ఉద్యోగుల రిటైర్‌మెంట్‌పై ఫేక్ జీవో...!

29, Aug 2025

ఉద్యోగుల రిటైర్‌మెంట్ వ‌య‌స్సును పెంచుతున్నారంటూ..సోష‌ల్ మీడియాలో ఓ ఫేక్ జీవో స‌ర్క్యులేట్ అవుతోంది. జీవో నెం. RT.1575 పేరిట ఈ ఫేక్ జీవోను కొంద‌రు తిప్పుతున్నారు. అయితే...ఈ జీవో ఫేక్ అంటూ..రాష్ట్ర స‌మాచార‌శాఖ డైరెక్ట‌ర్ హిమాన్ష్‌శుక్లా వివ‌ర‌ణ ఇచ్చారు. ఫ్యాక్ట్‌చెక్‌లో ఈ జీవోను ఫేక్‌గా తేల్చారు. వాస్త‌వానికి ఈ నెంబ‌ర్ మీద ఈ రోజు GOIRలో ఎటువంటి జీవో లేదు. అయితే ఇదే నెంబ‌ర్ మీద 28వ తేదీన ఓ జీవో ఉంది. అయితే..ఆ జీవోలో ఉద్యోగుల రిటైర్‌మెంట్‌పై ఎటువంటి వివ‌రాలు లేవు. అయితే..దీన్ని కొంద‌రు ఫేక్‌గాళ్లు ఉద్యోగుల రిటైర్‌మెంట్ జీవోగా మార్చారు. వైకాపాకు మ‌ద్ద‌తు ఇచ్చే కొన్ని సోష‌ల్ మీడియా సంస్థ‌లు దీన్ని స‌ర్క్యులేట్ చేస్తున్నాయి. ఉద్యోగుల రిటైర్‌మెంట్ వ‌య‌స్సును పెంచుతున్నారంటూ ఇటీవ‌ల వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే..ఒకేసారి 62 ఏళ్లు ఉన్న రిటైర్‌మెంట్ వ‌య‌స్సును 65 చేస్తూ ప్ర‌భుత్వం జీవో ఇచ్చిందంటూ..వారు వార్త‌ల‌ను సృష్టించారు. వాస్త‌వానికి జ‌న‌మ్ఆన్‌లైన్‌.కామ్ కూడా ఈ వార్త విష‌యంలో త‌ప్ప‌ట‌డుగు వేసింది. వాస్త‌వాల‌ను ప‌రిశీలించ‌కుండా..వారు స‌ర్య్కులేష‌న్ చేస్తోన్న జీవోను చూసి వార్త‌ను ఇచ్చింది. అయితే..అది త‌ప్పుడు జీవో అని తెలిసిన త‌రువాత ఆ వార్త‌ను నిలిపివేసి, సైట్ నుంచి తొల‌గించింది. యువ‌త‌ను రెచ్చ‌గొట్ట‌మే ధ్యేయంగా కొన్ని పార్టీల‌కు అనుబంధంగా ఉన్న సంస్థ‌లు ఇటువంటి జీవోలను సృష్టిస్తున్నారు. ప్ర‌భుత్వ వ‌ర్గాలు దీనిపై అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. కాగా..ఈ ఫేక్‌ జీవో విష‌యంలో రాష్ట్ర స‌మాచార‌శాఖ డైరెక్ట‌ర్ హిమాన్ష్ శుక్లా వేగంగా స్పందించారు. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోన్న అవాస్త‌వ ప్ర‌చారంపై ఆయ‌న వెంట‌నే స్పందించి వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల ముందుకు తెచ్చారు. హిమాన్ష్ లానే మిగ‌తా అధికారులు కూడా ఇటువంటి ఫేక్ ప్ర‌చారాల‌పై వేగంగా స్పందిస్తే..ఫేక్‌గాళ్ల ఆట‌లు సాగ‌నే సాగ‌వు.  


(2)
(0)

Comments