సమాచార శాఖ ఘోర అపచారం!

15, Aug 2025

సమాచార శాఖ అనేది ప్రభుత్వానికి ముఖం లాంటిది. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరవేసేందుకు వారధిలా పనిచేస్తుంది. సమాచార శాఖ ద్వారా వచ్చిన సమాచారం ఏదైనా అధికారిక ప్రామాణికంగానే పరిగణించాలి. అయితే స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకల సమాచారం మీడియాకు చేరవేతలో సమాచార శాఖ ఘోర తప్పిదానికి పాల్పడింది. స్వాతంత్య్ర‌  దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి, హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, శాసనమండలి చైర్మన్ తదితరులు పతాకావిష్కరణ (flag hoisting) చేశారు. ఈ సమాచారాన్ని ఆంగ్లంలో మీడియాకు చేరవేసే విషయంలో సమాచార శాఖ ఘోర తప్పిదానికి పాల్పడింది. వారంతా జాతీయ పతాకాన్ని " unfurl " చేసినట్టు అధికారిక వాట్సాప్ గ్రూప్.ద్వారా సమాచారం ఇచ్చారు. వాస్తవానికి జాతీయ పతాకాన్ని గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి, గవర్నర్ వంటి ప్రముఖులు " unfulr " చేస్తారు. ఆగస్ట్ 15 వ తేదీన unfulr చేయరు.  తెలుగులో కూడా జెండా ఎగుర‌వేసిన అని ఇచ్చారు. వాస్త‌వానికి జెండా ఎగుర‌వేయ‌రు... ఆవిష్క‌రిస్తారు. ఇది చూడటానికి స్వల్ప విషయం గానే కనిపిస్తున్నప్పటికీ, ఆంగ్ల మీడియా దృష్టిలో ఆ ప్రముఖులు అందరూ తప్పిదానికి పాల్పడినట్టుగానే వుంటుంది. జాతీయ పతాకం విషయంలో ఏ చిన్న తప్పిదం అయినా శిక్షార్హమైన నేరంగా చట్టం లో పొందుపరిచారు. ఎంతో సున్నితమైన ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమాచార అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారో అర్థం కావటం లేదు. సమాచార శాఖ అధికారిక వాట్సాప్ గ్రూప్ ద్వారా వచ్చిన అధికారిక సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకొని ఆ ప్రముఖులు జాతీయ పతాకాన్ని అవమానించారంటూ  ఎవరైనా న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేస్తే పరిస్థితి ఏమిటి? సమాచార శాఖ లోని కొంతమంది అధికారుల అజ్ఞానానికి గౌరవప్రదమైన స్థానాలలో ఉన్న ప్రముఖులు అభాసు పాలు కావలసిన పరిస్థితి ఉత్పన్నం అయింది. ఇది పొరబాటున జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగా చేశారా అన్న విషయంపై దర్యాప్తు జరపాల్సిన అవసరమున్నది.


(1)
(0)

Comments


  • 2025-08-15 01:16:39
  • murthy

స‌మాచార‌శాఖ మంత్రికే ఆ శాఖ‌పై ఆస‌క్తి లేదు. సొమ్ములు కావాలి అంతే..?

(1)
(0)
  • 2025-08-15 12:16:10
  • JAGAN

ఇలాంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం సర్

(0)
(0)