ఫ్రీ బస్సు-సూపర్ హిట్...!
కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ వరుసగా నెరవేర్చుకుంటూ వస్తోంది. దానిలో భాగంగా ఈనెల 15వ తేదీన ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు పథకం సూపర్‌డూపర్ హిట్ అయింది. ఈ పథకం ఇంతగా విజయవంతం అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఊహించనంతగా పథకం విజయవంతం అవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుచూపే కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే..ఆయన ఈ పథకం అమలుకు తొందరపడలేదు. ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతోన్నఫ్రీబస్సు పథకంపై ఏడాదిగా ఆయన తన మంత్రులతో, అధికారులతో చర్చిస్తూనే ఉన్నారు. పథకం అమలుకు ముందు వారిని ఆయా రాష్ట్రాలకు పంపి దానిలోని సమస్యలు, ఇతర లొసుగులను తెలుసుకోమని, దాని ద్వారా ఇక్కడ అటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తుగానే చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఎంత మంది మహిళలు ఉన్నారు..? వారిలో రోజుకు ఎంత మంది ప్రయాణాలు చేస్తారు..? ఎన్ని బస్సులు ఉన్నాయి..? వాటిలో ఏయే బస్సుల్లో అనుమతించాలి..? ఇతర సర్వీసులకు ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు ఎలా తీసుకోవాలనే దానిపై ఆయన ప్రత్యేక దృష్టిసారించారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ముందస్తు చర్యలు తీసుకుని పథకాన్ని పక్కాగా ఆయన అమలులోకి తెచ్చారు. దీంతో..ఇప్పటీ పథకం సూపర్ డూపర్ హిట్ అయింది. వాస్తవానికి ఈ పథకం అమలు చేస్తారనే వార్తలు వచ్చిన వెంటనే పక్కనే ఉన్న తెలంగాణ, కర్ణాటకల పరిస్థితి ఇక్కడా ఉంటుందని మెజార్టీ ప్రజలు ఊహించారు. తెలంగాణలో ఈ పథకం అమలులోకి వచ్చిన్నప్పుడు బస్సులో సీట్ల కోసం మహిళలు కుస్తీలు పట్టారు. ఇది ఒకరోజో..రెండు రోజులో కాదు...దాదాపు ఇప్పటికీ అదే సీన్ కనిపిస్తోంది. ప్రభుత్వ ముందస్తు ఏర్పాట్లు లేకపోవడం దీనికి కారణం. కర్ణాటకలోనూ అదే పరిస్థితి. అయితే..ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎటువంటి గందరగోళ పరిస్థితులు లేవు. రోజుకు సుమారు 15లక్షలకు పైగా మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. పథకం అమలులోకి వచ్చిన తరువాత రోజు రోజుకు మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిపోతోంది. పల్లెవెలుగు, అల్ట్రాపల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్సెప్రెస్, ఆల్ట్రా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో మహిళలు భారీగా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే..ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు. కొంత మంది సామాన్య ప్రజలకు కొన్ని సర్వీసుల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
చిరునవ్వులు చిందిస్తోన్న మహిళ...!
ముఖ్యంగా ఫ్రీ బస్సుల వల్ల బస్సుల్లో ఆక్యుపెన్సీ రేటు పెరిగి ఇతర బస్సుల్లో భారీగా రద్దీ ఏర్పడుతోంది. దీంతో కొందరికి కొంత మేర ఇబ్బందులు వస్తున్నాయి. అయితే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంపూర్ణంగా ఈ పథకం అమలు చేయడంతో మహిళల్లో పూర్తి సంతృప్తి కనిపిస్తోంది. మహిళలు ఎవరైనా..వాళ్లు ఏర్గానికి చెందిన వారికైనా ఫ్రీ బస్సు పథకం వర్తించడంతో వారి మోముల్లో సంతోషం స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న గుంటూరు నుంచి విజయవాడకు Janamonline.com ప్రతినిధి ప్రయాణిస్తోన్నప్పుడు కొందరు మహిళలను ఫ్రీ బస్సు ప్రయాణం గురించి ప్రశ్నించినప్పుడు ఆనందంతో చిరునవ్వులు చిందించారు. మీకు ఉచితమేగా..అన్నప్పుడు..వాళ్ల మొహాల్లో కనిపించిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. స్పల్పమొత్తమైనా..ఉచితంగా ప్రయాణించడం గతంలో ఎప్పుడూ జరగని విషయం. దాంతో వారిలో ఆనందం పొంగిపొర్లతోంది. ఒక కుటుంబంలో ఎంత మంది మహిళలు ఉన్నా..వారంతా ఉచితంగా ప్రయాణించడం.. పెద్దగా ఇబ్బందులు లేకపోవడంతో వారి సంతోషం మరింత రెట్టింపవుతోంది. కాగా..ఈ ఉచిత ప్రయాణంపై ప్రతిపక్ష వైకాపా ఎప్పటిలాగానే విమర్శలు గుప్పించింది. కొంత మంది పార్టీ వారితో ఎస్సీ బస్సుల్లో ప్రయాణిస్తూ తమకు ఉచితబస్సు ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. అయితే..వాళ్లు ఎంత చెప్పినా..ఎన్ని ఆరోపణలు చేసినా..ఇంకేమి చేసినా మహిళలు మాత్రం దాన్ని పట్టించుకోవడం లేదు. ఉచిత బస్సుపై వైకాపా చెప్పే అబద్దాలను వారు నమ్మడం లేదు. దీంతో వైకాపా కూడా ఇక దీనిపై విమర్శలు అనవసరమని ప్రస్తుతానికి సైలెంట్ అయింది. కాగా..కొందరుమహిళలు అసలు పథకం ఎలా అమలు అవుతుందో చూద్దామనుకుని బస్సులు ఎక్కుతున్నారు. కొందరు అవసరం కోసం..కాగా..మరి కొందరు సరదా కోసం వెళుతున్నారు. మొత్తం మీద చంద్రన్న అమలు చేస్తోన్న ఉచిత బస్సు పథకం ఆయన అంచనాలను మించి సక్సెస్ అయిందని చెప్పవచ్చు.