జ‌గ‌న్‌వి ప‌గ‌టి క‌ల‌లే...!?

25, Jul 2025

మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప‌గ‌టి క‌ల‌లు కంటున్నార‌ని స్వంత పార్టీ నాయ‌కులే అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో చెప్పుకుంటున్నారు. గ‌ట్టిగా క‌ళ్లు మూసుకుంటే మూడేళ్లలో చంద్ర‌బాబు ఎగిరిపోతాడు...అప్పుడు అధికారం మ‌న‌దే..? గ‌ట్టిగా క‌ళ్లుమూసుకోండి..అంటూ ఆయ‌న చేస్తోన్న వ్యాఖ్య‌ల‌పై ఇదెక్క‌డి సంత‌రా..బాబూ..అంటూ ఆ పార్టీలో సీరియ‌స్‌గా ప‌నిచేసే నాయ‌కులు అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు. ఎంత‌సేపూ ఇదిగో వ‌చ్చేస్తున్నా...ఇదిగో గెలిచేస్తున్నా... అంటూ కార్య‌క‌ర్త‌ల‌ను నాయ‌కుల‌ను మ‌భ్య‌పెట్టే మాట‌లే చెబుతున్నారు త‌ప్ప‌..వాస్త‌వంలో బ‌త‌క‌డం లేద‌నే వారు వాపోతున్నారు. గ‌తంలో 175/175 సీట్లని మ‌భ్య‌పెడితే..అప్పుడూ న‌మ్మాం..ఇప్పుడూ అదే న‌మ్మ‌మంటున్నారు. ఇత‌నితో ఉంటే ఊహ‌ల్లో విహ‌రించ‌డం త‌ప్ప‌..మ‌రో దారి లేద‌ని వారు మ‌ధ‌న‌ప‌డుతున్నారు. అస‌లు...మ‌ళ్లీ గెలిచే ప‌రిస్థితులు ఉన్నాయా..?  దాని కోసం క్షేత్ర‌స్థాయిలో చేయాల్సింది చేస్తున్నామా..? ఒక వ్యూహం ప్ర‌కారం, ఒక ప‌ద్ద‌తి ప్ర‌కారం వెళుతున్నామా..? అనేది ప‌రిశీలించుకోకుండా గెలిచేస్తున్నాం..అంటూ చేస్తోన్న అతిపై వారు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. అయితే కొంత మంది ఇలా ఉంటే మ‌రి కొంద‌రు మాత్రం జ‌గ‌న్ క‌న్న‌ట్లే ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారు. ఇటీవ‌ల కాలంలో ఓ వైకాపా నాయ‌కుడు Janamonline.com ప్ర‌తినిధితో మాట్లాడుతూ ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే జ‌గ‌న్ బంప‌ర్ మెజార్టీతో గెలుస్తాడంటూ..సెల‌విచ్చారు. దీంతో..ఆయ‌న ఎలా గెలుస్తారో..చెప్పాల‌ని అడ‌గ‌గా...చంద్ర‌బాబు మోసం చేశాడు...? ఇక గెలిచేస్తాం..అన్నాడు. చంద్ర‌బాబు ఏమి మోసం చేశాడు...?  చెప్ప‌మంటే..సూప‌ర్ సిక్స్ ఎగ‌గొట్టాడు..ఒకే.. ఇంకా..చెప్పండి..అంటే..ప‌రిపాల‌న బాగాలేదని టిడిపి నేత‌లే చెబుతున్నారు..అన్నాడు..ఇంకా ఏమిటి..? అంటే..పోలీసులు వైకాపా నాయ‌కులను అరెస్టులు చేస్తున్నారు...? ఇంకా అంటే..ఇంకేమీ లేవన్నాడు. దీనికే మీరు గెలుస్తారా..? అంటే గెలిచేస్తాం..జ‌గ‌న్ అన్న అదే చెబుతున్నాడు.. అంటాడు. దీనికే జ‌గ‌న్ గెలుస్తాడా..? అని రెట్టిస్తే..అవునంటాడు.. సూప‌ర్ సిక్స్ అమ‌లు చేస్తున్నాడుగా..?  మీరు ఇచ్చిన దాని కంటే రెట్టింపు త‌ల్లికివంద‌నం కింద ఇచ్చాడుగా..అంటే..స‌గం మందికి ఎగ‌గొట్టాడు..?  మీకు రాలేదా.. అంటే మా ఇద్ద‌రు పిల్ల‌ల‌కూ వ‌చ్చిందంటాడు. మ‌రి ఎవ‌రికి ఎగ‌గొట్టాడు..? అంటే..మిగ‌తా వారికి..ఎవ‌రు వాళ్లు..ఏమో..సాక్షిలో రాస్తున్నారు...ఒకే..జ‌గ‌న్ ఐదేళ్ల‌లో ఫించ‌న్ రూ.1000/- పెంచితే..చంద్ర‌బాబు ఒకేసారి రూ.4000వేలు చేశాడుగా...? మ‌రి మ‌త్స్య‌కారుల‌కు మీరు రూ.10వేలు ఇస్తే..చంద్ర‌బాబు రూ.20వేలు ఇస్తున్నారుగా..?  ఎక్కువ ఇచ్చినంద‌కు కూడా ఓడిపోతారా..? ఉద్యోగుల‌కు 1వ తేదీనే జీతాలు ఇస్తున్నాడుగా...అదే విధంగా రోడ్లున్నీ బాగు చేస్తున్నాడుగా..?  రాజ‌ధాని, పోల‌వ‌రం ప్రాజెక్టులు శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నాడుగా..?  పోల‌వ‌రం నిర్వాసితుల‌కు సొమ్ములు వెంట‌నే ఇచ్చేశాడుగా..?  అందుకు ఓడిస్తారా..? అస‌లు చంద్ర‌బాబును ఓడించే స‌త్తా జ‌గ‌న్‌కు ఉందా..? అంటే ఏమో..?  అంటాడు..మా పార్టీ నాయ‌కులు మాత్రం ఇదే చెబుతున్నారు. ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా..మాదే గెలుపంట‌..? మ‌రి అప్ప‌ట్లో 175/175 అన్నారుగా..ఇవిఎంలు..వ‌ల్ల గెలిచాడు..మ‌రి రేప‌టి ఎన్నిక‌ల్లో ఇవిఎంలు ఉండ‌వా..? అంటే..ఉంటాయి..అంటాడు..మ‌రి ఎలా మ‌ళ్లీ జ‌గ‌న్ గెలుస్తాడు..? ఏమో..తెలియ‌దు...? ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా..మాదే గెలుపు..


ఇది వైకాపా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల మాన‌సిక ప‌రిస్థితి. వాళ్ల‌ను ఆ ర‌కంగా త‌యారు చేసిన జ‌గ‌న్‌ను ఖ‌చ్చితంగా అభినందించాలి. ఏమి జ‌రిగినా..మాదే గెలుప‌నే ప‌గ‌టి క‌ల‌లు వారికి కూడా నేర్పినందుకు..! వాస్త‌వానికి జ‌గ‌న్ ఏమి చేసినా..వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచే ఛాన్స్ లేనేలేదు. ఎందుకంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌ను చూసుకుంటే..గ‌తంలో 50శాతం ఓట్లు వ‌చ్చిన ఏ పార్టీ రెండోసారి ఓడిపోలేదు. (ఒక్క జ‌గ‌న్ త‌ప్ప‌) 1983లో 46శాతం ఓట్ల‌తో అధికారంలోకి వ‌చ్చి 1985లో మ‌ళ్లీ గెలిచింది. అదే విధంగా 1994లో 44శాతం ఓట్లు స్వంతంగా తెచ్చుకుని మ‌ళ్లీ 1999లో అధికారంలోకి వ‌చ్చింది. 2004లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టిడిపికి, కాంగ్రెస్ కు కేవ‌లం 1శాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయింది. ఇక 2009లో ప్ర‌జారాజ్యం చీల్చిన ఓట్ల వ‌ల్ల టిడిపి 1శాతం ఓట్ల తేడాతో ఓడిపోయింది. 2014లో టిడిపి మ‌ళ్లీ త‌న ఓట్ల‌ను రాబ‌ట్టుకుంది. 2019లో వైకాపా దాదాపు 50శాతం ఓట్లు సాధించి ఒక్క‌సారిగా 39శాతానికి దిగ‌జారిపోయింది. ఇటువంటి ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ త‌న ఓటు బ్యాంక్ ను పెంచుకోవ‌డం ఆ పార్టీకి చాలా క‌ష్టం. అదే స‌మ‌యంలో 57శాతం ఓట్లు సాధించిన కూట‌మి 40శాతానికి ప‌డిపోవ‌డ‌మ‌నేది జ‌రిగే ప‌నికాదు. చరిత్ర‌లో జ‌గ‌న్‌కు త‌ప్ప ఇంకెవ‌రికీ ఇటువంటి భంగ‌పాటు ఎదుర‌వ‌లేదు. రేపు కూట‌మికి కూడా అది ఎద‌ర‌వ‌దని ఆ వైకాపా నాయ‌కుడికి హితబోధ చేయాల్సి వ‌చ్చింది. ఇప్పుడు ఈ ప్ర‌భుత్వం త‌ప్పు చేయ‌డం లేద‌ని ఎవ‌రూ అన‌డం లేదు. కానీ జ‌గ‌న్‌లా బ‌రితెగించి మాత్రం చేయ‌డంలా..? అప్పుడు ఉన్న‌ట్లు ఇప్పుడూ అవినీతి, అక్ర‌మాలు, దౌర్జ‌న్యాలు, ఎంతో కొంత హింస ఉంది. కానీ..జ‌గ‌న్ వ‌లే..మాత్రం విచ్చ‌ల‌విడిత‌నాన్ని మాత్రం ప్రోత్స‌హించ‌డం లేదు. ఇదే జ‌గ‌న్‌కూ..వీళ్ల‌కు తేడా...? ఈ తేడానే..ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప్ర‌భావితం చేస్తుంది. 


(2)
(0)

Comments