ఎపి భవన్ కమీషనర్‌గా సౌరభ్ గౌర్
30, Aug 2025
న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్‌గా పౌరసరఫరాలశాఖ కమీషనర్ సౌరభ్ గౌర్‌ను ప్రభుత్వం తాత్కాలికంగా నియమించింది. ప్రస్తుతం ఎపి భవన్ రెసిడెంట్ కమీషనర్‌గా ఉన్న లవ్ అగర్వాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లడంతో ఆయన స్థానంలో పూర్తి అదనపు బాధ్యతలతో గౌర్‌ను ప్రభుత్వం నియమించింది. లవ్ అగర్వాల్ తాను కేంద్ర సర్వీసులకు వెళతానని కోరడంతో ప్రభుత్వం ఆయనను రిలీవ్ చేసింది. లవ్ అగర్వాల్‌ను కేంద్రంలోని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖలో అదనపు కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన నియామకాన్ని కేబినెట్ మంత్రుల నియామక కమిటీ (ఎసిసి) ఆమోదించింది. కాగా ప్రభుత్వ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ సౌరబ్ గౌర్ ఎపి భవన్ ఇన్‌ఛార్జి రెసిడెంట్ కమీషనర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తారు.