జ‌గ‌న్‌ డిజిట‌ల్ బుక్‌...!?

29, Jul 2025

మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను వేధించిన వారిని, తాము అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత క‌క్ష తీర్చుకునే కార్య‌క్ర‌మం కోసం ఓ యాప్‌ను రూపొందిస్తున్నారు. ఈ యాప్‌లో త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, సానుభూతిప‌రుల మాట‌ను విన‌ని ప్ర‌భుత్వ అధికారులు, పోలీసుల పేర్ల‌ను ఆయా పార్టీ కార్య‌క‌ర్త‌లు న‌మోదు చేస్తారు. ఎవ‌రైతే వైకాపా నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల మాట విన‌ని వారు ఉంటారో..వారందరిపేర్ల‌ను ఈ డిజిట‌ల్ యాప్‌లో న‌మోదు చేస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు ఓ ఎస్ఐ త‌మ పార్టీ కార్య‌క‌ర్త చెప్పిన‌ట్లు ఆయ‌న ప్ర‌త్య‌ర్ధుల‌పై కేసు న‌మోదు చేయాల‌ని అడిగితే..చేస్తే..ఒకే...చేయ‌లేదంటే... ఆ ఎస్ఐ పేరును డిజిట‌ల్ యాప్‌లో న‌మోదు చేస్తారు. రేపు 2029 ఎన్నిక‌ల్లో గెలిచిన త‌రువాత‌..స‌ద‌రు డిజిట‌ల్ బుక్ ఓపెన్ చేసి..స‌ద‌రు ఎస్ఐని స‌ద‌రు కార్య‌క‌ర్త ముందు హాజ‌రు ప‌రుస్తారు. అప్ప‌ట్లో త‌మ మాట విన‌లేదు క‌నుక‌..ఆయ‌న బ‌ట్ట‌లు విప్పి స‌ద‌రు కార్య‌క‌ర్త ముందు నిల‌బెడ‌తార‌ట‌. ఇదే మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి కొత్త డిజిట‌ల్ బుక్‌. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, సానుభూతిప‌రులు..ఎవ‌రైతే త‌మ మాట విన‌ని ఉద్యోగులు, ప్ర‌భుత్వ అధికారులు, పోలీసులు ఉంటారో...వారి పేర్ల‌ను న‌మోదు చేసుకుంటూ వెళ‌తారు. దీనిపై ఈరోజు జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న పార్టీ నాయ‌కుల స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో మాజీ మంత్రి ఆర్‌.కె.రోజా మాట్లాడుతూ ఈ యాప్‌ను తొంద‌ర‌గా తీసుకురావాల‌ని అధ్య‌క్షుడు జ‌గ‌న్‌ను కోరారు. ఎంత త్వ‌ర‌గా తీసుకువ‌స్తే..అంత బాగుంటుంద‌ని, ప్ర‌స్తుతం ఎవ‌రూ త‌మ మాట విన‌డం లేద‌ని, దీని వ‌ల్ల కొంద‌రైనా త‌మ మాట వింటార‌ని ఆమె జ‌గ‌న్‌కు సూచించార‌ట‌. తాను అదే ప‌నిలో ఉన్నాన‌ని త్వ‌ర‌లో ఈ బుక్ బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని ఆయ‌న పార్టీ నాయ‌కుల‌కు వివ‌రించార‌ట‌.


అయితే...జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యంపై పార్టీలోని బుద్దిజీవులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లు ఎంత మందిని అలా..బెదిరిస్తాము...? ఒక వేళ రేపు నిజంగా అధికారంలోకి వ‌చ్చినా..ఇది అమ‌ల‌య్యే వ్య‌వ‌హార‌మైనా..అని ప్ర‌శ్నిస్తున్నారు. వాస్త‌వానికి ప్రస్తుత ప్ర‌భుత్వంలో ఉన్న అధికారులు, ఉద్యోగులు, పోలీసులు, ఇత‌ర యంత్రాంగం అంతా ప్ర‌స్తుత ప్ర‌భుత్వానికే అనుకూలంగా ఉంటుంది. వారు ప్ర‌స్తుత నాయ‌కుల మాటే వింటారు. ఇది ఏ ప్ర‌భుత్వం ఉన్నా జ‌రిగే తంతే.  అయితే..ఇప్పుడు త‌మ మాట విన‌డం లేద‌ని, వారంద‌రినీ డిజిట‌ల్ బుక్‌లో ఎక్కిస్తామ‌ని, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అంతు చూస్తామ‌ని బెదిరిస్తే.. దీని వ‌ల్ల ఎంత న‌ష్టం జ‌రుగుతుందో..వీళ్లు ఆలోచించ‌డం లేద‌ని విమ‌ర్శిస్తున్నారు. పార్టీ శ్రేయ‌స్సు కోరివారెవ‌రూ..ఇలా ఆలోచించ‌ర‌ని, ఇప్పుడే బెదిరింపుల‌కు దిగితే..ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి ఎలా ఉంటుందో..ఆలోచించుకోవాల‌ని వారు అంటున్నారు. గ‌తంలో టిడిపి ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఆ పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ త‌మ‌పై దాడులు చేసిన వారిని, తిట్టిన వారిని, త‌మ‌ను ఇబ్బంది పెట్టిన వారి పేర్ల‌ను రెడ్‌బుక్‌లో రాసుకుంటున్నాన‌ని చెప్పేవారు. అయితే..అప్ప‌ట్లో ఆయ‌నొక్క‌రే ఆ విధంగా బెదిరించేవారు. అయితే..ఇప్పుడు...వైకాపా మొత్తం ఇదే బెదిరింపుల‌కు దిగుతోంది. సామాన్య‌కార్య‌క‌ర్త నుంచి పార్టీ అధినేత వ‌ర‌కూ అంద‌రూ..బెదిరింపుల బాటే ప‌డుతున్నారు. ఇది చివ‌ర‌కు ఓ జోక్‌గా మారిపోతుంద‌ని పార్టీ శ్రేయ‌స్సు కోరుకునేవారు వాపోతున్నారు. లోకేష్ రెడ్‌బుక్ ఎలా న‌వ్వుల పాల‌యిందో..ఇప్పుడు జ‌గ‌న్ డిజిట‌ల్ బుక్ కూడా అదే విధంగా అవుతుంద‌ని కూడా వారు అంటున్నారు. మొత్తం మీద జ‌గ‌న్ తెస్తోన్న డిజిట‌ల్ బుక్‌పై పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. 


(3)
(7)

Comments


  • 2025-07-29 10:21:09

No use and useless Thinking.. ippudu jarigina damage chalu.. further prajalaki ela daggara Kavalo karyakarthalu chudali Boss prakaramu velthe 2029 lo Zero untadhi party undadu Boss ku emi kadu manake nastamu

(0)
(0)