చర్చించుకుంటున్నారు. అంబటిపై ఆమె చేసిన పోరాటం..ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఆమెను తిరుగులేని మహిళా నేతగా నిలబెట్టింది.
వికలాంగుడైనా గోనుగుంట్ల పోరాటం...అద్భుతం...!
అంబటి రాంబాబు మురికి వ్యాఖ్యల విషయంలో టిడిపిలో పేరుమోసిన నేతలు పెద్దగా పట్టించుకోక పోయినా..గల్లా మాధవిలా రాష్ట్ర గ్రంధాలయ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు కూడా అద్భుతంగా స్పందించి అంబటికి చుక్కలు చూపించారు. వికలాంగుడైన ఆయన తన తోపుడు బండితో..అంబటి ఇంటి ముందుకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. తన తోపుడు బండికి ఒక మైక్ కట్టుకుని అంబటిని బయటకు రావాలని సవాల్ చేశారు. తనతో పాటు వచ్చిన వారిని కలుపుకుని అంబటి ఇంటి ముందు హల్‌చల్ చేశారు. ఆయన పోరాటాన్ని చూసిన వారు..ఇటువంటి కార్యకర్తలే కదా పార్టీకి కావాల్సింది..ఇటువంటి వారు ఉన్న టిడిపిపార్టీనీ ఎవరూ ఏమీ చేయలేరని, ఇంతటి నిబద్దత, పార్టీ అధినేతపై ఉన్న విశ్వాసమే వీరిని వీధుల్లోకి రప్పించిందనే భావన వ్యక్తం అవుతోంది. గోనుగుంట్ల ఇప్పుడే కాదు..గతంలో జగన్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించినప్పుడు కూడా వెరవకుండా వీధిపోరాటాలకు దిగారు.